ఈ రోడ్డు తీరు మారేదెప్పుడు…

ఈ రోడ్డు తీరు మారేదెప్పుడు

పరకాల నేటిధాత్రి
అనునిత్యం వాహనాల రాకపోకలతో రద్దిగా ఉండే పట్టణంలోని జయ థియేటర్ రోడ్డు పరిస్థితి వాహనదారుల,షాపు నిర్వాహకుల తీరు మారడం లేదు,వాహనదారులు షాపుల ముందు మోటారు సైకిల్లను ఇస్టమచ్చినట్టుగా ఇస్టాను సారంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుతున్నారు,ఇష్టానుసార పార్కింగ్ ల వల్ల ఇతర పనుల నిమిత్తం వెళ్లే పాద చారులకు,వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారు.రాజధాని టీ ప్యాలెస్ దగ్గరనుండి మొదలుకొని జయ థియేటర్ వరకు అసలు షాపులకు ఎలాంటి పార్కింగ్ స్థలాలు లేవని,పరిమితిని దాటి రోడ్లమీదనే తమకు నచ్చినట్టుగా,వాహనాలను నిలిపి వస్తువులను పెట్టి వ్యాపారాలను కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.సివిల్ ఆసుపత్రి వెళ్లే ప్రధాన దారి ఇదే అవ్వడం అత్యవసర నిమిత్తం ఆసుపత్రికి వెళ్లే తరుణంలో అంబులెన్సులకు కూడా దారి లేకుండా పోయిన పరిస్థితులెన్నో ఉన్నాయని ఈ విషయంలో స్థానిక అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వ్యాపారస్థులకు,వాహనదారులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

రోడ్డు అంత గుంతలు ,బురద రాకపోకలు ఎలా ?

రోడ్డు అంత గుంతలు ,బురద రాకపోకలు ఎలా ?

రాయికల్ , జూలై 30, నేటి ధాత్రి:

రాయికల్.పట్టణంలోని ఒకటవ వార్డులో మందుల సిసి రోడ్డు నుండి సంధిలో మందుల నరేష్ ఇంటినుండి పక్క నుండి పాత నర్సరీ వరకు ఉన్న మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు పడి బురదమయంగా మారింది గుంతలలో నీరు నిల్వ ఉండడం తో పూర్తీ ఇబ్బంది మారింది ,రాకపోకలకు ప్రజలు కాలనీ వాసులు అవస్థలు ఎదుర్కొకుంటున్నారు బురదను వాహనాలు స్కిడ్ అయి పాడి గాయాల పలు అయినా సందర్భాలు కూడ ఉన్నాయి సదురు పురపాలక సంఘం అధికారులు స్పందించి ఇట్టి మరమ్మత్తు చేయించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు

బ్రిడ్జిపై కుంగిన రోడ్డు… భయాందోళనలో వాహనదారులు…

బ్రిడ్జిపై కుంగిన రోడ్డు… భయాందోళనలో వాహనదారులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T121842.357.wav?_=1

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి రైల్వే గేటు సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కొరకు 35 కోట్ల నిధులతో దశాబ్దం క్రితం పనులు మొదలు పెట్టినప్పటికీ అప్రోచ్ రోడ్డు పనులు ఇటీవల ముగియడంతో రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పై రోడ్డు వేసి ప్రయాణికుల సౌకర్యార్థం గత ఆరు నెలల క్రితం స్ధానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభించిన 6 నెలలలోని బ్రిడ్జిపై వేసిన రోడ్డు కుంగిపోయింది.

Road collapses

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాల వైపునకు వెళ్లే దారిలో బ్రిడ్జిపై రోడ్డు కుంగిపోవడంతో పాటు ఫుట్‌పాత్‌పై పగుళ్లు సైతం ఏర్పడ్డాయి.బ్రిడ్జి పై రోడ్డు కుంగడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోవడం, అధికారులు దృష్టి సారించకపోవడంతో రోడ్డు కొంగిపోయే పరిస్థితి తలెత్తిందని, కాంట్రాక్టర్ పై ఆర్ అండ్ బి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పుర ప్రముఖులు, పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో బ్రిడ్జి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కొత్త రోడ్డు సరే సరి, కనీసం ఉన్న రోడ్లను బాగు చేయండి మహా ప్రభో.

కొత్త రోడ్డు సరే సరి, కనీసం ఉన్న రోడ్లను బాగు చేయండి మహా ప్రభో.

కేసముద్రం లో బి ఆర్ ఎస్ ధర్నా లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి

కేసముద్రం/ నేటి ధాత్రి

అభివృద్ధి పేరిట కొత్త రోడ్లు వేస్తున్నాం అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు, కనీసం ఉన్న రోడ్డు ను కూడా మరమ్మత్తు చేయలేక పోతున్నారని బి ఆర్ ఎస్ నాయకులు సోమవారం కేసముద్రం పట్టణం లో ధర్నా చేపట్టారు. ఇటీవలే మున్సిపాలిటీ గా మారిన కేసముద్రం కు రోడ్డు వెడల్పు లో భాగంగా కోట్ల రూపాయలు తెచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు ప్రస్తుత పట్టణ రోడ్ల దుస్థితి కనబడటం లేదా అని మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మండల బి ఆర్ ఎస్ పార్టీ రోడ్ల దుస్థితి పై చేపట్టిన ధర్నా లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల అబద్ధపు మాటల పై నిప్పులు చెరిగారు. కేసముధ్రం మున్సిపాలిటీ పరిధి లోని ఉప్పరపల్లి రోడ్, అంబేత్కర్ సెంటర్, గాంధీ సెంటర్, మార్కెట్ బజార్, పూలే సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, కేసముద్రం విలేజ్ మైన్ రోడ్, తో సహా మొత్తం పట్టణపు రోడ్లన్నీ గుంతలు పడి, నీరు నిలిచి, వాహన చోదకులకు ఎంతో కష్టం అవుతున్నదని, పలు ప్రమాదాలకు దారి తీస్తున్నట్లు శ్రీనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు వీరు నాయక్ మాట్లాడుతూ… మోసపు మాటలతో గద్దె ఎక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిపై, ప్రజల ఇబ్బందులపై కొద్దిగానైనా దృష్టి సారించాలి అని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ శ్రీనాథ్ రెడ్డి, మాజీ మార్కెట్ ఛైర్మెన్ నీలం సుహాసిని దుర్గేశ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కమటం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు వీరు నాయక్, బి ఆర్ ఎస్ నాయకులు కొండ్రీడ్డి రవీందర్ రెడ్డి, సట్ల వెంకన్న, ముత్యాల శివకుమార్, నల్లా కిరణ్, తొనుపునూరి సాయి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన.

రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బిజెపి నాయకులు
కొద్దిపాటి వర్షానికే గుంతల మయమైన కొత్త పెల్లి భట్టుపల్లి రోడ్డు
నెలలు గడుస్తున్న పూర్తికాని రోడ్డు పనులు
కంకరపై ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

నేటి ధాత్రి అయినవోలు :-

వర్ధన్నపేట నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో భాగంగా మంజూరైన కొత్తపెళ్లి బట్టుపల్లి రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలల క్రితం రోడ్డు వెడల్పు లో భాగంగా కంకర పోసి వదిలేసిన అధికారులు ఇప్పటికీ తారు రోడ్డు పనులు పూర్తి చేయలేదని తద్వారా చిన్న వర్షానికి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి గుంతలు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాల గురవుతున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు. బుధవారం అయినవోలు భాజపా మండల పార్టీ అధ్యక్షుడు మాదాస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన బురద నీటిలో వరి నాట్లు వేయడం ద్వారా నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి కోట కిరణ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్ , మహేష్, భరత్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు..

 

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”

● – ఎస్సై వినయ్ కుమార్….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని భవాని మందిర్ చౌరస్తా, బీదర్ చౌరస్తా లలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని అన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ వైలేషన్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ సరిగా లేని, పత్రాలు లేని, సెల్ ఫోన్ డ్రైవింగ్ తదితర నిబంధనలు ఉల్లంగించిన వాహనాలకు రూపాయలు 17100 జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన..

వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి
వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి మార్కింగ్ వాకింగ్ లో నష్టపోయే బాధితులు కలిసి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అధికారులతో కలిసివివేకానంద చౌరస్తా నుండి రామాలయం వరకు రోడ్ల విస్తరణలో నష్టపోయే బాధితుల అభిప్రాయాలను సేకరించారు ఎంతో కాలంగా కర్నూల్ రోడ్ లో రోడ్ల విస్తరణ పెండింగ్ ఉండడంతో కొత్త బస్టాండ్ దగ్గర రాజావారి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర రోడ్డు చిన్నగా ఉండడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వనపర్తి పట్టణ ప్రజల భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మెగా రెడ్డి నష్టపోయే బాధితులను ఒప్పించి రోడ్ల విస్తరణ చేపట్టడంపై ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు .ఈసందర్భంగా రోడ్ల విస్తరణ కు ముందుకు వచ్చిన ఎస్ ఎల్ ఎన్ రమేష్ రాజు షబ్బీర్ వినోద్ లకు ఎమ్మెల్యే మెగారెడ్డి శాలువతో సన్మానము చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ ఆ ర్ డి ఓ రెవెన్యూ జిల్లా అధికారులు టౌన్ ఎస్సై హరిప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం సుబ్బరాజు చుక్క రాజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు దక్కాకుల సతీష్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ డి వెంకటేష్ వ్యాపారస్తులు కూన వెంకటేశ్వర్లు బట్టల షాప్ ల యజమానులు తదితరులు ఉన్నారు

ఓల్డ్ బొంబాయి రోడ్డు విస్తరణ స్థానిక వ్యాపారుల ఆందోళన.

ఓల్డ్ బొంబాయి రోడ్డు విస్తరణ స్థానిక వ్యాపారుల ఆందోళన

శేరిలింగంపల్లి నేటి ధాత్రి:

చందానగర్‌లోని ఓల్డ్ బొంబాయి రోడ్డు విస్తరణతో స్థానికంగా ద్విచక్ర వాహనల వ్యాపారస్తులకు ఆ రోడ్డు లో ద్విచక్ర వాహనాల మార్కెట్ పై ఆధారపడి జివనం సాగిస్తున్న కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు..చందానగర్ ఆటో కన్సల్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్, ఐటీ పరిశ్రమల శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారికి కలిసి వినతి పత్రం అందజేశారు..దశాబ్దాలుగా ఓల్డ్ బొంబాయి రోడ్డులోని 200 మీటర్ల వెడల్పున ద్విచక్ర వాహనాల మార్కెట్ నడుస్తుంది..పాత వాహనాలను కోనుగోలు చేయడానికి సంగారెడ్డి శంకర్ పల్లి సదాశివపేట వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి ద్విచక్ర వాహనాలు కోనుగోలు చేస్తారని తేలిపారు..చందానగర్ నుంచి అమిన పుర్ వరకు రోడ్డు విస్తరణ వల్ల ద్విచక్ర వాహనాల మార్కెట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న దాదాపు 500 లకు పైగా కుటుంబాల ఉపాధి దేబ్బతిటుందని అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు…ఈ మార్కెట్ స్థానిక వాణిజ్యానికి కేంద్రమని, ఇక్కడ చిన్న వ్యాపారులు, దుకాణ యజమానులు, ఉద్యోగులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.ఈ రోడ్డు విస్తరణలో ఇక్కడ ఉన్న ద్విచక్ర వాహనాల మార్కెట్ ను తరలించేలా చేస్తుందని, ఇది వారి వ్యాపారానికి,ప్రధాన ఆదాయ వనరుకు తీవ్ర ఆటంకం కలిగిస్తుందని వారు తెలిపారు..”సుమారు 500 కుటుంబాలు రోజూ ఈ మార్కెట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రతిపాదిత రోడ్డు విస్తరణ వారి పనిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వారిలో చాలా మందికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేవు,” అని అసోసియేషన్ తెలిపింది. ప్రాజెక్టులు నగర అభివృద్ధికి ముఖ్యమైనవని తాము గుర్తించినప్పటికీ,సామాజిక, ఆర్థిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆటో కన్సల్టెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.. ప్రభుత్వం ద్విచక్ర వాహనాల కుటుంబాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని రోడ్డు విస్తరణ ఓల్డ్ బొంబాయి రోడ్డు కాకుండా ప్రత్యమ్నాయా మార్గం చుడాలని అభ్యర్థించారు..గతంలో చందానగర్ నగర్ జాతియ రహదారి నాల నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆలోచన చేసిందని అదే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చేపడితే తమకు ఎటువంటి సమస్యలు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేశారు..ఈ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న ప్రజల జీవనోపాధిని పునఃపరిశీలించి, పరిష్కారం కనుగొనాలని వారు ప్రభుత్వాన్ని కోరారు..ఈ కీలకమైన అంశంపై దృష్టి సారించి న్యాయం చేయడానికి ప్రభుత్వం వ్యవహరించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది..

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, మొయిజ్,షేక్ జలీల్,సయ్యద్ జావీద్, షేక్ ఖలీల్, సంగ మహేష్, సయ్యద్ మజీద్, షేక్ మొహమ్మద్, మహమ్మద్ సిరాజ్, అన్వర్. తదితరులు పాల్గొన్నారు..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోహిర్ మండలం పీచర్యాగడ్ గ్రామానికి చెందిన జి.శ్రీకాంత్,డి.సాయి హేమంత్ లను ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,పరామర్శించిన వారిలో చల్లా శ్రీనివాస్ రెడ్డి,శికారి గోపాల్,గాళ్ రెడ్డి,సి.యం.అశోక్ రెడ్డి,చిన్నా,దిలీప్, తదితరులు ఉన్నారు.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా.

దళిత వాడలో సిసి రోడ్డు మంజూరులో జాప్యమేళా

చర్ల నేటిధాత్రి:

 

చర్ల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజయకాలనీ గ్రామంలో అత్యధికంగా దళితులు నివసిస్తున్నారు మండలంలో అన్ని రోడ్లు వేసిన దళిత వాడలో రోడ్డు వేయకపోవడం ఎంతో హేయమైన చర్య అని దళిత సామాజిక వర్గానికి చెందిన జెట్టి శ్రీను ఆరోపించారు మా గ్రామంలో అన్ని సందుల్లో సిమెంట్ రోడ్లు వేసిన మా ఇండ్ల ముందు ఉన్న సిసి రోడ్డు వేయకపోవడం వల్ల వర్షం పడితే ఈ ప్రాంతం మొత్తం బురద అయ్యి ఇండ్లలోకి నీరు వస్తుందని అన్నారు ఇకనైనా చర్ల మండలం ఎంపీడీవో ఎంపీవో ఈ ప్రాంతంలో పర్యటించి మా ఇండ్ల ముందు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నారు

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి.

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

జైపూర్ నేటి ధాత్రి:

 

వరంగల్ హైవే కు టేకుమట్ల గ్రామానికి సౌకర్యవంతంగా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని శుక్రవారం మాజీ సర్పంచ్ గొనె సుమలత నర్సయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కార్మిక,గనుల శాఖ మంత్రి డాక్టర్.వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు.టేకుమట్ల నుండి వరంగల్ వైపు వెళ్తున్న ప్రధాన హైవే విషయమై ప్రతినిధి బృందం కలిసి వివరణ ఇవ్వడం జరిగింది.హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం చేపడితే,స్థానిక రైతులు,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని వారు తెలిపారు.
అలాగే స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతంగా జరుగడంతోపాటు,రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సర్వే చేపట్టిన బృందం వివరించింది.ఈ విషయాన్ని గమనించిన మంత్రివర్యులు,సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలి.

రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించాలి…

మంగపేట నేటిధాత్రి:

 

Shine Junior Colleges

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాహనదారులందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు మన ప్రాణానికి ముప్పుగా మారుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం కావున ప్రజల విధిగా హెల్మెట్ ధరించి వాహన చట్టాలను గౌరవిస్తూ ప్రయాణం సాగించాలని మంగపేట పోలీస్ విజ్ఞప్తి చేశారు.
మంగపేట పోలీస్ పరిధిలో జరిగిన లోకధారథలో 70 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో పైన్ మరియు పదిమందికి మూడు రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది అని కావున అందరూ హెల్మెట్ ధరించకుండా , ఆల్కహాల్ తాగి వాహనాలు నడపరాదని వాహన దారులకు పోలీసులు వారు విజ్ఞప్తి చేశారు.

మురికి కాలువ ని oడి రోడ్డుపై మురికి నీరు.

కర్నూల్ రోడ్డు లో మురికి కాలువ ని oడి రోడ్డుపై మురికి నీరు

రోడ్డు పై నడిచే ప్రజలకు దుర్వసాన

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు సంగం ఫంక్షన్ హాల్ ఎదురుగా మెయిన్ రోడ్డు మురికి కాలువ నిండి రోడ్డుపై మురికి నీరు ప్రవహిస్తుండడం వల్ల రోడ్డుపై నడిచి వెళ్లే ప్రజలు వాహనదారులు దుర్వాసనకు ఇబ్బందులకు గురవుతున్నారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్నది వర్షాకాలం ప్రారంభమైనది మురుగనీరు జామ్ కావడం వల్ల దోమలు ఈగలు పురుగులు కాలు వ పై వాలి ప్రజలకు కుట్టినచో మలేరియా డెంగ్యూ ఇతర వ్యాధులు ప్రబలించి రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని ప్రజలంటున్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మెగా రెడ్డి మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకొని పై మురికి నీరు రోడ్డు పై ప్రవహించకుండా కాలువ నిర్మాణం చేపట్టాలని ప్రజలు ఒక ప్రకటనలో కోరారు

ఆగిన రోడ్డు మరమ్మతులు.

ఆగిన రోడ్డు మరమ్మతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం : గత మూడేళ్ల క్రితం రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారం భమైనప్పటికీ తిరిగి నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతు న్నారు.

దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించనట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిధులు మంజూరు జరిగిన కాంట్రాక్టర్ మా త్రం పనులు వెంటనే ప్రారంభించ లేదు.

ఇటీవలే పనులు ప్రారంభమై నప్పటికీ కొన్ని నెలల్లోనే అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు.

ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామం నుండి పూర్యానాయక్ తండా వైపు 3.50 కిలోమీటర్ల మేర రోడ్డును మరమ్మతులు చేసేందుకు 2022 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.38 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

ఇట్టి పనులను పర్యవేక్షించేందుకై ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి నియమించింది.

దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచి ఇట్టి పనిని చేసేందుకు కాంట్రాక్టర్కు అప్పగించింది.

అయితే కాంట్రాక్టర్ గత మూడు సంవత్సరాలు పాటు ఎలాంటి రోడ్డు మర మ్మతు పనులను ప్రారంభించకపోవడంతో గిరిజనుల ఆశలు సన్నగిల్లాయి.

 

BRS Government.

 

గత కొన్ని ఏళ్లుగా గిరిజనులు కంకర తేలి గుంతలపడ్డ రో డ్డుపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ద్విచక్ర వాహనాల మాట అటు ఉంచితే కనీసం కాలినడకన వెళ్లాలన్న ఈ రోడ్డు అనువుగా లేక పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ తరు ణంలోనే గత రెండు నెలల క్రితం కాంట్రాక్టర్ ఈ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించడంతో గిరిజనుల ఆశలు తిరిగి రేకెత్తిన్నాయి.

కాగా ఇప్పటి వరకు ఈ రోడ్డుపై పలుచోట్ల కల్వర్టులు నిర్మించారు.

అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేగడి మట్టిని తవ్వి సైడ్ వైన్దింగ్ పనులను చేపట్టారు.

అదే విధంగా మొరం కాకుండా చెడేతో కూడు కున్న మట్టిని రోడ్డుపై వేసి చదును చేశారు.

తదుపరి కంకర వేయ కుం డా రోడ్డు మరమ్మతు పనులను అర్ధాంతరంగా వదిలిపెట్టారు.

దీంతో ప్రస్తుతం ఈ రోడ్డు చిరుజల్లుతే చిత్తడిగా మారి ప్రయాణం చేయ డా నికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయా తండాలో గిరి జనులు ఆందోళన వ్యక్తం చేశారు.

పలువురు వాహనదారులు జారి పడి ప్రమాదాన్ని గురైనట్లు వారు వివరించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు

ఈ రోడ్డుపై కంకర వేసి బీటీ రోడ్డుగా మార్చడా నికి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్.

వనపర్తి లో రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వనపర్తి పట్టణము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి కోరారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వ్యాపార సంస్థల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేగారెడ్డి మాట్లాడుతూ వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు రహదారి పానగల్ రహదారి విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులను ఇళ్ల యజమానులను ఇబ్బంది పెట్టి రోడ్డు విస్తరణ చేపట్టదలుచుకోలేదని.

రోడ్డు విస్తరణను యజమానులను ఒప్పించి తగిన నష్ట పరిహారం ఇచ్చి విస్తరణ మాత్రం తప్పకుండా జరుగుతుందన్నారు.

పానగల్ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించడం లేదా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం వంటి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారుపట్టణంలోని ప్రధాన రహదారి వనపర్తి -పెబ్బేరు రోడ్డు విస్తరణ అనేది భావి తరాలకు, వనపర్తి గౌరవాన్ని కాపాడటానికి చాలా ముఖ్యమని అందువల్ల వ్యాపారస్తులు రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు
వనపర్తికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఎక్కడ లేనివిధంగా సైఫాన్ డ్యామ్, చారిత్రాత్మక పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడే ఉన్నాయన్నారు రోడ్డు ఎన్ని ఫీట్లలో ఉండాలి అనేది ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ద్వారా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ తో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

రోడ్డు ఒకే ప్లాట్ ఫాం పద్ధతిలో వంకరలు లేకుండా అలన్మెంట్ ఉంటుందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గత పదేళ్లలో వనపర్తి పట్టణ జనాభా రెండింతలు అయ్యాయని, రాబోయే రోజుల్లో నాలుగింతలు కావచ్చన్నారు.

జనాభాకు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు ఉండాలని అన్నారు పట్టణాల్లో కనీసం వంద ఫీట్ల రోడ్డు ఉండాలని,అప్పుడే పట్టణం అభివృద్ధి చెంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందని, వనపర్తి పట్టణానికి 2000 సంవత్సరంలోనే ప్లాన్ తయారు చేసి 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించడం జరిగిందన్నారు.

రోడ్డు విస్తరణ ప్రజలకు చాలా అవసరమని, విస్తరణ వల్ల ఎక్కువ లాభం రోడ్డు పక్కన ఉన్న వ్యాపారస్తులకు కలుగుతుందన్నారు.

కొంత స్థలం కోల్పోతున్న వారికి టి.డి.ఆర్ ఇవ్వడం, పూర్తిగా స్థలం కోల్పోయే వారికి నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం టి.డి.ఆర్ తీసుకోవడం చాలా లాభదాయకమని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.

భవిష్యత్తులో డెవలపర్స్ కు అమ్ముకొని నాలుగింతల లాభం పొందవచ్చు అన్నారు.

రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులు వారి వాదనలు, అభ్యర్థనలు తెలిపారు.

ముందుగా రోడ్డు మధ్యభాగం ఎక్కడి నుంచి కొలతలు చేస్తారో నిర్ణయించాలని అదేవిధంగా రోడ్డు విస్తరణ వంద ఫీట్లు కాకుండా 70 నుంచి 80 ఫీట్ల కు కుదించాలని కోరారు. వ్యాపారస్తుల తరపున అడ్వకేట్ నిరంజన్ పాషా తమ వాదనలు వినిపించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుమార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు .

నిమ్డ్ రోడ్డు జిగేల్.

నిమ్డ్ రోడ్డు “జిగేల్”

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
శుక్రవారం ప్రారంభించనున్న నిజ్జా (జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి) రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు ప్రాంతం వరకు నిర్మించిన రోడ్డు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. రోడ్డు మధ్యలో సుమారు 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి, 131 కెవి విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా సందర్భంగా గురువారం రాత్రి పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలను ప్రారంభించారు. దీంతో రోడ్డు ప్రాంతం మొత్తం కాంతులతో మెరిసిపోయింది. బర్దిపూర్, చిలేపల్లి, పొట్టిపల్లి, ఎల్గోయి, చిలేపల్లి తండా, వనంపల్లి మీదుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు విద్యుత్ కాంతులను చూసి ఆనందం వ్యక్తం చేశారు.

వనపర్తి లో రోడ్ల విస్తరణ పూర్తి చేయాలి.

వనపర్తి లో రోడ్ల విస్తరణ పూర్తి చేయాలి

రోడ్డు కు అడ్డంగా ఉన్న భవనాలను కూల్చి వేయాలి

కలెక్టర్ అధికారులకు అదేశాలు

వనపర్తి నేటిధాత్రి:

 

9+వనపర్తి జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ లో వనపర్తి పట్టణం లో పాన్గల్ రోడ్ , కొత్తకోట, పెబ్బేరు రోడ్డు విస్తరణ పై అటవీ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న షాపింగ్ యజమానులు, ఇళ్ల యజమానులకు నోటీస్ లు జారీ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. నోటీస్ లు జారీ చేసిన వారికి ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇచ్చి భవనాల కూల్చివేతలు ప్రారంభించాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన పెబ్బేరు రోడ్డు, ఈకో పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ స్కూల్ కు సంబంధించిన అటవీ భూముల విషయంలో అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశంలో డి.ఎఫ్ ఒ ప్రసాద్ రెడ్డి, ఆర్.ఎఫ్. ఒ అరవింద్ రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాల శాఖ, మున్సిపల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న సీనియర్ జర్నలిస్ట్ దూరదర్శన్ ప్రతినిధి మల్యాల బాలస్వామి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దూరదర్శన్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ మలియాల బాలస్వామి గత నెల 25 న వనపర్తి గోశాల దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి హైదరాబాదులో ఆర్థోపెడిక్ కేర్ హాస్పిటల్ డాక్టర్ తో చికిత్స చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న నేటి దాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ బుధవారం నాడు నాగవరంలో జర్నలిస్ట్ బాలస్వామి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు .జర్నలిస్ట్ బాలస్వామి త్వరగా కోలుకొని జర్నలిస్ట్ విధుల్లో చేరాలని పొలిశెట్టి సురేష్ ఆకాంక్షించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version