ఘనంగా నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమం.

ఘనంగా నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

కలెక్టర్ బిల్డింగ్ లోనీ కో ఆఫ్ రేటివ్ కార్యాలయం లో కె. శ్రీనివాస్ రావు అసిస్టెంట్ రిజిస్టర్ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎం. శ్రీనివాస్ మరియు జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి పదవి విరమణ పొందడం సహజమే కె. శ్రీనివాస్ రావు అసిస్టెంట్ రిజిస్టర్ చేసిన సేవలు సిరస్కలం గుర్తుండి పోత యనారు మరియు వారి శేష జీవితాన్ని సంతోషంగా ఆయుర ఆరోగ్య లతో గడపాలని కోరారు ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ రిజిస్టర్లు పోమ్ సింగ్ ఇందిరా రామకృష్ణ సీనియర్ ఇన్స్ పెక్టర్ లు శివ లింగ వర ప్రసాద్ నిర్మలా నవీన్ కుమార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి షేక్ నిసార్ అహ్మద్ సొసైటీ కార్యదర్శులు శ్రీనివాస్ విజయ్ కుమార్ రాములు సిరాజ్ మధుసూదన్ రెడ్డి సహకార శాఖ అధికారులు తదితరులు పాల్గొని కె. శ్రీనివాస్ రావు గారికి సన్మానం చేసి అభినందనలు తెలిపారు

100 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు…

100 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు

జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బుధవారం ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్‌కుమార్, జిల్లా సహకార అధికారి వాలియా నాయక్, జిల్లా వ్యవసాయాధికారి జాడి బాపురావు హాజరైనారు ఈ కార్యక్రమంలో
జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఉద్యాన శాఖ తరపున అమలవుతున్న వివిధ పథకాల ప్రయోజనాలు, భౌతిక లక్ష్యాలు, రైతులకు చేరే మద్దతు, అలాగే శాఖల సమన్వయం ద్వారా అమలులో వేగం పెరగాలని సూచించారు.
జిల్లా కోఆపరేటివ్ అధికారి వాలియా నాయక్ మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏపీసీ నిర్దేశించిన విధంగా 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, మండలాల వారీగా రైతుల అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారులు పథకాల లక్ష్యాలు, రాయితీలు, ప్రయోజనాలు, రైతులకు అందే లబ్ది గురించి ప్రజెంటేషన్ రూపంలో వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, సహకార సంఘాల సీఈఓలు, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version