ప్రచారంలో దూసుకుపోతున్న కౌన్సిలర్ అభ్యర్థి పద్మ వెంకటనారాయణ గౌడ్

ప్రచారంలో దూసుకుపోతున్న కౌన్సిలర్ అభ్యర్థి వెంకటనారాయణ గౌడ్

అన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తా

29 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అవార్డు అభ్యర్థి నాగేల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ విభాగాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రజలు స్వాగతాలు పలుకుతూ మద్దతు తెలుపుతున్నారు.

కారు గుర్తుకే మీ ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టగా పలువురు వార్డు ప్రజలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి పద్మ వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన నర్సంపేటలో అభివృద్ధి చేయడంలో శూన్యంగా మారిందని తెలిపారు.

ప్రస్తుతం అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులు గత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి తెచ్చిన విధులేనని ఇప్పుడు కొత్తగా స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి తెచ్చిన నిధులు ఏమి లేవని ఎద్దేవా చేశారు. 29 వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ప్రజలు గమనించాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ఓటర్లకు చూపుతూ ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ప్రజలను కోరినట్లు తెలిపారు.

ఈ ప్రచారంలో ఎన్నికల ఇన్చార్జి మనోహర్ గౌడ్, స్థానిక ఇన్చార్జి కుమారస్వామి, ఇర్ఫాన్, అరవింద్ గౌడ్ పలు వురు బిఆర్ఎస్ యూత్ విభాగం నాయకులు,మహిళా నాయకులు,మహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version