హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ… భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 4: సైబరాబాద్‌లో డ్రగ్స్ పార్టీని (Drugs Party) ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేవారు. హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు కన్జ్యూమర్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
