గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

బ్రేకింగ్ న్యూస్

నేటిధాత్రి, హైదరాబాద్.._

కొండా మురళీ పిర్యాదు లేఖ..

హైదరాబాదులోని గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

హైదరాబాద్ నేటిధాత్రి:

2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అప్పగించారు.

నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంకు సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టగా వరంగల్ వ్యవహారాలు మొత్తం నేనే పర్యవేక్షించడం జరిగింది.

వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులు, గిరిజనులకు అవకాశం దక్కాలని, ఈ జిల్లాలో ఎక్కువ మందికి పునర్విభజనలో ఆయా వర్గాలకే నేను సీట్లు కేటాయించాను. ఎందుకంటే, అట్టడుగువర్గాలకే న్యాయం జరగాలన్నది నా సిద్ధాంతం. నేను నా రాజకీయ పంథాను ప్రారంభించిందే నిమ్న వర్గాలకు న్యాయం చేయాలని.

వరంగల్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు నిమ్నవర్గాలకు కేటాయించడంలో నాడు నాదే కీలక పాత్ర.

వరంగల్ పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఒక దాన్ని ఎస్సీ, మరొక దాన్ని ఎస్టీ చేసి దళిత, గిరిజనులకు ప్రత్యేక అవకాశం కల్పించేలా చేసిన.

కాగా, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక జిల్లాలో రెండు స్థానాలు రిజర్వు కావడం కేవలం వరంగల్ లో మాత్రమే సాధ్యం అయింది. అందు కోసం నేను తీవ్రంగా కృషి చేశాను.

సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా… ఈ ప్రక్రియతో తాను సీటును కోల్పోయానని… అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి…. అందుకు నేనే(కొండా మురళీయే) కారణమని చెబుతూ రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళిన పరిస్థితి ఉన్నది.

అయితే, నేడు ఆయన అల్లుడు అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, వరంగల్ జిల్లా ఇంఛార్జీ మంత్రిగా ఉండి నా సతీమణి శ్రీమతి కొండా సురేఖ మీద కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే కోపంతో ఆయన ఉన్నట్టు తాజా పరిణామాలు చూస్తుంటే నిశితంగా అర్థం అవుతున్నది.

వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యను వెంట పెట్టుకొని మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయినా, మేము వారికి ఎక్కడా ఇబ్బందులు చేయలేదు.

ఇదే బస్వరాజు సారయ్య, మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో నా సతీమణి కొండా సురేఖ మీద 2014లో 40 వేల ఓట్లతో ఓడిపోయారు.

ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, రామసహాయం సురేందర్ రెడ్డి గారికి ప్రధాన శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా ఉన్న మేము దాదాపు ప్రతి ఎన్నికల్లో గెలిచి నిలుచున్నాము.

ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కు చెందిన నాయకులు. ఆయన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేస్తే, ఆ ఎన్నికల్లో కొండా సురేఖకు ఘనమైన మెజారిటీ వచ్చింది. కానీ, నరేందర్ రెడ్డికి కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈరోజు వరకు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. ఆమె మా వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము(నేను నా సతీమణి) వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఇదీ వరంగల్ లో కొండా మురళి, కొండా సురేఖ దంపతుల పవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నేను రాజీనామా చేసి వచ్చిన. అది నా నిబద్ధత. కొంతమంది లీడర్ల మాదిరి పార్టీ మారినా… పదవిలో కొనసాగలేదు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా గెల్సిన ఏకైక ఎమ్మెల్సీని. ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డ మహేష్ కుమార్ గారి మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను. అందుకే, స్వయంగా వచ్చి తెలియజేయడం జరిగింది.

వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు

ఈ నియోజకవర్గంలో మా ప్రభావం స్పష్టంగా ఉంటుంది.

ఈ నియోజకవర్గంలో మాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.

వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాక మునుపు… ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చేస్తున్న అరాచకాలకు అడ్డు నిలిచి పోరాడినందుకు మాకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

అయితే, ప్రస్తుత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎవరు ఎటు రమ్మంటే అటు వెళ్తారు. ఆయనకు ప్రత్యేకంగా వర్గాలు అంటూ ఏమీ లేవు. రేపు మేము ఏదైనా ప్రోగ్రాంకు రమ్మని పిలిచినా వచ్చి వెళతారు.
మాతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి.

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

ఒకానొక సందర్భంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి నన్ను (కొండా మురళీ) నిలుచోవాలని అక్కడి ప్రజల నుంచే విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి.

కానీ, ఎన్నికల సమయంలో అప్పటికే నా సతీమణి కొండా సురేఖ వరంగల్ ఈస్టు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మా కుటుంబం నుంచే రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక చేయలేదు.

ఈ నియోజకవర్గంతో నాకు (కొండా మురళికి) చాలా మంచి పట్టు ఉన్నదని సర్వత్రా తెలిసిందే.

గతంలో మదుసూదనాచారి గెలుపు కోసం తీవ్రంగా నేను కృషి చేశాను.

వాస్తవానికి గండ్ర సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి వచ్చారు. అయినా నేను సపోర్టు చేసినం. ఆ సమయంలో మా సపోర్టును ఆయన అడిగారు. మేము కూడా పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేశాము.

అయితే, ఈయన ప్రస్తుతం మా మీదకు వ్యతిరేకంగా ఇతర నాయకులతో కలవడం శోచనీయం.

అయితే, ఈయనతో కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి.

ములుగు సీతక్క

మంత్రి సీతక్క గారితో మాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారు. అయితే, కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖకు…. మంత్రి సీతక్క కు గ్యాప్ వచ్చిందని, కావాలని కొన్ని పేపర్లలో వార్తలు రాయిస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారు.

పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఈ నియోజకవర్గం పూర్తిగా మాదే (కొండా సురేఖ, కొండా మురళి దంపతులదే). గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నా భార్య కొండా సురేఖ మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మంత్రిగా కొనసాగిన విషయంలో అందరికీ తెలిసిందే.

ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలంలో కొండా మురళి, కొండా సురేఖకు ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలున్నారు. ఇది జగమెరిగిన సత్యం.

ఎన్నికల సమయంలో కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి మా మద్దతు అడిగారు. మేము నిస్వార్ధంగా ఆయనకు సపోర్టు చేసినం. మా మద్దతుతోనే గెలిచారు.

ఈరోజు ఆయన కూడా మాకు వ్యతిరేకంగా గుడుపుఠాణి కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించిన క్రషర్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపిస్తే… వాళ్ళు వేరే బ్రోకర్స్ ద్వారా వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి కొంత ముట్టజెప్పి వాటిని ఓపెన్ చేయిస్తున్నారు. వీటి ద్వారానే బీఆర్ఎస్ నేతలకు… ఇతర నియోజకవర్గంలోనే నేతలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. దీనివల్ల బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడుతున్నది. ఇది కాంగ్రెస్ కి నష్టం. ఇది జిల్లాలో అందరికి తెలిసిందే. అయినా ఎవరు నోరు మెదపరు.

ఇక పరకాలలో నా ఊరు ఉన్నది. గతంలో అక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ రావాలంటే రాలేకపోయేవారు. వెహికల్ దిగి నడిచి వచ్చిన దుస్థితి ఉంది కూడా. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో కూడా మా గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వచ్చే సాహసం చేయలేదు. కానీ, ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడి వచ్చారు. రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు.

ఆయన మాటలతో అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు ఎదురైతే ఎవరిది బాధ్యత?

వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి

నాయిని రాజేందర్ ఈ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ, ఎన్నికల ముందు వచ్చి మా (కొండా దంపతుల) మద్దతు అడిగారు. అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను ఎన్నికల కదనరంగంలో తట్టుకోవాలంటే తనకి మా మద్దతు కావాలని ప్రాధేయ పడ్డారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీతో వరంగల్ తూర్పులో తిరుగుతున్నారు.

వరంగల్ ఈస్టులో ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు మా ప్రమేయం లేకుండానే, ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారు.

తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టింగులు ఇచ్చుకోవడం ఏంటి?

ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి…. మాకు సమాచారం లేకుండా మా అధికార పరిధిలోకి చొచ్చుకురావడం సహేతుకం కాదు కదా.

జనగామ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతో బాగానే ఉంటున్నరు.

స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను ముంచి మన పార్టీలోకి వచ్చిండు. స్థానిక కాంగ్రెస్ ఇంఛార్జీ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నడు. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నడు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పినా… నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్ కావడం లేదు. కానీ, జిల్లాలో ఏం చేస్తున్నాడో యావత్ రాష్ట్రమంతా తెలుస్తున్నది.

పాలకుర్తి యశశ్వినీ రెడ్డి:

ఈమె యాంటీ దయాకర్ రావు వర్గమే. నేను ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్టు చేసిన. అన్ని విధాలుగా అండగా నిలిచిన. నన్ను ఇక్కడి నుంచి నిలబడాలని చాలామంది చెప్పినా… నిలబడకుండా వారికే మద్దతు ఇచ్చి గెలిపించినం.

డోర్నకల్: రాంచంద్రనాయక్: ఈ నియోజకవర్గంలో మనకు పెద్దగా పట్టు లేదు. కానీ, ఏజెన్సీ ఏరియా, నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగు ఉన్నది. నేను కూడా అక్కడి వారు ఎవరు వచ్చినా వారి పనులు చేయడం జరుగుతున్నది.

మహబూబాబాద్: ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే గెలిచారు. ఒక దఫా వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ మీద కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే… ఆయనకు కేవలం 2 వేల ఓట్లు వచ్చాయి. డిలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయిందని… అందుకు నేనే కారణమని నాపై కోపంతో ఉన్నట్టు ఉన్నారు వేం నరేందర్ రెడ్డి.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గది, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. 

విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించి.. ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదవాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాలయం ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ.

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్.

చర్ల నేటిధాత్రి:

 

దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు. వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృ ద్ధి ఆర్థిక వ్యవస్థను సరళీ కృతం చేయడం పరిశ్రమలకు రాయితీలు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను మడకం పద్మ మరియు రామ్ కుమార్ గుండెపూడి భాస్కరరావు ఉప్పరిగూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మరియు రాజా సర్కార్ బొళ్ల వినోద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని. అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిఆరోజు నాటిన మొక్కలే ఈరోజు దేశానికి వృక్షాలై . ఏ లుతున్నాయని అలాగే దేశంలోని యువతకు 21 సంవత్సరానికి ఓటు హక్కు కల్పించిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని అలాగే దేశంలో సాంకేతిక విద్యను విప్లవాన్నితీసుకువచ్చి టెక్నాలజీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశానికి. ఆయన ఐయామ్ లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారని సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారని బలమైన అర్థిక దేశంగా నిలబెట్టారని అలాగే పాకిస్తాన్ కి ఇందిరాగాంధీ బలమైన గుణపాఠం చెప్పిందని. ఈ దేశానికి ఇవన్నీ తెచ్చిన. రాజీవ్ గాంధీ అని. తీవ్రవాద ముసుగులో రాజీవ్ గాంధీని హతమార్చారని దేశం గురించి ఆయన ప్రాణాలు అర్పించారని అలాగే తల్లి ఇందిరా గాంధీ కూడా దేశానికి ప్రాణాలు అర్పించారని అటువంటి వారు ఇప్పుడు మనలో లేకపోవడం చాలా బాధాకర విషయమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినా గుమ్మడి శ్రీదేవి ని మంగళవారం రోజున హైదరాబాదులోని గాంధీభవన్లో శాలువాతో సన్మానించిన ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కమలాక్షి
హైదరాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ సమ్మేళన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా హాజరై మాట్లాడుతూ దేశంలోనే లక్షకుపైగా సభ్యత్వలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. తదనంతరం భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా సభ్యత్వలు నమోదు చేసిన సందర్భంగా *మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అయిన గుమ్మడి శ్రీదేవి ని శాలువాతో సన్మానించినారు, పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో చట్టసభలకు అవకాశం కల్పించేలా తన వంతు సహకారం ఉంటుందని ఆమె అన్నారు
కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version