ప్రచారంలో దూసుకుపోతున్న కౌన్సిలర్ అభ్యర్థి పద్మ వెంకటనారాయణ గౌడ్

ప్రచారంలో దూసుకుపోతున్న కౌన్సిలర్ అభ్యర్థి వెంకటనారాయణ గౌడ్

అన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తా

29 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అవార్డు అభ్యర్థి నాగేల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రజలు స్వాగతాలు పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు.

కారు గుర్తుకే మీ ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టగా పలువురు వార్డు ప్రజలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి పద్మ వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన నర్సంపేటలో అభివృద్ధి చేయడంలో శూన్యంగా మారిందని తెలిపారు.

ప్రస్తుతం అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులు గత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి తెచ్చిన విధులేనని ఇప్పుడు కొత్తగా స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి తెచ్చిన నిధులు ఏమి లేవని ఎద్దేవా చేశారు. 29 వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ప్రజలు గమనించాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఓటర్లకు చూపుతూ ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ప్రజలను కోరినట్లు తెలిపారు.

ఈ ప్రచారంలో ఎన్నికల ఇన్చార్జి మనోహర్ గౌడ్, స్థానిక ఇన్చార్జి కుమారస్వామి, ఇర్ఫాన్, అరవింద్ గౌడ్ పలు వురు బిఆర్ఎస్ యూత్ విభాగం నాయకులు,మహిళా నాయకులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రచారంలో దూసుకెళ్తున్న పూదరి సునీత ప్రభాకర్..

 

https://netidhatri.com/wp-content/uploads/2026/02/download.wav?_=1

ప్రచారంలో దూసుకెళ్తున్న పూదరి సునీత ప్రభాకర్

39 డివిజన్ లో విజయం దిశగా కాంగ్రెస్

ప్రజల నుంచి అపూర్వ స్పందన

మంచిర్యాల , నేటి ధాత్రి న్యూస్

 

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 39 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూదరి సునీత ప్రభాకర్ ప్రచారంలో పాల్గొంటున్నారు.

డివిజన్ ప్రజలను నిత్యం కలుస్తూ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటేసి తమను గెలిపించాలని కోరారు. మరోసారి తమను గెలిపిస్తే డివిజన్ సమస్యలను పూర్తిగా తీర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌..

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

 

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాల ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్‌ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.

 తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాల ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. NDDB నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు. మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?

వైసీపీ హయాంలో హిందూ మతంపై దాడులు..

గురువారం.. అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడిన పవన్.. ఐదేళ్లు తామే అధికారులంలో ఉంటామని.. రాజకీయలబ్ధి కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైసీపీ.. భగవంతుడిపై పగబట్టిందని ధ్వజమెత్తారు. అందరం ఏడు కొండలు అంటామని.. వైసీపీ వాళ్లు రెండు కొండలు అంటారని అన్నారు. వైసీపీ హయాంలో హిందూ మతంపై చాలా దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే.. ఇవి పోతే ఇంకొకటి కొందామన్నారని గుర్తుచేశారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివారు చేశారని చెప్పారన్నారు.

మతాల ప్రస్తావన లేదు..

నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘తప్పు చేసి క్షమాపణ అడగకుండా మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నారు. శ్రీవారి విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారు. సిట్‌ రిపోర్ట్‌ ఎక్కడా వైసీపీకి క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు. రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది. భగవంతుడితో పెట్టుకున్నవారు సర్వనాశనం అయిపోతారు తప్ప బతికున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలి. భగవంతుడికి మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టం. హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. కల్తీ లడ్డూ వ్యవహారం ముమ్మాటికీ తెలిసి చేసిన నేరం. 2022లోనే కల్తీ నిర్ధారణ అయిననూ.. అయోధ్యకు అవే కల్తీ లడ్డూలు పంపి మహాపాపానికి ఒడిగట్టారు’ అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..

ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..

 

 

ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానంపై రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాల్సిన ప్రసంగం ఆగిపోయిన సంగతి తెలిసిందే.

 

ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానంపై రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాల్సిన ప్రసంగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. గురువారం రాజ్యసభలో కూడా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పార్లమెంటులో జాతీయ ప్రయోజన అంశాల గురించి మాట్లాడటంపై ఆంక్షలు విధిస్తున్నారని ఖర్గే ఆరోపించడంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు (Kharge Nadda argument).
‘పార్లమెంట్ అంటే లోక్ సభ, రాజ్యసభ రెండూ ఉంటాయి. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రయోజనాల గురించి మాట్లాడాలనుకున్నారు. కానీ అలా చేయడానికి ప్రభుత్వం అనుమతించలేదు. మీరు సభను ఇలా ఎలా నడపగలరు’ అని ఖర్గే ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘లోక్‌సభ కార్యకలాపాలను రాజ్యసభలో చర్చించలేము. నా గౌరవనీయ సహోద్యోగి ఈ విషయాన్ని తెలుసుకోవాలి’ అని సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేనిపైనా చర్చ నిర్వహించడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నడ్డా అన్నారు (Rajya Sabha disruption).

‘లోక్‌సభలో ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి ప్రధాని మోదీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు (Parliament chaos India). కానీ ప్రతిపక్షం సభా కార్యకలాపాలను ముందుకు సాగనివ్వడం లేదు. ప్రతిపక్షాలు అడిగినట్లుగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై ఒక ప్రకటన చేశార’ని జేపీ నడ్డా గుర్తు చేశారు. తీవ్ర వాగ్వాదం తర్వాత, ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.a

అభివృద్ధి చేస్తా అవకాశం కల్పించండి…

అభివృద్ధి చేస్తా అవకాశం కల్పించండి : 8వ వాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంఠం శ్వేత కృష్ణారెడ్డి

* అలియాబాద్ లో గడపగడప ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని అలియాబాద్ మున్సిపల్ 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కంఠం శ్వేతా కృష్ణారెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అలియాబాద్ ఎనిమిదో వార్డులో గురువారం గడపగడప ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా మున్సిపల్ అభివృద్ధికి తనవంతుకు చేస్తానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మంజుల, నాయకులు సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నర్సింగపురం గ్రామానికి రేషన్ షాపు కేటాయించాలి..

నర్సింగపురం గ్రామానికి రేషన్ షాపు కేటాయించాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సింగాపురం గ్రామానికి రేషన్ షాప్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ
నర్సంపేట మండలం ఇటకాలపల్లి గ్రామంలోని రేషన్ షాపు ముందు నిరసన వ్యక్తం చేశారు. రేషన్ సరుకుల కోసం రెండు కిలోమీటర్ల దూరంలో గల ఇటకాలపల్లి రేషన్ షాప్ లో బియ్యం తీసుకోవడం జరుగుతుందన్నారు.వృద్ధులు, ఒంటరి మహిళలు ఉండడంతో బియ్యం మోసుకొని రావడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మా గ్రామంలో 196 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా గ్రామస్తుల ఇబ్బందులకు గుర్తించి గుర్తించి రేషన్ షాప్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఇటుకాలపల్లి గ్రామపంచాయతీ 9,10వ వార్డు మెంబర్లు ఈర్ల అనిల్ కుమార్, లింగదారి శంకర్,మాజీ ఉపసర్పంచ్ మాలగాని రాజు గ్రామ పెద్దలు గొర్రె మొగిలి ,నూకల మరి సంపత్, మహేంద్ర చారి, భూసాని జితేందర్ ,బాలాజీ లావుడియా ,మొగిలి ,మహిళలు గొర్రె చంద్రకళ, మాలగాని ఉమా, గొర్రె మణెమ్మ ,భర్తీపాక రాజక్క ,అజ్మీర్ లలిత ,భూసాని విజయ ,గొర్రె రాణి, గొర్రె సుమలత ,భూసాని విజయ, వాంకుదత్ శ్యామల ,నూకల మరి అమరావతి, పి. సుగుణ గ్రామస్తులు ,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వార్డులో దీప్తి,రాకేష్ రావు ల ప్రచారం…

వార్డులో దీప్తి,రాకేష్ రావు ల ప్రచారం

పరకాల,నేటిధాత్రి

 

14వ వార్డ్ లో ప్రతి గల్లీ,గల్లీల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల దీప్తి,రాకేష్ రావు గెలుపే లక్షంగా వార్డ్ లో సుడిగాలి పర్యటనలో భాగంగా ఇంటింటి ప్రచారంలో వార్డ్ ప్రజలు,ఆప్యాయతో ఆశీర్వదించి,మంగళహరతులు పట్టారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జి ఎండీ జాకిర్ అలీ,మాజీ ఎంపీటీసీ పాడి నవతా భగవాన్ రెడ్డి,వార్డ్ అధ్యక్షులు బండి వెంకటేష్, పట్టణ అధికార ప్రతినిధి మాక్స్ ద్ అలీ,మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ బియా బాని,ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి నాగరాజు,మంజూర్ అలీ,ఖలీం,మహిళ నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి…

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

* అద్రాస్ పల్లి లో గడపగడప ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

 

నీళ్లు రావాలన్న నిధులు కావాలన్నా కేవలం టిఆర్ఎస్ తోటే సాధ్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ని అద్రాస్ పల్లి లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అజయ్ కుమార్, నాగరాజు ల తరఫున గడప గడప ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలను కష్టాలపాలు చేస్తున్న కాంగ్రెస్ కు అవకాశం కల్పించొద్దన్నారు. ప్రజల కష్టాలు తెలిసి కన్నీళ్లు తీర్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని నేడు కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో 60 ఏండ్లు వెనకకు ప్పోయమన్నారు. మరిచిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దన్నారు. గడప గడప ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆది అజయ్, నాగరాజు లకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించలని కోరారు. ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, యువనాయకులు డాక్టర్ భద్ర రెడ్డి, నాయకులు ఆది రమేష్, నర్సింలు, వెంకటేష్, చిరంజీవి, మల్లేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

అభివృద్ధి కి పట్టం కట్టండి : మాజీ మేయర్….

అభివృద్ధి కి పట్టం కట్టండి : మాజీ మేయర్, ఎంసీ పల్లి ఎన్నికల ఇంచార్జి తోటకూర అజయ్ యాదవ్

* అద్రాక్ పల్లి లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సంక్షేమ అభివృద్ధి పలాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మేయర్, ఎంసీ పల్లి ఎన్నికల ఇంచార్జి తోటకూర అజయ్ యాదవ్ కోరారు. మూడుచింతల పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అద్రాస్ పల్లి లోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పులి ప్రభాకర్, మేడమైన నాగరాజు ల తరపున గురువారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చూసి కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ నరసింహులు యాదవ్, జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కుతాడి సాయికుమార్, యాదగిరి, గడ్డమిడి విజయ్, మాజీ సర్పంచ్ పత్తి యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.

సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు…

సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు

మంచిర్యాల మార్టిన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

యువ విజేతలకు సత్కారం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ హైదరాబాద్ లక్డీకాపూర్ లోని రవీంద్రభారతిలో మంగళవారం ఏర్పాటు చేశారు.సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డులు ఒలంపియాడ్ టాపర్ల విశేషమైన విజయాలను సాధించిన విద్యార్థులకు 20, గోల్డ్,40 స్టేట్,400 డిస్ట్రిక్ట్,20 గురుబ్రహ్మ&చిత్రాలయ యువ విజేతలకు సత్కారం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా గంట శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్,అధ్యక్షులు చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్,ప్రత్యేక అతిధి సినిమా భారతీయ నటుడు శ్రీకాంత్, భారతీయ నటుడు శివాజీ రాజా,లయన్ డాక్టర్ వై.కిరణ్, చైర్మన్-సూచిరిండియా గ్రూప్ కాన్సుల్ జనరల్ -బల్గేరియా రిపబ్లిక్ టి.జి & ఏ.పి , సైకాలజిస్ట్, పాల్గొన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల విద్యార్థులు 1లక్షకు పైగా విద్యార్థిని,విద్యార్థులకు ఏర్పాటు చేసిన టాలెంట్ టెస్టులలో మంచిర్యాల నస్పూర్ మండలంలోని మార్టిన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు 8 మంది పోటీలో పాల్గొనగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బైరం కాంక్షిత మొదటి స్థానంలో గెలిచారని మిగతా విద్యార్థులు వివిధ స్థానంలో గెలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సబిహ సుల్తానా తెలిపారు.ఈ సందర్భంగా సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు సాధించిన విద్యార్థులను పాఠశాల యజమాన్యం అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.అలాగే అన్ని రంగాలలో విద్యార్థులు పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి విజేతలుగా గెలుపొంది తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు.

ప్రజల కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ ..

ప్రజల కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

* అలియాబాద్ లో రోడ్ షో

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పేదల కష్టాలు తెలిసిన నేత కెసిఆర్, కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ అని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ని అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తంటం నర్సింహా, బండి లక్ష్మీ రాంరెడ్డి, తూమ్ యమున శ్యామ్, మధుసూదనరెడ్ది, సగ్గు శ్రీనివాస్ యాదవ్, గుర్క కుమార్ యాదవ్ లకు ఓటు వేసి గెలిపించలని కోరారు.

ఆదరిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుట…

ఆదరిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుట

గూడెల్లి సదన్ కుమార్ 11వ వార్డు అభ్యర్థి

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపల్ ఎన్నికల సందడిలో భాగంగా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పరకాల మున్సిపాలిటీ 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గూడెల్లి సదన్ కుమార్ ఇంటింట ప్రచారం గురువారం రోజున నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆ దేవుడి దీవెనలు,తన వార్డులోని ప్రజల ఆశిస్సులు తనపై ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ తోనే పట్టణం వార్డు అభివృద్ధి చెందుతాయని తమ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై ఓటువేసి ఆదరించి గెలిపించాలని గెలిపిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుంటానని మీ కష్ట సుఖాలలో తోడుంటానని హామీఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచార నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు..

ఎన్నికల ప్రచార నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 27వార్డు జవహర్ కాలనీ, పైలెట్ కాలనీ కాలనీలల్లో సీపీఐ సీపీఐ(యం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల
27వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ కుమార్
8వ వార్డు అభ్యర్థి సోతుకు రమ సమ్మయ్య
గెలుపు కొరకు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్
వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది అలాగే సన్నబియ్యం రైతులకు రుణమాఫీ పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ కావున కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి అని వారు అన్నారు 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ నాయకుడు సమ్మయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కోహిర్ మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ పార్టీ…

కోహిర్ మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ పార్టీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఏఐఎంఐఎం పార్టీ తన పట్టు నిరూపించుకోవడానికి ఆరుగురు అభ్యర్థులను బరిలోకి దించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కోహిర్ పట్టణ వీధుల్లో ప్రచారం చేస్తూ, మజ్లిస్ గుర్తు ‘పతంగి’ (గాలిపటం) కు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.కోహిర్ పట్టణలో మజ్లిస్ జెండా ఎగరేసి ‘పతంగి’ పార్టీ అధ్యక్షునికి బహుమతిగా అందజేస్తామని పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ అన్నారు మొట్టమొదటిసారిగా కోహిర్ పట్టణంలో మున్సిపాల్ ఎన్నికలు జరగడం వల్ల పతంగి ఎగరేసి పార్టీని బలపరిస్తానని భారీ మెజారిటీతో మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న మజ్లిస్ ‘పతంగి’పార్టీ

సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ విజయం సాధించాలి..

సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ విజయం సాధించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఎమ్మెల్యే మాణిక్ రావు జహీరాబాద్ పట్టణంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్,మాజి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
అనంతరం వివిధ వార్డ్ లకు ముఖ్య నాయకులను ఇంచార్జి లుగా ప్రకటించి,పార్టీ మున్సిపల్ అభ్యర్థులను ఇంచార్జిలకు పరిచయం చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ,నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల బానిస పాలనకు చరమగీతం పాడి తెలంగాణకు కె.సి.ఆర్ విముక్తి కలిగించారని కానీ నేడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఆంధ్ర పాలకుల తొత్తుగా మారి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారు అని ఆరోపించారు.మున్సిపల్ ఎన్నికల్లో కె.సి.ఆర్ గారి సంక్షేమ పథకాలు,మనం చేసిన అభివృద్ధి వివరించి ఓట్లు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు.
పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఐకమత్యంగా పనిచేసి గెలిపించుకోవాలని టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని పార్టీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని బరోసా ఇచ్చారు 420హామీలు,6గ్యారంటీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మహిళలకు 2500,ఆసరా పింఛన్లు 4000,కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్ గ్యాస్ సబ్సిడీ రైతులకు రైతు భరోసా రైతు రుణ మాఫీ రైతు బీమా వంటి పథకాలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ ఎన్నికల విజయం కె.సి.ఆర్ గారికి కానుక కావాలి.సమిష్టిగా పనిచేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.టిక్కెట్లు రాని వాళ్ళు సమర్థులు కారని పార్టీ అభిప్రాయం కాదని వారికి కూడా పార్టీ తగిన రీతిలో గౌరవం ,ప్రాధాన్యత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, ఆర్ సుభాష్ మాజీ కౌన్సిలర్స్, మాజి సర్పంచ్ లు , ఎంపీటీసీ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రత్నం సుమాంజలి అవినాష్ ను గెలిపించండి

రత్నం సుమాంజలి అవినాష్ ను గెలిపించండి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రత్నం సుమాంజలి అవినాష్ వార్డు ఇన్చార్జి ఇగ మహేందర్ జి కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడో వాడు టిటి కోటర్స్ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తాను అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆశీస్సులతో వార్డు అభివృద్ధి కోసం పని చేస్తాను ఏడవ వాడు ఓటర్సు అందరూ మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించగలరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఘనంగా నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమం.

ఘనంగా నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

కలెక్టర్ బిల్డింగ్ లోనీ కో ఆఫ్ రేటివ్ కార్యాలయం లో కె. శ్రీనివాస్ రావు అసిస్టెంట్ రిజిస్టర్ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎం. శ్రీనివాస్ మరియు జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి పదవి విరమణ పొందడం సహజమే కె. శ్రీనివాస్ రావు అసిస్టెంట్ రిజిస్టర్ చేసిన సేవలు సిరస్కలం గుర్తుండి పోత యనారు మరియు వారి శేష జీవితాన్ని సంతోషంగా ఆయుర ఆరోగ్య లతో గడపాలని కోరారు ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ రిజిస్టర్లు పోమ్ సింగ్ ఇందిరా రామకృష్ణ సీనియర్ ఇన్స్ పెక్టర్ లు శివ లింగ వర ప్రసాద్ నిర్మలా నవీన్ కుమార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి షేక్ నిసార్ అహ్మద్ సొసైటీ కార్యదర్శులు శ్రీనివాస్ విజయ్ కుమార్ రాములు సిరాజ్ మధుసూదన్ రెడ్డి సహకార శాఖ అధికారులు తదితరులు పాల్గొని కె. శ్రీనివాస్ రావు గారికి సన్మానం చేసి అభినందనలు తెలిపారు

19వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం…

19వ వార్డులో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం

ప్రజలకు అందుబాటులో ఉంటా-అభ్యర్థి ఏకు బాబు (బొబ్బిలి)

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని మున్సిపాలిటీ 19వ వార్డ్ టిఆర్ఎస్ అభ్యర్థి ఏకు బొబ్బిలి(బాబు) ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈ ప్రచారంలో ఇన్చార్జిలు బొట్ల శ్రీను,దోమల శ్రీనివాస్ వార్డు అధ్యక్షులు ఏకు కార్తీక్ లు మాట్లాడుతూ 27 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థ ఎలక్షన్ లో ప్రచార నిర్వహించే నైతిక హక్కు లేదని అంకెల గారడి తో ప్రజలను మోసం చేస్తున్నారని మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జలాలుద్దీన్,సాదిక్,బండి శ్రావణి,బొచ్చు రాజు,ఏకు ప్రవీణ్,ఏకు శివతేజ,కొమ్ముల మహేష్,ఒంటేరు రాకేష్,ఏకు వంశీ మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రక్రియ పరిశీలన…

ఎన్నికల ప్రక్రియ పరిశీలన

 

పరకాల,నేటిధాత్రి

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రక్రియను బుధవారం ఎన్నికల పరిశీలకు శివకుమార్ నాయుడు మరియు హనుమకొండ అదనపు కలెక్టర్,ఐఎఎస్ ఎన్.రవి పరిశీలించారు. అనంతరం గణపతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్,డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించిన అనంతరం పలు సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్.కన్నం నారాయణ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య,తహసిల్దార్ విజయలక్ష్మి,ఎంపీడీవో రవీందర్,ఎంఏఈ రంజిత్,టీపిఓ సుష్మ ఉద్యోగులు పాల్గొన్నారు.

33 వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు…

33 వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు
వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 33 వ వార్డు జనరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ ఎల్ ఎన్ మాధవి బిజెపి తరపున బచ్చ సౌజన్య బీఆర్ఎస్ తరపున అలైఖ్య పోటీలో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ సతీమణి మాధవి 33 వ వార్డు నుండి కౌన్సిలర్ గా విజయం సాధిస్తే మున్సిపల్ చైర్మన్ పఫవి దక్కించుకుంటారని ప్రజలు రాజాకీయా పరిశీలకులు అంటున్నారు

error: Content is protected !!
Exit mobile version