చంద్రగిరిలో ఇద్దరూ గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
రూ. 6,60,000 విలువ చేసే 22 కేజీల గంజాయి స్వాధీనం
చంద్రగిరి(నేటి ధాత్రి:
చంద్రగిరి మండల పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్
ఎం. సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో
స్మగ్లర్ల అరెస్టు పై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఏ ఎస్ పి రవి మనోహరాచారి పర్యవేక్షణలో డి.ఎస్.పి బి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. డీఎస్పీ బి ప్రసాద్ కు గంజాయి అక్రమ రవాణా పై వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం తొండవాడ జాతీయ రహదారి వంతెన వద్ద సీఐ సురేష్ కుమార్ నేతృత్వంలో ఎస్సైలు అరుణాచలం, రవి ప్రకాష్ రెడ్డి, సిబ్బంది తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదమైన రెండు బ్యాగులు కలిగిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను తనిఖీ చేయగా ఆరు ప్యాకెట్లు లో 22 కేజీల గంజాయి పట్టుకున్నారు. స్థానిక తహశీల్దార్ శివరాం సుబ్బయ్య సమక్షంలో పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లి గ్రామానికి చెందిన శశి కుమార్, చంద్రగిరి టౌన్ అక్క గార్ల కాలనీకి చెందిన షేక్ లాల్ గా గుర్తించారు. పోలీసులు నిందితులను విచారించగా వైజాగ్ నుండి తెలిసిన వ్యక్తి ద్వారా తిప్పించుకుని చంద్రగిరి పరిసర ప్రాంతాలలో అమ్మాలనుకున్నట్లు తెలింది. నిందితులు గంజాయి వినియోగించే వారి పేర్లను, గంజాయి విక్రయిస్తున్న వారి పేర్లను కూడా తెలిపినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాలో ఈ ఇద్దరితోపాటు మరికొందరి పాత్ర ఉందని పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. త్వరలో ఆ పాత్రధారులను కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. కేసు నమోదు చేసి ముద్దాలను తిరుపతి కోర్టుకు హాజరు హాజరు పరిచినట్టు సురేష్ కుమార్ తెలిపారు. న్యాయస్థానం ముద్దాయిలకు 14 రోజులు రిమాండ్ విధించింది అన్నారు. గంజాయి అక్రమ రవాణా కేసులో ప్రతిభ కనబరిచిన చంద్రగిరి స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎమ్. సురేష్ కుమార్, యస్.ఐలు రవిప్రకాష్ రెడ్డి, అరుణాచలం సిబ్బంది ఎమ్ నాగరాజు, శ్రీనివాసులు, చలపతి, రాజశేఖర్, మణి, ముణిప్రసాద్ మహేష్ లకు క్యాష్ రివార్డ్ లను ప్రకటించినట్లు సిఐ సురేష్ కుమార్ తెలిపారు…
