చైన్‌ స్నాచర్‌ ఆటకట్టించిన వరంగల్‌ పోలీసులు.

చైన్‌ స్నాచర్‌ ఆటకట్టించిన వరంగల్‌ పోలీసులు.

*వరంగల్, నేటిధాత్రి

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా వారి మెడల్లో చైన్‌ స్నాచింగ్‌లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి సూమారు 23లక్షల 50వేల రూపాయల విలువ గల 237గ్రాముల బంగారు పుస్తెల తాళ్ళు, గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, పదివేల రూపాయల నగదు, ఒక సెల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police Commissionerate

ఈ అరెస్టుకు సంబందించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వివరాలను వెల్లడిస్తూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్‌(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్న నిందితుడు డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఓ సిమెంట్‌ కంపెనీలో క్వాలిటీ టెక్నిషన్‌గా హైదరాబాద్‌లో పనిచేసేవాడు ఇదే క్రమములో మొదటగా ఈ ఏడాది ఇదే సిమెంట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సహోఉద్యోగి ఇంటిలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి దానిని స్థానిక మణిప్పురం గోల్డ్‌ లోన్‌ కంపెనీలో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసేడు. ఈ సంఘటలో నిందితుడుని స్థానిక నెరెడ్‌మెట్‌ పోలీసులు ఈ ఏడాది అరెస్టు చేసిన జైలుకు తరలించారు.
బెయిల్‌పై విడుదలైన నిందితుడిలో ఏలాంటి మార్పు రాకపోగా తన జల్సాలకు అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రొడ్డుపై వెళ్తున్న మహిళల మెడలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్న నిందితుడు ముందుగా చైన్‌ స్నాచింగ్‌ చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వెళ్ళి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం పది చైన్‌ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు, రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, అలాగే సుబేదారి, కాజీపేట,హసన్‌పర్తి, కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లాలోని చిగురుమామిడి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చైన్‌ స్నాచింగ్‌ చోరీలకు పాల్పడగా, హన్మకొండ, హసన్‌పర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిందితుడు మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడటం జరిగింది. ఈ వరుస చైన్‌ స్నాచింగ్‌ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్‌, హన్మకొండ ఏసిపిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడుని గుర్తించిన పోలీసులు పక్కా సమచారంతో ఈ రోజు ఉదయం పోలీసులు ఉదయం యాదవ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద వాహన కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీ చేసిన బంగారు గొలుసులను విక్రయించేందుకు అనుమానస్పదంగా చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడుని రోడ్డుపై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న నిందితుడుని పోలీసులు పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన చైన్‌ స్నాచింగ్‌, ద్విచక్ర వాహన చోరీలను అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతను నివాసం వుంటున్న అద్దె ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన క్రైమ్స్‌ డిసిపి గుణశేకర్‌, క్రైమ్స్‌ ఏసిపి సదయ్య, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, కెయూసి, సిసిఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్‌, రాఘవేందర్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, సిసిఎస్‌ ఎస్‌.ఐ లు రాజ్‌కుమార్‌, శివకుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్ళు అంజయ్య, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్‌, చంద్రశేకర్‌, రాములు, నగేష్‌లతో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version