రిజర్వేషన్ ఫలాలు అందరికి అందాలి
ఆలిండియా దళిత యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం శైలేందర్
పరకాల నేటిధాత్రి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లు ఫలాలు అందరికీ అందాలని ఆలిండియా దళిత యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రత్నం శైలేందర్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ తెగలవారు కుల,మతం పేరుతో క్రైస్తవులు,ముస్లింలు పీడించబడ్డారని ఎస్సీ,ఎస్టీ బీసీ మరియు మైనారిటీలు మరియు అగ్రకుల పేదలు కూడా ఒక కులం మరో కులంతో ఒక మతం మరో మతంతో అనచివేయబడిన వారు గనుక వారందరినీ దళితులు అని పిలవబడుతారని వెనుకబడిన వర్గాల ప్రజల కొరకు సామాజిక న్యాయం కొరకు నిరుద్యోగ,ఆర్థిక అసమానతలు వంటి సమస్యలు అధిగమించబడంతో దళిత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనగారిన ప్రజల కోసం సామాజిక న్యాయం కోరే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని రిజర్వేషన్స్ అందరికీ దామాస ప్రకారం అందాలని ఇందుకోసం ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ ఎల్లవేళలా పనిచేస్తుందని పేర్కొన్నారు.
