హైటెక్ కాలని నూతన కమిటీ ని సన్మానించిన…

హైటెక్ కాలని నూతన కమిటీ ని సన్మానించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 9వ వార్డు లో గల హైటెక్ కాలనీ (వెంగళరావు వెంచర్) లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న కమిటీ యొక్క అధ్యక్ష, కార్యదర్శి శ్రీ క్యాతం సతీష్ కుమార్ బొమ్మకంటి పవన్ కుమార్ తో పాటు గౌరవ అధ్యక్షులు సామల లక్ష్మారెడ్డి సాదు సదానందం లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సన్మానించారు.
హైటెక్ కాలని అభివృద్ధి కోసం కోత్తగా ఎర్పాటు చేసుకున్న కమిటీ నిరంతరం కృషి చేసి హైటెక్ కాలనీని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.మీ కాలనిలో అభివృద్ధి పనులు చేయడం కోసం నా వంతు కృషి చేస్తానని తెలుపుతూ,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు కాలనీని విసిట్ చేసి,పెండింగ్‌ పనులను కంప్లీట్ చేస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉందని కాలని అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలని వాసులు తాడూరి రమణారెడ్డి, పసునూటి సుమన్, సల్ల సంపత్, చల్లా రవీందర్ రెడ్డి, గోపతి రాజు, రత్నం రోషి రెడ్డి, పోతునూరి శశికాంత్, నిమ్మతి జితేందర్, కట్కూరి శ్రీనివాస్, నేరెళ్ల సతీష్, రాగుల కనకయ్య, ఉమ్మనబోయిన రవీందర్, తిరుపతిరెడ్డి, పైతారి మహేష్, అలుగూరి సదయ్య, మాదారపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కాలనీ15వ వార్డులో రేషన్ కార్డుల పంపిణీ..

సిరిసిల్ల అంబేద్కర్ కాలనీ15వ వార్డులో రేషన్ కార్డుల పంపిణీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్, 15వ వార్డు కాలనీలోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకునూరి బాలరాజు ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగినది. బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలందరికీ ఇలాంటి రేషన్ కార్డులు ఇవ్వ లేదు, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలందరికి ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరమని అంతే కాకుండా పేదకుటుంబలకు రేషన్ షాపులలో అందించే సన్న బియ్యం తింటున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేదురి లక్ష్మణ్,గొల్లపల్లి పరశురాములు,నక్క నరసయ్య, కొమ్ము త్యాగరాజు, ఆకునూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ కాలనీలో శ్రీ అంబా భవాని టెంపుల్..

ఇందిరమ్మ కాలనీలో శ్రీ అంబా భవాని టెంపుల్ దగ్గర బోరు మోటర్ ప్రారంభోత్సవం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో శ్రీ అంబా భవాని ఆలయం వద్ద కొత్త మోటారు బోరు వేయించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో స్థానిక అంబ భవాని టెంపుల్ దగ్గర బోరు మోటర్ ప్రారంభోత్సవానికి నిధులు రావడానికి కృషి చేసి న. కేకే మహేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ. అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి ఇందిరమ్మ కాలనీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గుల్లపల్లి అనూష. దేవాలయ పంతులు శ్రీ పొద్దుల శ్రీనివాస్ తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. అంబటి అంజయ్య. దిడ్డి శ్రీనివాస్. బండారి కిషన్. అడిగొప్పుల శంకర్. వడ్డేపల్లి రాజు. చిలుక సత్యం. ఎనగందులశ్రీకాంత్. యమునా రుక్మిణి పద్మ కవిత కళ్యాణి భద్రవ రమ గ్రామ ప్రజలకు తదితరులు పాల్గొన్నారు

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

కారల్ మార్క్స్ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ఎమ్మెల్యేకు ఎంసిపిఐ(యు) నేతల వినతి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి నెలకొన్న సమస్యల పట్ల ఎంసిపిఐ(యు) నేతలు వినతిపత్రం సమర్పించారు.నర్సంపేట పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో అదే కాలనీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న , వంగల రాగసుధ మాట్లాడుతూ కాలనీలో ముఖ్యంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైతే వరద నీరుమొత్తం కాలనీలోకి చేరి ఇండ్లు బురద మయంగా మారుతున్నాయని ,దీంతో విష సర్పాలు ఇళ్లలోకి చేరి కాలనీ వాసుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లె అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు కాలనీవాసులు అందరు కూడా అర్హులేనని,వారందరికీ వెంటనే ఇల్లు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని అనర్హులకు కాకుండా అర్హులకు వర్తించేలా చూడాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ యు నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి , స్థానిక నాయకులు గజవెల్లి జగపతి , గణిపాక బిందు ఎండి ఆరిఫ్ , జను జమున , చొప్పరి పద్మ గుజ్జుల శివ , క్రొర్ర మాలమ్మ బైరవైన నరసయ్య ,ఎస్.కె సద్దాం తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కమాన్ ఆర్చి ప్రారంభోత్సవం జరిగింది. సందర్భంగా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ ఇందుకుగాను దాతలు సాయం కమాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ఎందుకు సహకరించిన దాతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్టి విమానానికి సహకరించిన దాతలకు కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపిక అందజేసి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఇందుకుగానుముఖ్య అతిథులుగా గౌరవధాతలు. తుమ్మ రామస్వామి . రిటైర్డ్ సెక్రటేరియట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ. గొట్టే.పద్మారావు రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ కరీంనగర్. గొట్టే.జయశ్రీ స్పెషల్ డిస్టిక్ డిప్యూటీ కలెక్టర్ భువనగిరి జిల్లా. గొట్టే.అశోక్. రిటైర్డ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్. గొట్టే సంజీవయ్య ఎస్సార్ మేనేజర్ ఎన్టిపిసి మరియు తుమ్మ శ్రీనివాస్ . టి జి పి డి సి ఎల్ జూనియర్ అసిస్టెంట్.గొట్టే పద్మ. టిఆర్ఎస్ జిహెచ్ఎంసి జనరల్ సెక్రెటరీ హైదరాబాద్ కమిటీ సభ్యులు గట్టేపల్లి రమేష్ .క్యారo పెంటయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి లింగాల జలంధర్ . గొట్టే కరుణాకర్. నాయకులు గ్రామ మహిళలు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

మిల్స్ కాలని సిఐ సస్పెండ్.

మిల్స్ కాలని సిఐ సస్పెండ్

మిల్స్ కాలని పోలీసు స్టేషన్ సిఐ జె. వెంకటరత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

వరంగల్ నేటిధాత్రి:

వరంగల్ డివిజన్ పరిధిలో సిఐ సస్పెండ్ కావడం నగరంలో కలకలం రేపింది. వరంగల్ తూర్పులోని మిల్స్ కాలని పోలీసు స్టేషన్ సిఐ జె. వెంకటరత్నం ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకుండా, తప్పుడు కేసును నమోదు చేయడమే కాకుండా, ఈ కేసులో మరణించిన వ్యక్తి పేరును కూడా నమోదు చేసి నిందితులకు సహకరించిననందుకు, అలాగే మరో కేసులో మహిళ నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలో లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో మిల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.!

జర్నలిస్టు కాలనీ స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్య
లు తప్పవు బెల్లంపల్లి తహసిల్దార్ జోష్ణ.

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

 

బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదా
రిని ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీ స్థలంలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్లాటింగ్ చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేయడంతో రెవె
న్యూ అధికారులు బుధవారం తొలగిం
చారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల కిందట జర్నలిస్టు కాలనీ లోని స్థలంలోకొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా సిమెంటు పోల్స్ పాతిస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు(టేకు
లబస్తీ) జర్నలిస్టు కాలనీకి వెళ్లి క్షేత్ర
స్థాయిలో పరిశీలించి సంబంధిత తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్లను విషయాన్ని వివరించి స్థలాన్ని రక్షించి అర్హులైన జర్నలిస్టులకు సంబంధిత స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయడం జరి
గింది. స్పందించిన బెల్లంపల్లి తహసీల్ జోష్ణ ఆదేశాల మేరకు బెల్లంపల్లి రెవెన్యూ ఆర్ఐ మురళీదర్ రెవెన్యూ సిబ్బంది సహాయంతో స్థలంలో పాతిన సిమెంట్ పోల్స్ ను తొలగించారు. ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే స్పందించి జర్నలిస్టు కాలనీ స్థలాన్ని రక్షించినందుకు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జోష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హామీ హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీసుకున్న వర్కింగ్ జర్నలిస్టు
లందరికీ జర్నలిస్టు కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

కెసిఆర్ కాలనీలో ఒకరు ఆత్మహత్య…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి కేసీఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 2 లో కేసీఆర్ నగర్ లో తాడూరు రాము కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మిత్రునికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

డ్రైనేజీ పొంగిపొర్లుతు కాలనీలో దుర్గంధం.

డ్రైనేజీ పొంగిపొర్లుతు కాలనీలో దుర్గంధం

15,20 రోజుల నుంచి రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ పట్టించుకోని అధికారులు

డ్రైనేజీ సమస్య శాశ్వితంగా పరిష్కారం చూపించండి

స్థానిక కాలనీవాసులు

మల్కాజ్ గిరి నేటిదాత్రి

మల్కాజిగిరి డివిజన్ బాల సరస్వతి నగర్ లో (ఆత్మ లింగ మహా గణపతి ఆ లయ రోడ్డులో) గత 20 రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లు తున్న అధికారులు పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారు. డ్రైనేజీ పొంగి పొర్లుతుందని వాటర్ వర్క్స్ సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసిన ఇటువైపు చూడడం లేదని, చూస్తాము చేస్తాము పంపిస్తున్నామని మాటలు చెబుతూ కాలనీవాసులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు స్థానికులు తెలుపుతున్నారు.గత వారం ఇదే సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత వారికి చెప్పగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేసారని, డ్రైనేజీ పొంగి కాలనీ రోడ్లన్నీ కూడా వాసనతో ఇండ్లలోకి దుర్గంధం వస్తుంటే ఇండ్లలో స్థానికులు ఉండలేకపోతున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారుల పైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు.చిన్న చిన్న సమస్యలనే పరిష్కరించలేని అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తే ఎలా పరిష్కరిస్తారని స్థానికులు అడుగుతున్నారు.సమస్య పరిష్కరించకుండా వదిలేస్తే కాలనీ వాసులు,ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని రోడ్డుపై నడవడానికి కూడా సమస్యగా ఉందని చెబుతున్నారు.

రాజు పేట ఎస్సీ కాలనీలో బతుకమ్మ కనుమరుగయ్యా.!

రాజు పేట ఎస్సీ కాలనీలో బతుకమ్మ కనుమరుగైయ్యే ప్రమాదం లో ఉంది..

_ఎస్సీ కాలనీ వాసి జై భీమ్ రామ్మోహన్

మంగపేట నేటిధాత్రి

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో కాలనీవాసులందరూ కలిసి గత30 సంవత్సరాల క్రితమే కొంత స్థలాన్ని దేవుడి పేరు మీద కేటాయించుకొని.. అక్కడే అన్ని పండగలు జరుపుకునేవారు.. ముఖ్యంగా బతుకమ్మ వేడుకని అద్భుతంగా అందరూ కలిసి అదే స్థలంలో గత 15 సంవత్సరాల నుండి జరుపుకునేవారు కానీ ఈరోజు ఆ బతుకమ్మ ఈ ఎస్సీ కాలనీలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.. దేవుడి పేరు మీద ఉన్న స్థలం కాబట్టి ఆ స్థలంలో గుడి నిర్మించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు, ఎస్సీ కాలనీ ప్రజల, ఎస్సీ కాలనీలో ఉన్న మహిళల అంగీకారాలు వాళ్ల స్పందన తెలుసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సరైనది కాదు..చేసేది మంచి పని అయ్యినా అందరి అభిప్రాయాలు తెలుసుకునే కనీస బాధ్యత ఉండాలి కదా..ఆ స్థలంలో గుడి వస్తుంది మంచిదే..కానీ బతుకమ్మ ఆడే స్థలం లేదని మహిళలు లోలోపలే బాధపడుతున్నారు .. ఎస్సీ కాలనీ వాసులకు ఇదే స్థానిక కాంగ్రెస్ నేతలు బతుకమ్మ ఆడడానికి ఒక అనుకూలమైన, విశాలమైన స్థలాలను కేటాయించాలి..లేనిచో కాలనీ బతుకమ్మ పండుగ కనుమరుగైయ్యే ప్రమాదం ఉంది.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ముందు తరాలు వారసత్వ సంపద ఇవ్వలేని పరిస్థితిలో కాలనీ వాసులు ఉంటారు.. కావున గుడి నిర్మాణానికి మేము ఏమాత్రం వ్యతిరేకంగా కాదు గుడి నిర్మాణానికి మేము మద్దతు ఇస్తున్నాం కానీ బతుకమ్మ ఆడడానికి స్థిరమైన స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు కేటాయించకపోతే .. అప్పుడు తీవ్ర పరిణామాలు స్థానికుల నుండి ఎదుర్కోవాల్సి వస్తుందని మార్చిపోవద్దు..అని ఎస్సీ కాలనీ వాసి జై భీమ్ రామ్మోహన్ అన్నారు

కంపు కొడుతున్న మురుగు కాలువలు.

కంపు కొడుతున్న మురుగు కాలువలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

దుర్గంధంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ అధికారులు ఝరాసంగం మండల కేంద్రంలోని 8వ వార్డులో మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ కాలువలో చెత్తాచెదారం నిండిపోవడంతో మురుగునీరు ప్రవహించే మార్గం లేక కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పుడు ఎలాంటి రోగాలు బారిన పడవలసివస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కాలనీలో నివసించే ప్రజల ఇళ్ళ ముందు కాలువలో మురుగునీరు నిల్వఉంటున్నా అధికా రులు పట్టించుకోవడం లేదు. ఈ మురుగు కాలువ పక్కన ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు ఈ మురుగు నీరు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండడంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడతామేమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారు లు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మురుగునీరు నిల్వ ఉండకుండా వెళ్లే మార్గం దిశగా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు, విద్యార్థులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version