చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి
కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముస్తాల తేజ
చేర్యాల నేటిదాత్రి
చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ 2 వార్డ్ అభ్యర్థి ముస్తల తేజ అన్నారు ఈ సందర్భంగా తన సొంత వార్డులో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు ప్రజలందరి మనసును దోచుకున్నదని చేర్యాల మున్సిపల్ మేము హస్తగతం చేసుకుంటామని
అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలను వివరిస్తూ గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు మరియు ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పేదలకు సన్న బియ్యం వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు చేర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని మరియు ప్రజలందరికీ సేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని రెండో వార్డ్ కౌన్సిలర్ గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణాన్ని అగాధంలో నెట్టివేశారని అన్నారు ఈ కార్యక్రమంలో భూమి గారి మనోహర్ ముస్తాల స్టీవెన్ కాటం సంజీవయ్య చెవిటి లింగం భూమిగారి మహేందర్ ముస్తాల కిష్టయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు
వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నర్సంపేట ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్
నేను తెచ్చిన నిధులతోనే నర్సంపేటలో రోడ్లు పోస్తున్నడు.
అభివృద్ధి జరిగేది బిఆర్ఎస్ తోనే..రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.
29 వ వార్డులో నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ను గెలిపిస్తే.. మరో కుర్చీవేస్తా..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
29 వ వార్డు బిఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి,నన్నపనేని నరేందర్
నర్సంపేట,నేటిధాత్రి:
మహిళల పథకాలతో వారిని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజలను మోసం చేస్తున్నదని. ఇదే క్రమంలో నర్సంపేట పట్టణంలో ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టర్ అవతారంతో ప్రజాధనాన్ని కాంటావేస్తూ నకిలీ సిసి రోడ్ల వర్కులు చేస్తున్నారని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్ ఆరోపించారు.
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ ఇంటింటీ ప్రచారం చేపట్టగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నర్సంపేట ఎన్నికల ఇన్చార్జి నన్నపనేని నరేందర్ పాల్గొని ప్రచార చేపట్టారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులుతోనే నేడు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంట్రాక్టర్ గా
అవతారంతో క్రషర్ మిల్లుతో సహా అన్ని సొంత వస్తువులతో నాణ్యత లేని రోడ్లను పోసి ధనాన్ని దోచుకుంటున్నాడని, ఇప్పటికిప్పుడే రోడ్లకు సంబంధించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం, నెలకు 2500 మహిళా పథకంలాంటి మరెన్నో మహిళా పథకాల ఆశలతో ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఈ మోసం చేసిన ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేందుకు మహిళలకు ఇదే సదవకాశం అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపోయి గోసపడుతున్నాం..వడ్డించే వాళ్ళు మనవాళ్ళు ఉంటే అభివృద్ధి మనదే.. అని నరేందర్ వివరించారు.గతంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి ముందు..తర్వాత సుదర్శన్ రెడ్డి వచ్చాక నర్సంపేట అభివృద్ధిని పరిశీలన చేసుకోవాలని కోరారు.కరోనా సమయంలో ప్రజలను విడిచిపెట్టి పోయిన వ్యక్తి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..ప్రజల కోసం నిత్యం పనిచేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కోరారు. నర్సంపేట పట్టణం టిఆర్ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి జరిగిందని.. ఇక నుండి అభివృద్ధి జరిగేది బిఆర్ఎస్ తోనే..రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం 42 కోట్ల రూపాయల నిధులు తెచ్చానని.. ఆ నిధులను రద్దుచేసి మరల అవే నిధుల కోసం జీవోలు మార్చి రూ.42 కోట్ల నిధులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శ్రీ మాత కన్స్ట్రక్షన్ పేరుతో కాంట్రాక్టర్ రూపంలో ఎన్నికల ముందు హడావుడిగా పనులు చేస్తున్నారు.ఈ నిధులు నావి కాదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కేసీఆర్ ప్రభుత్వ హయంలో నర్సంపేట మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తే ఇటీవల నర్సంపేటలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ నిధులు ఏమి ఇచ్చామని ఒక రాయి వేసి శంకుస్థాపన చేశారని ఎద్దేవ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాధవ రెడ్డికి రెండు సంవత్సరాలుగా ఎలాంటి సత్సంబంధాలు లేనప్పటికీ సీఎంకు.. ఎమ్మెల్యేకు నెల రోజుల్లోనే మాటలు కలిసి పనులు వెంటనే ఎలా ప్రారంభం. చేశారు. ఆ నిధులు ఎక్కడివి అని పెద్ద సుదర్శన్ రెడ్డి అడిగారు. పట్టణంలోని నిరుపేద ప్రజలకు శుభకార్యాల కోసం ఏసీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తే నేటికీ ప్రారంభం చేయలేదని ఆరోపించారు.మహిళా పథకాలతో కాంగ్రెస్ పార్టీకి తలొగ్గిన ప్రజలకు మోసం జరిగింది. నాగెల్లి పద్మ వెంకటనారాయణ గౌడ్ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి..మరో గౌరవ పదమైన మెట్టుపై నిల్చుపెడుతానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, వార్డు బాధ్యులు, పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.
నాలుగు లేబర్ కొడ్లకు కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్న మాట్లాడుతూ 12 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రజా అనుకూల చట్టాలను లేకపోగా ప్రజలు వివిధ పోరాటాల రూపంలో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడమే గొప్ప విజయంగా చెప్పుకుంటుందన్నారు. ఫిబ్రవరి 12న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నాలుగు లేబర్ కొడ్లకు కు వ్యతిరేకంగా బిజెపి ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికుల శ్రమదోపిడిని అరికట్టాలని గుండాలలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం నగేష్,మెంతిని నగేష్, తాటి కృష్ణ,చేబోతు రవి, సత్తు, ధనరాజ్,గడ్డం లాలయ్య గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతా నరసయ్య చిరంజీవి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
* ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప చరిత్ర సీపీఐ పార్టీది * చేవెళ్లలో త్వరలో 700 వందల గుడిసెలకు పట్టాలు * సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సీపీఐ మండల పార్టీ కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి అధ్యక్షతన సీపీఐ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ చేవెళ్ల మున్సిపాలిటీ ఎన్నికల బరిలో సిపిఐ పార్టీ నుండి 10వ వార్డులో పోటీచేస్తున్న ఎండి.మక్బూల్ ను 17వ వార్డులో పోటీలో ఉన్న సార్ల వెంకటేష్ లను కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే విదంగా నాయకులు శ్రమించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ నాయకులకు సూచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రజా సమస్యల పైన అలుపెరుగని పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించిందని, ఇండ్లు లేని నిరుపేదల కోసం భూ పోరాటాలు నిర్వహించి చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ వెనకాల 200 ఇండ్ల స్థలాలు ఇప్పించి వారికి పట్టాలు ఇప్పించడం జరిగిందని, అదేవిధంగా భగత్ సింగ్ నగర్, రామన్నగూడలో, మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గేటు దగ్గర భూ పోరాటాలు నిర్వహించి ఎంతోమంది ఇండ్లు లేని నిరాశ్రయులకు ఇండ్ల స్థలాలు ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని 75వ సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల స్థలములో 700 వందల గుడిసెలు వేసి భూ పోరాటం నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో వారికి పట్టాలు వచ్చేంతవరకు భారత కమ్యూనిస్టు పార్టీ వారికి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి కె రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం ప్రబు లింగం ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు 10వ వార్డు అభ్యర్థివి ఎండి మక్బుల్ 17వ వార్డు అభ్యర్థి సార్లా వెంకటేష్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, బి కే యం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య, గీత పనివాళ్ల సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్ , పాపయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పద్దెనిమిదో వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించారు. పల్లె రాజు శ్రీదేవి పద్ధెనిమిధో వార్డ్ లో తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అశోక్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. 40 ఏండ్లు గా కాంగ్రెస్ పార్టీ లో కార్య కర్త గా కొనసాగుతున్న తనకు పద్ధెనిమిదవ వార్డ్ అభ్యర్ధి గా స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి బల పరచారని తెలిపారు. హస్తం గుర్తు కు ఓటు వేసి బారి విజయం అందించాలని కోరారు.
`ప్రభుత్వం దర్యాప్తు చేస్తే అసలు మోసం తెలుస్తుంది?
హైదరాబాద్, నేటిధాత్రి:
మంచి చెబితే ఈసమాజంలో కొంత మంది వనరు. చెడు మాటలే ఎక్కువగా వుంటారు. కాసులకు కక్కుర్తి పడేవారికి మంచి మాటలు అసలే చెవికెక్కవు. కనÅ£దుర్గ చిట్‌పండ్ విషయంలో నేటిధాత్రి బాధితులకు న్యాయం చేయాలని కోరుతోంది. వారిని ఆదుకోవాలని సూచిస్తోంది. కాని డీఆర్ ఏం చేస్తున్నారు. బాధితుల పక్షాన కాదని, చిట్ కంపనీకి మేలు చేసే దారిలో వున్నారు. అది తప్పని నేటిధాత్రి చెబుతోంది. ఎందుకంటే 8 సంవత్సరాలుగా బాధితులు వాళ్లు పెట్టిన సొమ్ముకోసం ఎదురుచూస్తున్నారు. ఎంతో నమ్మకంతో కనకదుర్గ చిట్ ఫండ్ కంపనీలో చిట్లు వేసుకున్నారు. కంపనీ ఏజెంట్లు చెప్పిన మాటలు విన్నారు. కంపనీపై న మ్మకం పెంచుకున్నారు. కష్టపడి సంపాదించి, రూపాయి, రూపాయి కూడబెట్టుకొని చిట్టిలు కట్టారు. అవసరానికి అక్కరకొస్తాయని ఆశపడ్డారు. కాని ఏం జరిగింది. కంపనీ దివాళా తీసిందని చేతులెత్తేసి చిట్టిలు కట్టిన వారిని శఠగోపం పెట్టాలని చూశారు. బాదితులు లబోదిబోమన్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము, చిట్స్ పంకనీ దోచేస్తుంటే కడుపు నిండా తిండి తినలేక, కంటి నిండా నిద్ర రాక 8 సంవత్సరాలుగా ఏడుస్తున్నారు. సిఎం. రేవంత్ రెడ్డి సర్కారు పుణ్యమా అని వారి ఆశలు తీరే దారి కనిపించింది. చిట్టిలు కట్టిన వారు ఎవరూ తెలంగాణలో మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. తెలంగాణలో వున్న అన్ని చిట్ ఫండ్ కంపనీలకు ఈ జీవో వర్తిస్తుందని, ఏ కంపనీ బాధితులను మోసం చేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాధితుల పక్షాన నిలిచారు. ప్రజల సొమ్ము ఎగవేయాలని చూసిన కంపనీలకు హెచ్చరికలు జారీ చేశారు. కనకదుర్గ చిట్ కంపనీ నుంచి బాదితులకు సొమ్ములు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. కాని ఏమైంది? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాదితుల పక్షాన కాకుండా చిట్ కంపనీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాదితులు అనేక మంది నేటిధాత్రిని ఆశ్రయించారు. ప్రభుత్వం పేదల పక్షాన నిలిస్తే అదికారులు మోసగాళ్లతో చేతులు కలుపుతున్నారు. ఆశలు నెరవేరే సమయంలో ఆ ఆశలు అడియాసలయ్యేలా వున్నాయి. మా సొమ్ము మొత్తం ఆవిరయ్యే పరిస్దితులు కనిపిస్తున్నాయని నేటిధాత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దానిపై నేటిధాత్రి దినపత్రిక కథనం రాసింది. బాదితుల పక్షాన నిలిచింది. బాధితులు చెప్పిన విషయాలను చెప్పింది. అంతే డిఆర్‌కు కోపం వచ్చింది. నేటిదాత్రి మీద చిందులేసినట్లు తెలిసింది. నేటిధాత్రి మీద కేసు నమోదు చేస్తానని బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సమాచారం అందింది. అసలు నేటిధాత్రి అడిగిందేమిటి? రిజిస్ట్రార్‌వా..లేక రింగ్ మాస్టర్‌వా? అని ఫ్రశ్నించింది. బాధితులను మోసం చేస్తుంటే నేటిధాత్రి చూస్తూ ఊరుకోవాలా? లేక చాల మంచి పని చేస్తున్నావని శభాష్ అని పొగడాలా? డిఆర్ కమీషన్లకు ఆశపడి బాదితులకు అన్యాయం చేయొద్దని సూచించింది. అది తప్పెలా అవుతుంది? ప్రభుత్వ లక్ష్యానికి గండికొడతావా? ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా వ్యవహారం నడుపుతావా? అని అడగడం తప్పైపోయిందా? ప్రజలకు అండగా వుంటే ఆ డిఆర్‌ను ప్రజలు జేజేలు కొడతారు. ఎందుకంటే 8 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొమ్ములో కనీసం దాచుకున్నదైనా చివరకు చేతికొస్తుందని బాదితులు సంతోషపడతారు? తమకు చెక్కులు అందించినందుకు డిఆర్‌కు ప్రజలే కత్పు్ఞతలు తెలుపుకుంటారు. బతికున్నంత కాలం మొక్కుతారు. వందల మంది కుటుంబాలలో వెలుగులు నిండుతాయి. వాళ్లంతా డిఆర్‌ను దీవిస్తారు. అది కాదనుకొని కాసుక కోసం కక్కుర్తి పడితే తిడతారు? శపిస్తారు? నిందిస్తారు? నిందలు వేస్తారు? వాళ్ల ఉసురు తగిలేంతగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తారు? బాదితుల జేజేలు కావాలా? వారి శాపాలు కావాలా? కమీషన్లు అందితే చాలనుకుంటున్నారా? అని గుర్తు చేసింది. ఇది కూడా డిఆర్‌కు తప్ప్పుగా తోచింది. నాకు పెద్ద పెద్ద వాళ్లు తెలుసు. నేటిదాత్రిని ఏం చేస్తానో చూడండి? అంటూ గాండ్రిస్తున్నాడట? డిఆర్ నిజంగానే మీకు ధైర్యం వుంటే ఆ పెద్ద వాళ్ల పేర్లు చెప్పండి? ఆ పెద్ద వాళ్ల వద్దకే నేటిధాత్రి వెళ్లి ప్రశ్నిస్తుంది. డిఆర్ వెనుక మీరున్నారట? అది నిజమేనా? బాదితులకు అన్యాయం చేయమని మీరే చెప్పారా? అని నిలదీయడానికి నేటిధాత్రికి పెద్ద సమస్య కాదు? అప్ప్పుడు ఆ పెద్దల పేర్లనే బైటపెడతాం? బాదితులకు న్యాయం జరిగేలా చేస్తాం? డిఆర్ ఎవరి పేరు చెబితే వాళ్ల వద్దకు నేటిధాత్రి వెళ్తుంది. పేదలకు అన్యాయం చేయమని ఎలా చెప్పారో నిలదీస్తుంది? డిఆర్ వెనకాల వున్న ఆ పెద్దలు బాధితులకు అన్యాయం చేసి, చిట్ కంపనీని అండగా నిలబడమని ఎలా చెప్పారో కడిగేస్తాం? నాయకుల పేరు చెప్పి నాటకాలాడితే, కేసులు పెట్టి బెదిరిస్తామంటే నేటిధాత్రి అదిరిపోయే మీడియా కాదు? బాదితులందరికీ న్యాయం జరిగేదాకా నేటిధాత్రి పోరాటం ఆగదు. బాధితులకు న్యాయం చేయమంటే నేటిధాత్రి అంతు చూస్తామంటే బెదిరిపోయేవారు ఎవరూ లేరు? ఇలాంటి బెదిరింపులు మీడియాకు కొత్తకాదు. నేటిదాత్రికి అసలే కొత్త కాదు. అలా బెదిరించి, అక్రమాలు చేసిన వారు ఎంతో మంది ఊచలు లెక్కించారు. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. చేసిన పనికి ఇప్ప్పుడు సిగ్గుపడుతున్నారు. జనం చేత చీకొట్టించుకున్నారు. పైగా ప్రజలకు ఎక్కడా అన్యాయం జరగొద్దన్న సదుద్ధేశ్యంతో 8 సంవత్సరాలుగా గత పాలకులు చేయలేని మంచి పనిని రేవంత్ రెడ్డి సర్కారు చేసింది. బాదితులకు న్యాయం జరగాలని కోరుకుంటోంది. కాని మధ్యలో సైందువుల్లాగా కొంత మంది అదికారులు అడ్డుపడుతుంటే ఆగుతుందా? కురుక్షేత్ర యుద్దం ఆనాడు ఆగిందా? బాధితుల పక్షాన నేటిధాత్రి చేసే అక్షరపోరాటం ఆగుతుందనుకుంటున్నారా? అక్షరాలు నిప్ప్పు కణికలై మండుతాయి. తప్ప్పు చేసిన వారిని నిప్ప్పులతో కడిగేసేలా అక్షరాలు మండుతాయి. బాదితులే కాదు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఒక్కసారి డిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నారో చూడండి. ప్రతిపక్షాలకు మేలు జరిగేలా ఎలా వ్యవహరిస్తున్నారో గమనించండి? 8 ఎనమిది సంవత్సరాలుగా జరగని న్యాయం, బాదితులుకు ఇప్ప్పుడు జరుగుతుంటే డిఆర్ అడ్డుపడుతుంటే కాంగ్రెస్ పార్టీకే నష్టమౌతుంది. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు చెడ్డ పేరు వస్తుంది. అదును చూసి డిఆర్ ఎలాంటి ఎత్తుగడ వేశారో తెలుసుకోండి. బాదితులు కాంగ్రెస్ ఫ్రభుత్వాన్ని నిందించేలా డిఆర్ వ్యవహర శైలిని అర్దం చేసుకోండి. పైగా నా వెనుకు పెద్ద పెద్ద వాళ్లు వున్నారంటూ చూపించేంది కూడా కాంగ్రెస్ నాయకులనే…అంటే కాంగ్రెస్ నాయకుల చేతనే, కాంగ్రెస్ కన్ను పొడవాలని డిఆర్ చూస్తున్నారు. డిఆర్ చిట్ కంపనీకి అనుకూలంగా వుంటే కమీషన్ల మీద కమీషన్లు వస్తాయి. కాని అదే డిఆర్ బాదితుల పక్షాన నిలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఓట్లు వస్తాయి? ఇదైనా కాంగ్రెస్ నాయకులు తెలుసుకుంటే ఎంతో మంచిది. లేకుంటే బాధితులు చేసే ప్రచారం మూలంగా కాంగ్రెస్‌కు నష్టం వస్తుంది. 8 సంవత్సరాలు ఏమీ చేయని పార్టీకి సానుభూతి పెరుగుతుంది. మంచి చేయాలకున్న కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతంది. ఇలా కొంత మంది అధికారులు తమ సొంత లాభం కోసం ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తున్నారు. ఈ డిఆర్ బాధితులకు చెందిన చెక్కులు చింపేశారని తెలుస్తోంది. చిట్ కంపనీలు చెప్పిన వారికి చెక్కులు జారీ చేసినట్లు కూడా సమాచారం వుంది. ఇలా బాధితులకు అడుగడుగునా అన్యాయం చేసే డిఆర్ చర్యలపై ప్రభుత్వం దష్టి సారించాలి. జరుగుతున్న అక్రమ వ్యవహారాన్ని బట్టబయలు చేయాలి. బాధితులకు న్యాయం జరగాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి. బాదితుల కళ్లలో ఆనందం నిండాలి. అందుకోసం నేటిధాత్రి ఎంత దూరమైనా వెళ్తుంది. నేటిధాత్రి మీద పెంచుకోవాల్సింది కోపం కాదు..జరగాల్సింది బాధితులకు న్యాయం. ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగితే ఆ కథే వేరుగా వుంటుంది. బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుంది. చిట్ మోసాలు, డిఆర్ సహకారాలు అన్నీ వెలుగులోకి వస్తాయి?
* డబ్బుకు కాదు అభివృద్ధికి ఓటు వెయ్యండి * భగత్ సింగ్ నగర్, రంగారెడ్డి, సీపీఐ కాలనీలు అభివృద్ధిలో 20 ఏళ్లు వెనకబడ్డాయి. * ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చూపిస్తా * మీ కుటుంబంలో బిడ్డగా ఉంటా పిలిస్తే పలుకుతా * ప్రజల ముందుకు 17వార్డు అభ్యర్థి జర్నలిస్ట్ ఆనంద్
చేవెళ్ల, నేటిధాత్రి:
ఒకప్పుడు ఎన్నికలు నిజాయితీగా ప్రజాపక్షపాతంగా, చదువుకున్న విజ్ఞానవంతులు, సామజిక స్పృహ కలిగిన వ్యక్తుల మధ్య జరిగేవని, కాని ఇప్పుడున్న రాజకీయం డబ్బులు ఉన్నవాడికే సొంతం అన్నవిదంగా రాజకీయాలు మారిపోయాయని సీనియర్ జర్నలిస్ట్ 17వ వార్డు బిఆరెస్ అభ్యర్థి కడమంచి ఆనంద్ అన్నారు. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు డబ్బుకు లిక్కర్ కు లొంగి 5 ఏళ్ళ మీ పవిత్రమైన ఓటును అమ్ముకోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు రాజకీయాలు మంచికి, మమకారానికి అభివృద్ధి పతానికి మధ్య జరిగేవని కాని ఇప్పుడు డబ్బుకు – అభివృద్ధికి నిజాయతికి మధ్య ఎన్నికలు జరుగుతు న్నాయని అన్నారు. బుధవారం సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి మల్గారి విజయ్ భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు వార్డు ప్రజలతో కలిసి 17వార్డులోని భగత్ సింగ్ నగర్, రంగారెడ్డి, సీపీఐ కాలనీలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఒక్కరోజు మీ ఓటు తీర్పు, ఐదేళ్ల మీ అభివృద్ధికి బాటలు వేస్తానని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉన్న మీ ఇంటి బిడ్డగా పిలిస్తే పలుకుతానని అన్నారు. తాను జర్నలిస్టుగా 20 ఏళ్ళు సమాజానికి సేవచేసానని, ఇప్పుడు చేవెళ్ల పట్టణ అభివృద్ధిలో భాగస్వామిగా సేవ చేసేందుకు పోటీ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చేది కెసిఆర్ ప్రభుత్వమని తాను గెలిచిన వెంటనే వార్డులల్లో ప్రధాన సమస్యలను పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించమని ఓటర్లను కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తనకు వార్డు ప్రజల మద్దతు బాగుందని తెలిపారు. ఆయన వెంట బిఆరెస్ నాయకులు వార్డు ప్రజలు ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లకు మించకుండా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కేటాయించబడిన సిబ్బందికి పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశం తెలిసి ఉండాలని,ఓటింగ్ కంపార్ట్మెంట్ గోప్యత నిర్వహణ సక్రమంగా చేయాలని తెలిపారు.ఇతరులకు బదులుగా ఓటు వేయడం, ఒకటికి మించి ఓటు వేయడం జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని,పోలింగ్ ముగిశాక తీసుకోవలసిన జాగ్రత్తలు,పాటించవలసిన నియమాలపై శిక్షణలో తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.పోలింగ్ అధికారులకు కేంద్రాలలో త్రాగునీరు,మూత్రశాలలు, లైటింగ్,ఫ్యాన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు,బాలింతలు మినహాయింపు కోరినట్లయితే ఆమోదించడం జరుగుతుందని,మిగతా వారికి అత్యవసర ఆరోగ్య పరిస్థితులు,ఇతర ఇబ్బందులు తలెత్తితే తప్ప పోలింగ్ విధులలో మినహాయింపు ఉండదని తెలిపారు.11వ తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని,12 రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే),13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ అన్వేష్, మాస్టర్ ట్రైనర్ హరిప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం,కరకగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠధామం నుంచి మైసమ్మ చెట్టు పక్కగా ఉన్న రహదారి రైతుల రాకపోకలకు అనుకూలంగా లేకపోవడంతో, ఈరోజు మన అభిమాన నాయకులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు , ఎన్.ఆర్.ఇ.జి. ఎస్ జేఈ తో మరియు గ్రామ పెద్దలు కొంపెల్లి పెద్ద రామలింగం గ,జలగం వెంకన్న ,స్తానిక రైతులతో కలిసి ఆ రహదారిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరడం జరిగింది. గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలిపారు
పట్టణానికి చెందిన బిఆర్ఎస్ మహిళ నాయకురాలు జ్యోతిని పట్టణ బిఆర్ఎస్ మహిళ కన్వీనర్‌గా నియమిస్తున్నట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు.పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ,మహిళా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న కడారి జ్యోతి సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.పరకాల పట్టణంలో బిఆర్ఎస్ మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసి,పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ చీఫ్ నితిన్ నబిన్
మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 04: తెలంగాణలో రాజకీయాలు చాలా దయనీయంగా ఉన్నాయని.. మనదేశ సంస్కృతి సంప్రదాయాలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా విమర్శించారు. బుధవారం నాడు మహబూబ్ నగర్‌లోని ఎంవిఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నితిన్ నబీన్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ నిధులను మైనార్టీలకు బదలాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉందని గుర్తు చేశారు. ముస్లింల ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు నితిన్ నబీన్.
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..
ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుక
లోక్‌సభ మళ్లీ వాయిదా..
ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు
2026-27 ఏపీ బడ్జెట్.. పయ్యావుల కీలక చర్చలు.. వాటిపైనే స్పెషల
బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రి
అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల కూతురిని చేర్పించిన ఐఏఎస్.. నెట్ట
వాలెంటైన్స్ వీక్.. ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
నా భార్య, పిల్లలు ఎందుకు చనిపోయారో తెలియడం లేదు: సురేందర్ రె
భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్
మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ,
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలను కూల్చారంటూ మండిపడ్డారు నితిన్ నబీన్. ఆలయాలపై రాజకీయం చేస్తే.. బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. అవసరమైతే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే.. ఎక్కువ రోజులు ఉండబోదంటూ హెచ్చరించారు. ప్రధాని మోదీ.. మహిళలను లక్షాధికారులను చేయాలని చూస్తే.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలను పూర్తిగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు నితిన్ నబీన్ సూచించారు.
కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
భూపాలపల్లి నేటిధాత్రి
ఈనెల 8న మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బుధవారం కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, పూజారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో వడివట్టం కట్టి ఘన స్వాగతం పలికారు. భద్రత, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలపై సమీక్ష అనంతరం దేవాలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ప్రతి సెక్టార్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. దేవాలయాన్ని సుందరంగా అలంకరించాలని, పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ముమ్మరంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించాలన్నారు. ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటన దృష్ట్యా నాలుగు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా దారి సూచించే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మల్చూర్ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఎంపిఓ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉగాది రోజున ఘనంగా గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం
హైదరాబాద్‌ను ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాగాయకుడు గద్దర్ కళల ద్వారా సమాజానికి తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడని కొనియాడారు డిప్యూటీ సీఎం.
హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) సచివాలయంలో గద్దర్ అవార్డుల జ్యూరీ సభ్యులతో డిప్యూటీ సీఎం కీలక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ను ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అన్ని భాషల సినీ పరిశ్రమలు ఇక్కడికి విస్తరించేలా అనుకూల వాతావరణం కల్పిస్తామన్నారు. దీని ద్వారా సినీ రంగంలో యువత, టెక్నీషియన్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. సినీ ప్రపంచ మార్కెట్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని వెల్లడించారు.
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..
ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుక
లోక్‌సభ మళ్లీ వాయిదా..
ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు
2026-27 ఏపీ బడ్జెట్.. పయ్యావుల కీలక చర్చలు.. వాటిపైనే స్పెషల
బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రి
అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల కూతురిని చేర్పించిన ఐఏఎస్.. నెట్ట
వాలెంటైన్స్ వీక్.. ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
నా భార్య, పిల్లలు ఎందుకు చనిపోయారో తెలియడం లేదు: సురేందర్ రె
భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్
మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ,
కళల ద్వారా సమాజానికి తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడు ప్రజా గాయకుడు గద్దర్ అని అన్నారు. అందుకే గద్దర్ పేరు మీద సినిమా అవార్డులను ప్రారంభించి సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే అవార్డులు ఇవ్వాలని జ్యూరీ సభ్యులకు సూచించారు. ఉగాది రోజు మార్చి 19న ఘనంగా అవార్డుల పంపిణీ జరగనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఫిబ్రవరి 6 నుంచి గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మహిళ కూలీల శవాలను చూసి దిగ్బ్రాంతి మల్లాపూర్ ఫిబ్రవరి 4 నేటి ధాత్రి
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురై మరణించిన మహిళ వ్యవసాయ కూలీల శవాలను మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించారు ఆసుపత్రి లో శవాలను చూసిన జువ్వాడి కృష్ణారావు దిగ్భ్రాంతి కి గురయ్యారు నిన్న జరిగిన ప్రమాదంలో నలుగురుమహిళా వ్యవసాయ కూలీలు మరణించడం అత్యంత బాధాకరమని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని ఈ సందర్భంగా కృష్ణారావు అన్నారు కృష్ణ రావు వెంట మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాసరెడ్డి మాజీ జడ్పిటిసి సభ్యుడు జల పతిరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వార్ద సురేష్ మాజీ ఎంపిటిసి సభ్యులు మరిపెళ్లి మల్లయ్య మాట్ల సోమయ్య తదితరులు ఉన్నారు.
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి . కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు
నర్సంపేట, నేటిధాత్రి:
కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టం జరిగే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని బుధవారం అఖిలపక్ష కార్మిక సంఘాలైన బిఆర్టియు,ఏఐటియుసి, ఐఎఫ్టియు, మాస్ లైన్ ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కమిటీ కార్యదర్శి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సింగరకొండ మాధవ శంకర్ లకు సమ్మె నోటీసులు అందజేశారు.ఈసందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు,హమలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ.ఏ ఐ టి యు సి సివిల్ సప్లై రాష్ట్ర నాయకులు గుంపెల్లి మునీశ్వర్,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న బడా కార్పోరేట్ శక్తులు దోపిడీ చేసుకోవడానికి కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయని సాకుతో కేంద్ర ప్రభుత్వంతో మికకత్ ఆయ్యి కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదని ఆరోపించారు.కార్మిక వర్గం ఒకటై ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెరమండ్ల రవి, రాములు, జనార్ధన్, ప్రసాద్, మల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అరబ్బు గడ్డపై అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా వనిత ప్రసంగం
సౌదీ అరేబియాలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో ఆంధ్ర వనిత చేతనకు తన అభిప్రాయాలను పంచుకునే అరుదైన అవకాశం దక్కింది. విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికుల ఆరోగ్య భద్రతపై ఆమె ప్రసంగించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అరబ్బు దేశంలో జరిగిన ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్మిక సదస్సులో పాల్గొని కీలకమైన అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అరుదై అవకాశం ఒక ఆంధ్ర వనితకు దక్కింది.
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..
ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుక
లోక్‌సభ మళ్లీ వాయిదా..
ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు
2026-27 ఏపీ బడ్జెట్.. పయ్యావుల కీలక చర్చలు.. వాటిపైనే స్పెషల
బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రి
అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల కూతురిని చేర్పించిన ఐఏఎస్.. నెట్ట
వాలెంటైన్స్ వీక్.. ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
నా భార్య, పిల్లలు ఎందుకు చనిపోయారో తెలియడం లేదు: సురేందర్ రె
భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్
మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ,ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పుల గురించి చర్చించడానికి ప్రపంచ కార్మిక మార్కెట్ సదస్సు (జి.యల్.యం.సి) తాజాగా జరిగింది. ఈ సదస్సులో వందకు పైగా దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, సౌదీ అరేబియా మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపుర్కు చెందిన చేతన జగదేశ్వరికి కూడా ఈ సదస్సులో ఓ ముఖ్య అంశంపై మాట్లాడే అవకాశం దక్కింది.
సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ కార్మిక సంస్థ, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఐరోపా యూనియన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక ఉష్ణోగ్రతల్లో, సరైన వసతులు, వెలుతురు, గాలి లేకుండా నివసించే కార్మికుల పరిరక్షణలో సామాజిక బాధ్యత అనే అంశంపై ఈ సదస్సులో జరిగిన చర్చలో తాను ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో మాట్లాడానని చేతన తెలిపారు.
శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం తిరుగువారం సందర్భంగా వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం తో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొదట గా జంపన్న వాగు లో పుణ్య స్నానాలు ఆచరించి వన దేవతలకు బంగారం,ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ కొనసాగుతున్నా తరుణం లో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర పరిసర ప్రాంతాలలోని వ్యర్ధాలను పారిశుధ్య కార్మికుల ద్వారా తొలగిస్తూ వ్యాధులు ప్రబలకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుగువారం సందర్భంగా వన దేవతల పూజారులు కన్నేపల్లి ఆలయం లో శుద్ధి కార్యక్రమం నిర్వహించి వన దేవతలకు దీప దూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవార్ల పూజ సామాగ్రి,పట్టు వస్త్రాలను పూజారులు భద్రపరుస్తారు.
న్యాల్కల్ దర్గాలో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు: హైదరాబాద్ కుషాల్ విజేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో జరిగిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి.ఈ పోటీలకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు పైల్వాన్లు తరలివచ్చి తమ సత్తా చాటారు. న్యాల్కల్ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగాయి.మహారాష్ట్ర, హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల మల్లయోధులు పాల్గొన్న ఈ పోటీల్లో, హైదరాబాద్ కు చెందిన కుశాల్, మహారాష్ట్ర ప్రత్యర్థిని ఓడించి విజేతగా నిలిచారు. విజేత కుశాల్ కు రూ.25,000 నగదు బహుమతితో పాటు శాలువా కప్పి సన్మానించారు. యువత కేరింతల మధ్య జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి, ఉర్సు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హిందూ ద్రోహి వైసీపీ.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు
హిందూ ద్రోహి వైసీపీ అంటూ జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫైర్ అవుతూ బుధవారం నాడు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.
హిందూ ద్రోహి వైసీపీ అంటూ జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫైర్ అవుతూ.. బుధవారం నాడు నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘ఆది శంకరుల అద్వైతం. నేను పరమాత్మను నమ్ముతాను. హిందుత్వం అనేది ఒక ధర్మం. ఇది జియోగ్రాఫికల్ ఐడెంటిటీ. ఈ పుణ్య భూమిలో పుట్టిన ప్రతిఒక్కరూ హిందువే. నా ధర్మాన్ని గౌరవిస్తూ.. ఇతరులను కించపరచకుండా బతుకుతాను. అలానే అర్చకుల జీతభత్యాల గురించి నేను శాసనమండలిలో మాట్లాడాను’ అని నాగబాబు తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..
ఎమ్మెల్యే సంజయ్‌కి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుక
లోక్‌సభ మళ్లీ వాయిదా..
ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు
2026-27 ఏపీ బడ్జెట్.. పయ్యావుల కీలక చర్చలు.. వాటిపైనే స్పెషల
బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రి
అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల కూతురిని చేర్పించిన ఐఏఎస్.. నెట్ట
వాలెంటైన్స్ వీక్.. ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే
నా భార్య, పిల్లలు ఎందుకు చనిపోయారో తెలియడం లేదు: సురేందర్ రె
భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్
మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ,
ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దారుణ ఘటనలను నాగబాబు ప్రస్తావించారు. ‘2020 సెప్టెంబర్ 6న అంతర్వేది రథం దగ్ధమైన రోజు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఉద్యమాలకు తలొగ్గి కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పింది. 2023లో ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే.. అంతర్వేది కేసును అసలు తాము విచారణ చేయలేదని సీబీఐ వివరించింది. అంటే వైసీపీ నేతలు చేసిన ప్రకటనను అమలు చేయకుండా మోసం చేశారని తేలిపోయింది. మసి పూసి మారేడు కాయ చేయడంలో నిపుణులైన వైసీపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడరు. అవతలి వారి వ్యక్తిగత జీవితాలపై వారికి ఉన్న ఆసక్తి.. హిందూ ఆలయాలపై ఎందుకు ఉంటుంది. రామతీర్ధం రాముడు మనకు దైవం.. డిసెంబర్ 2020లో రాముడు తల నరికినా వైసీపీ ప్రభుత్వంలో చర్యలు లేవు. నామ్ కే వాస్త్‌గా కేసులు పెట్టి.. చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో దోషులను శిక్షించలేదు. మీరు, మీ మంత్రులకు ఇతర వ్యక్తుల సినిమాలపై రివ్యూలు ఇచ్చే శ్రద్ధ రాముడిపై ఎందుకు ఉంటుంది’ అని ఆయన అన్నారు.
‘అయోధ్యలో రామమందిరం కల సాకారం అయితే.. చంద్రబాబు, పవన్ వెళ్లి పాలు పంచుకున్నారు. నేడు హిందువులపై ఎక్కడ లేని ప్రేమ వలక పోస్తున్న ఆ నాయకుడు అయోధ్యపై ఒక్క పోస్టు అయినా పెట్టారా?. వెళ్లలేక పోయినా కనీసం స్పందిస్తూ.. ప్రకటన అయినా విడుదల చేశారా?. పేదల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోవాలని చూస్తారు. అటువంటి కొండపై వసతుల ఛార్జీలు ఇష్టం వచ్చినట్లు పెంచేశారు. ఇది సామాన్యులకు భగవంతుడిని దూరం చేయడం కాదా?. మాఫియా కోసం పేద ప్రజలను వెంకన్న స్వామికి అందకుండా చేస్తారా?. కూరగాయలు బేరమాడినట్లు సేవల పెంపులో వైసీపీ నేత సుబ్బారెడ్డి బేరం ఆడిన విధానం అందరూ చూశారు. తిరుమలపై నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు.. టీటీడీ కామన్ గుడ్ ఫండ్ ఇచ్చే కంట్రిబ్యూషన్ రూ.2.50 కోట్లు ఉండేది.. రూ.50 కోట్లకు ఒకేసారి పెంచేశావు’ అని నాగబాబు విమర్శించారు.
‘తిరుపతిలోనే కాదు.. ఎక్కడ కొండ కనిపించినా గుండు కొట్టేయడమే మీకు అలవాటు. డిక్లరేషన్ ను గౌరవించడం మన సంప్రదాయం. అయినా బాధ్యత గురించి వైసీపీ నేతలకు చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లే. పవన్ కల్యాణ్ తన సతీమణి, పిల్లలను తీసుకెళ్లినప్పుడు, అలానే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చారు. అబ్దుల్ కలాం కంటే నువ్వు గొప్పోడివా.. నీ మంత్రి వచ్చి తిరుమల నీ అమ్మ మొగుడు కట్టాడా అంటాడా..?. అలా తలపొగరుతో మాట్లాడినందుకే 151 మధ్యలో 5 తీసేసి 11 సీట్లే ఇచ్చారు. అయినా నువ్వేమైనా మారావా.. డిక్లరేషన్ అడిగారని తిరుమల పర్యటన మానుకున్న చరిత్ర నీది. సెక్యులర్, రిలీజియస్ ప్లేస్‌లకు తేడా తెలియని వ్యక్తివి నువ్వు. తిరుమల కల్తీ ఉదంతంలో అబద్ధాలు చెబుతున్నారు’ అంటూ వైసీపీపై నాగబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
· Boiled rice millers are overjoyed with the new idea given by the “GM”?
· “Go to Delhi with the letter written by Minister Uttam Kumar Reddy in the past?”
· “I will talk to the Union Minister again,” the “GM” assures?
· A scheme to cover the dues with the Yasangi paddy?
· Another backdoor attempt to get the centre to take 15 lakh tonnes of boiled rice?
· Even though the centre is completely refusing, the “FCI GM” is making another diplomatic effort to convince them?
· A strategy using the letter written by Minister Uttam Kumar Reddy in the past as leverage?
· Even if asked to supply boiled rice immediately, the millers don’t have a single grain of rice?
· The wickedness of the millers who are completely deceiving the centre and the state with empty hands?
· They cannot supply rice until the Yasangi crop is harvested?
· Yet, they are acting as if they have rice?
· The boiled rice millers sold the rice a long time ago and washed their hands of it?
· With the government conducting vigilance raids, they are becoming like rats caught in a trap?
· They cannot supply boiled rice even if asked to do so immediately?
· They sold the rice last year and made money? And hoarded it? Have they cheated the government?
· The boiled rice millers did not anticipate that the government would conduct vigilance raids?
· With the accounts of 15 lakh tonnes of rice being revealed, they have been caught red-handed?
· They already owe the government Rs. “12,000crore”?
· If they take the Rabi season paddy, another Rs. “12,000crore”? in new dues will accumulate?
· The tender paddy dues from the past, amounting to over “Rs. 4,000 crore” are still pending?
· If all these are added up, the dues from the boiled rice millers will amount to at least Rs.20000crores?
· If these dues are collected, all the promises made by the government can be implemented in one go?
Hyderabad, Netidhatri:
Perhaps this is what is meant by “a thousand problems require a million solutions”! Is it with the support of government officials that those who are diverting government funds, selling rice illegally, accumulating assets, and amassing crores of rupees are still looking for ways to cheat the government? It sounds bizarre. How can the system improve when the officials, who are responsible for taking action against those who cheated the government, are addicted to bribes and are committing frauds while drawing government salaries? Farmers toil for months to cultivate paddy, which the government then purchases. The boiled rice millers, who are supposed to process this paddy into rice, are selling the rice illegally and earning crores. They are brazenly selling the rice that should be returned to the government. They are showing a defiant attitude towards the government. When the government exerts even a little pressure, they are trying to collude with corrupt officials to further deceive the government. Is this how the system works? Is this the duty of those who are supposed to be fulfilling their responsibilities? Are the millers, who are supposed to process the paddy given by the government into rice and return it to the government, allowed to sell it as they please? Moreover, when the government is conducting vigilance raids, are they colluding with officials to engage in even more fraudulent activities? Is this the job of the millers? Taking advantage of the lenient attitude of the governments, some millers are playing games and completely deceiving the government. So, what exactly happened is that all the boiled rice millers in Telangana state owe the government approximately 15 lakh metric tons of rice. Its value is thousands of crores of rupees. Many subsidies that the state government is supposed to receive from the central government through the FCI (Food Corporation of India) are pending. The government is trying to get them released. During this time, the government requested the central government to accept the boiled rice available in Telangana. The central government clearly stated that it does not need boiled rice! “If you have raw rice, give that. We will only accept raw rice.” The central government expressed its willingness to accept 15 lakh metric tons of rice from the state government. This is where the real problem arose. Currently, the boiled rice millers do not have a single grain of rice. They don’t even have boiled rice. The state government also needs some time to make up for those 15 lakh metric tons of rice. They need to ensure that there is no pressure from the government. Moreover, they need to find a way to make the central government purchase boiled rice. For this purpose, all the millers in Telangana met with the General Manager of the Food Corporation of India (FCI) in Telangana. They explained their situation. It is also reported that the GM said he would resolve the situation if he was given twenty crore rupees. As part of this, one crore rupees were to be given upfront. A deal was struck between the millers and contractors that the remaining amount would be given as soon as permission was obtained from the central minister. This information reached Netidhatri. Immediately, Netidhatri revealed what was happening, prominently publishing the news as “FCI GM’s Bumper Offer.” The news reached Delhi, and the deal was cancelled. The central government became serious. The GM threw up his hands, saying he couldn’t do anything more. However, he whispered to the millers that even if Plan A failed, he had a Plan B. He advised them that they could complete the work using the letter previously written by the state government to the central government. This is because the then State Civil Supplies Minister, Uttam Kumar Reddy, had written to the central government stating that there were 15 lakh metric tons of boiled rice in Telangana and that it should be purchased. However, the central government did not agree at that time. Now, it has clearly stated that it does not want boiled rice at all. It said that it would accept the rice only if it was raw rice. The government also wanted to somehow rescue the boiled rice millers. But the government was unaware of the misdeeds of the boiled rice millers. It did not realize that the boiled rice millers were deceiving the government. However, according to reliable information, Minister Uttam Kumar Reddy has now asked them to go to Delhi with the letter he wrote, saying that he would speak to the central minister again. This is where the real problem lies. Even if the central government agrees, the millers don’t have a single grain of rice to give. Unless the Yasangi crop arrives and the government allocates the paddy for milling, the boiled rice millers will not have any rice. They have to deceive the state government until the Yasangi crop arrives and convince the central government. This is the real scheme of the boiled rice millers. Even without a single grain of rice in their hands, the millers are playing a new drama to convince the central government. The GM will ensure that the millers supply the rice to the FCI. With that, the dues that the state government owes from the central government will be released. Then there will be no pressure on the boiled rice millers from the government. The fact that they don’t have any rice will not be known at all. This is the real plan. Everyone has hatched this plan to completely deceive the government. They are pulling the wool over the government’s eyes. However, there is another huge twist here. The boiled rice millers collectively owe the government approximately Rs. 12,000 crore. However, some of them have paid their dues. But those who pose as leaders, the big millers, have accumulated huge arrears. These arrears date back to the last year’s Kharif season. These outstanding payments have reached Rs. 12,000 crore. Now, if they are given the Yasangi paddy again, another Rs. 12,000 crore will be added to the arrears. This means that the total arrears for two years will amount to Rs. 24,000 crore. Even if some payments are made, the outstanding amount will still be around Rs. 20,000 crore. In addition to this, these millers still owe approximately Rs. 4,000 crore from previous paddy tenders. They haven’t paid those either. If all the arrears are calculated, the total outstanding amount is likely to be around Rs. 25,000 crore. This is completely sinking the state government. Every year they take the paddy, sell it, and when the government pressures them, they pay a little here and there. But the large sums of arrears are kept pending. If the government responds now and recovers these arrears, it can implement welfare schemes every year without any shortage of funds. It can also announce new schemes and run the administration without incurring debts. Thousands of crores of rupees are stuck with the millers. Yet, shedding crocodile tears, the millers are trying even harder to gain sympathy. Each miller is earning hundreds of crores of rupees. The officials who are supposed to control such millers and recover the arrears from them have become accustomed to bribes. They are pocketing the bribes given by the millers. They are deceiving the government. They are swindling public money. They are completely ruining the government. Even central government officials are supporting such millers. The millers and the officials together are completely defrauding the government. They are accumulating crores of rupees through deception. If the government wakes up now, it can recover the dues from the millers by putting pressure on them. It can prevent the millers’ dues from piling up like a mountain. Action can be taken against the millers who are cheating the government. That’s the matter!!
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.