సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

సమయపాలని పాటించని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా..

కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల కార్యాలయాలు ఆకస్మిక తనికిలు…

ఎన్.ఐసి కార్యాలయ పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్..

కలెక్టర్ తనిఖీలతో అధికారులు,సిబ్బంది హడల్…

హాజరు పట్టికల పరిశీలించి సమయానికి రాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించిన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రామాయంపేట ఆగస్టు 30 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఉద్యోగులందరూ బాధ్యతగా పనిచేసినప్పుడే శాఖల పనితీరు మెరుగుపడి ప్రజలకు ఉత్తమ సేవలో అందించినవారు అవుతామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు రెవిన్యూ కార్యాలయంతో పాటు
అవుట్వాడ్ ఇన్వార్డ్ సెక్షన్, ఖజానా శాఖ కార్యాలయం, ఎన్.ఐసి కార్యాలయం తనిఖీ హాజరు పట్టికని పరిశీలించి 11:30 అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఈ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఎన్.ఐసి కార్యాలయ పనితీరు
బాగోలేదని అధికారి విధుల్లో ఉండాల్సిన ఉద్యోగి కలెక్టర్కు సమాచారం ఇవ్వకుండా సెలవు పై వెళ్ళటం పై అసహనం వ్యక్తం చేశారు
మెమో జారీ చేయాలని డిఆర్ఓ ఆదేశించారు. ఖజానా శాఖ కార్యాలయం తనిఖీ చేస్తూ పెన్షన్ మంజూరులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు , ఖజానా శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.సిబ్బంది హాజరు పట్టిక పరిశీలిస్తూ సమయపాలన పాటించని ఉద్యోగులపై
మెమో లు జారీ చేయాలన్నారు.

 

సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ తమ కర్తవ్య బాధ్యత లను
చిత్త శుద్ధితో నిర్వహించాలని , ఉదయం 10:30 కల్లా కార్యాలయాలకు చేరుకుని క్రమశిక్షణగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో బాధ్యతారాహిత్యం తగదు అన్నారు
వివిధ శాఖల అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతర చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, ఏవో యూనస్, కలెక్టరేట్ కార్యాలయ అకౌంటెంట్ పరమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.

ఘనపూర్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.

ఘనపూర్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు

వనపర్తి నేటిధాత్రి

 

 

 

 

ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జరుపుకున్నారు ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం చేశారు
ఈ వేడుకలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్
జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ జిల్లా డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షులు నరేందర్ గౌడ్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం దేవన్న యాదవ్ మున్నూరు జయకర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దేవుజా నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కే బాల్ రెడ్డి, చిట్యాల లింగస్వామి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

డాక్టర్ నర్సన్,మారుపాక కృష్ణకు విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు.

డాక్టర్ నర్సన్,మారుపాక కృష్ణకు విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవులకు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్,భారతీయ అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో,ప్రముఖ గజల్ కవయిత్రి డాక్టర్ పి.విజయలక్మి పండిట్ సారాధ్యములో విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు ప్రధానాలు.. అందించడం జరిగినది.
జాతీయపురస్కారాలకు, వేములవాడనుండి తెలంగాణ అవార్డు గ్రహీత,డాక్టర్ నర్సన్,
గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారగ్రహీత,
మారుపాక కృష్ణకు విశ్వ పుత్రిక జాతీయ పురస్కారం అందించడం జరిగినది. అందుకుగాను కమిటీ సభ అధ్యక్షులు సామ్రాట్ కళారత్న డాక్టర్
బిక్కికృష్ణ, ఆధ్వర్యంలో పురస్కారలు అందించడం జరిగినది. ఐ.ఆర్. యస్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్రటరీ నరసింహప్ప, ఇన్కమ్ టాక్స్ అధికారి కంఠం నేని రవిశంకర్, సినిమా ప్రొడ్యూసర్ శ్రీమతి కాంతి కృష్ణ,శ్రీమతి యేలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొని వారికి అభినందనలు తెలపడం జరిగినది.

బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర.

33 వ వార్డు ప్లా నింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర

సీసీ రోడ్డుకు పూజ చేసిన కాంగ్రెస్ నేతలు

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు ప్లా నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర సిసి రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నేతలు పూజ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాజె కౌన్సిలర్ బ్రహ్మం కాంగ్రెస్ నేతలు కూరగాయల రవీందర్ వార్డు ప్రజలు కిరాణాము వ్యాపారి ఆర్యవైశ్యుడు కాలూరు శ్రీనివాసులు శెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు 33 వ వార్డు ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డికి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం.!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం కొత్వాల్ గూడ నూతన కమిటీ ఎన్నిక…

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ గ్రామం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం నూతన అధ్యక్షులు, కమిటీ సభ్యుల ఎన్నిక గురువారం జరిగింది.
అంబేద్కర్ యువజన సంఘం, భీమ్ రావు మాల సంఘం నూతన అధ్యక్షులుగాచేవెళ్ల గిరి,ప్రధాన కార్యదర్శిగా చేవెళ్ల రాకేష్,కోశాధికారిగా : పిల్లి రాహుల్ కుమార్, ఉపాధ్యక్షులుగా పత్యర రాములు , సిద్ధం విజయ్, చెరుకుల శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ నిరటినరసింహ,
చేవెళ్ల రాజేష్,పత్తి నర్సింగ్ రావు, పత్యారాశ్రీనివాస్, పంబాల చంద్రయ్య, పత్యారా శేఖర్,
ఆవుల బెంజ్ మేన్, చేవెళ్ల కృష్ణ,
చేవెళ్ల రమేష్,పిల్లి ప్రేమ్ రాజు, పత్యార ఎలీషానవీన్ కుమార్, అవుల కళేబ్, పంబల రాజు, చేర్కుల నర్సింహ, చెర్కుల అంజయ్య పెద్దలకు సమక్షంలో నూతన అధ్యక్షులు కమిటి సభ్యులను ఎన్నుకొన్నారు.

గోపి కుటుంబాన్ని పరామర్శించిన.!

గోపి కుటుంబాన్ని పరామర్శించిన సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,డాక్టర్.బాలకృష్ణ

ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వఆసుపత్రి సిబ్బంది

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది.గోపి కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్,ఆర్ఎంఓ డాక్టర్ బాలకృష్ణ పరామర్శించి ఓదార్చడం జరిగింది.అనంతరం భాదిత కుటుంబానికి 20,000ల ఆర్థిక సాహయాన్ని అందజేశారు.అనంతరం సూపరిండెంట్,ఆర్ఎంఓ లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైనాల గోపి కుమారుడు వైనాల లక్కీ చనిపోవడం చాలా బాధాకరమని గోపి కుటుంబానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా ముగిసిన దివ్యాంగుల ఫిజియోథెరపీ

కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి :

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో శుక్రవారం ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియో థెరపీ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు 8 మంది విద్యార్థులకు గాను పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని, ఇది శారీరక శక్తి మరియు చలనం మెరుగుపరచడం ద్వారా వారి రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనే అవకాశాన్ని ఇస్తుందని,అలాగే శరీరంలోని నొప్పి తగ్గించడం, సంయుక్త పునరుద్ధరణ, మరియు శారీరక సమతుల్యతను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుంది అని వివరించారు. కావున ప్రతి ఒక్క విద్యార్థి ఇంటి వద్ద తప్పకుండా వ్యాయామాలు చేయాలని వారిని సూచించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ఉపాధ్యాయులు కమల్ కిషోర్, గంగాధర్, అంబయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version