అంబేద్కర్ చరిత్రను, రాజ్యాంగాన్ని అధ్యాయనం చేయాలి.
చిట్యాల, నేటిదాత్రి :
సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో మూడు మండలాల స్థాయి ప్రతిభా పాటవ పోటీల ప్రారంభానికి ముఖ్య అతిదులుగా విచ్చేసిన మండల విద్యాధికారి కోడేపాక రఘుపతి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య లు మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని మూడు మండలాల స్థాయి ప్రతిభా పాటవ పోటీలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో 8 9 10 తరగతులలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థి దశ నుండే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కస్టపడి అనేక అవమానాలు ఎదుర్కొనీ ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావి అయినాడని విద్యార్థులు కూడా పట్టుదలతో చదువాలని అన్నారు . ,అంబేధ్కర్ చరిత్రను ,భారత రాజ్యాంగం ని అధ్యయనం చేసి అంబేద్కర్ లాగా గొప్ప వ్యక్తులు కావాలని ఆకాంక్షించారు. భారత రాజ్యాంగం గొప్పదనాన్ని తెలుసుకోవాలన్నారు. 26 నవంబర్ 1949లో రాజ్యాంగం అమోదం పొంది జనవరి 26 , 1950లో అమలు చేశారన్నారు . ఏ వై ఎస్ మండల అధ్యక్షుడు జన్నే యోగేందర్ మాట్లాడుతూ ఈ పోటీలలో వ్యాచరచన , ఉపన్యాసం ,పాటలు పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగం దినోత్సవం రోజు విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు ..
ఈ కార్యక్రమంలో మాడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ చిట్యాల ఇంచార్జీ హెచ్ ఏం రఘుపతి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ ఏ వై ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ మండల ఉపద్యక్షులు కట్కూరి శ్రీనివాస్ దూడపాక సరోతం మండల సాంస్కృత కార్యదర్శిధాసారపు నరేష్ నాయకులు గుర్రపు రాజమౌళి గడ్డం సదానందం బత్తుల ఉపెందర్ ప్రవీణ్ ఉపాధ్యాలు రాము విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గాన్నారు.
