అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా గణ నివాళులర్పించాన
★ అంబేద్కర్ యువజన సంఘం యువకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్/ఝరాసంగం: అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఝరాసంగం మండల పరిధిలోని కమాల్ పల్లి గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం యువకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడు ఏ.రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రధాన నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ డిసెంబర్ 6న మరణించారు. ఆయన గొప్ప న్యాయనిపుణుడు మాత్రమే కాదు, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త మరియు రాజకీయ నాయకుడు కూడా, భారతదేశంలోని వెనుకబడిన తరగతుల హక్కులు మరియు అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన జీవితం అసమానతలతో పోరాడటానికి మరియు న్యాయం మరియు సమానత్వం ఆధారంగా సమాజాన్ని సృష్టించడానికి అంకితం చేశారు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
