మహా బోధి బుద్ధగయ విముక్తికై విశ్వవ్యాప్త ఆందోళన:
◆:- బంతే వినయ్ ఆచార్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ కోహిర్ మండల దిగ్వాల్ గ్రామంలో బీహార్లోని మహా బోధి బుద్ధగయ విముక్తి కోసం విశ్వవ్యాప్త ఆందోళన చేపట్టినట్టు ప్రముఖ బౌద్ధ భిక్షువు వినయ్ ఆచార్య తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం దిగ్వాల్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మాట్లాడుతూ, ఫిబ్రవరి 12, 2026న న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహా సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని అంబేడ్కర్ వాదులను కోరారు. ఈ కార్యక్రమంలో తలారి అశోక్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
