బీజేపీకి అవకాశమిస్తే స్మార్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం…

బీజేపీకి అవకాశమిస్తే స్మార్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపాలిటీలో బీజేపీ చైర్మన్ పదవి చేపడితే అవినీతి లేకుండా పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని బీజేపీ పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. పరకాల పట్టణంలో వ్యాపార అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిజాం పాలనకు వ్యతిరేకంగా,రెండు స్వాతంత్ర్య పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర గల పరకాల నేడు అభివృద్ధిలో వెనుకబడి ఉందని అన్నారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చి అవినీతికి పాల్పడుతున్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తిగా విఫలమయ్యాయని, మహిళలకు హామీ ఇచ్చిన రూ.2500 కూడా అమలు కాలేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏకగ్రీవంగా గెలిచిన వార్డుల్లో కూడా ఇప్పుడు ఓట్ల కోసం డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ, బీఆర్ఎస్‌కు ప్రజలను ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నారు.బీజేపీ పరకాలలో చైర్మన్ పదవి చేపడితే రూపాయి ఖర్చు లేకుండా ఇంటి నిర్మాణ పర్మిషన్లు ఇస్తామని తెలిపారు.దోమల నివారణతో పాటు పందులు, కోతుల బెడద నివారణకు ప్రతి కౌన్సిలర్ బాధ్యతగా కృషి చేస్తారని చెప్పారు.ప్రతి వార్డులో జనరిక్ మెడికల్ షాప్‌లు ఏర్పాటు చేస్తామని, అవినీతి జరిగితే ఏఐ ద్వారా ఆడిటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన స్మార్ట్ మున్సిపాలిటీ విధానాన్ని పరకాలలో అమలు చేస్తామని పేర్కొంటూ,పట్టణంలోని ఇంటి పన్నులు పెంచబోమని హామీ ఇచ్చారు.ప్రతి వార్డులో చైర్మన్,కౌన్సిలర్ల ఫోన్ నెంబర్లు ప్రదర్శిస్తామని,ప్రతి ఇంటికి అంబులెన్స్ వెళ్లేలా రోడ్ల అభివృద్ధి చేస్తామని తెలిపారు.పరకాలకు మెడికల్ కాలేజీ నిర్మాణం,వ్యాపార రంగ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొంటూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ప్రజలను కోరారు.

గిరి ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి…

గిరి ప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి

డా.సంతోష్ ప్రచారానికి బ్రహ్మరథం

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల బీజేపీ మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణంలోని 21వ వార్డులో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హాజరయ్యారు.డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పరకాల అభివృద్ధి కోసం కృషి చేసే వారికి కాకుండా డబ్బున్న వారికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు టికెట్లు ఇచ్చాయని విమర్శించారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి సంపాదించేందుకే వారు ప్రయత్నిస్తారని,అలాంటి వారికి ఓటు వేయవద్దని ఓటర్లను కోరారు.బీజేపీ అభ్యర్థులు అవినీతి లేకుండా అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
21వ వార్డులో బీజేపీ అభ్యర్థి బండారి గిరి ప్రసాద్ యువ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల కోసం నిలబడ్డాడని అన్నారు. పరకాల పట్టణ వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి యువ నాయకులను గెలిపించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ చేసిన ప్రచారానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మరథం పట్టారు. బీజేపీ పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న నాయకుల కృషిని పార్టీ నేతలు అభినందించారు.ఈ ప్రచారంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వార్డులో దీప్తి,రాకేష్ రావు ల ప్రచారం…

వార్డులో దీప్తి,రాకేష్ రావు ల ప్రచారం

పరకాల,నేటిధాత్రి

 

14వ వార్డ్ లో ప్రతి గల్లీ,గల్లీల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల దీప్తి,రాకేష్ రావు గెలుపే లక్షంగా వార్డ్ లో సుడిగాలి పర్యటనలో భాగంగా ఇంటింటి ప్రచారంలో వార్డ్ ప్రజలు,ఆప్యాయతో ఆశీర్వదించి,మంగళహరతులు పట్టారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జి ఎండీ జాకిర్ అలీ,మాజీ ఎంపీటీసీ పాడి నవతా భగవాన్ రెడ్డి,వార్డ్ అధ్యక్షులు బండి వెంకటేష్, పట్టణ అధికార ప్రతినిధి మాక్స్ ద్ అలీ,మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ బియా బాని,ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి నాగరాజు,మంజూర్ అలీ,ఖలీం,మహిళ నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా ముందుకు…

గెలుపే లక్ష్యంగా ముందుకు

7వ వార్డులో అభ్యర్థి సునిల్ ఎన్నికల ప్రచారం

పరకాల,నేటిధాత్రి

మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం వేయడమే లక్ష్యంగా తన గెలుపుకోసం 7వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పావుశెట్టి సునీల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి చేయి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని,వార్డును అభివృద్ధి బాటలో నడిపే లక్ష్యంతోనే మీ ముందుకు వచ్చానని తెలిపారు.మీరు సహకరించి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version