మేడ్చల్ జిల్లాలో బీజేపీలో భారీ చేరికలు

బీజేపీ లో చేరికలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ దే విజయమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మూడు చింతలపల్లి మాజీ మండల అధ్యక్షులు నందాల శ్రీనివాస్, బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు చింతల మాణిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కొల్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ నరసింహరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గళ్ళ మహేష్, వెంక గళ్ళ బాలయ్య, వెనుక గళ్ళ అనూష , కొల్తూరు ముదిరాజ్ సోదరులు కే నర్సింగారావు, కే అశోక్,కే సుధాకర్, కే భూపాల్, జే బాల నరసింహ,ఏ అశోక్,ఏ బిక్షపతి రాజు, జి జంగాలు ఎస్ వెంకట స్వామి, జె రమేష్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కొల్తూరు 17, 18, 19, వార్డుల్లోని కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు బిజెపిలో చేరారు. వారికీ శనివారం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు పి సురేందర్ రెడ్డి, ఎస్ మల్లేష్ యాదవ్, ఏ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version