సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌..

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

 

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాల ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్‌ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.

 తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాల ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. NDDB నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు. మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?

వైసీపీ హయాంలో హిందూ మతంపై దాడులు..

గురువారం.. అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడిన పవన్.. ఐదేళ్లు తామే అధికారులంలో ఉంటామని.. రాజకీయలబ్ధి కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైసీపీ.. భగవంతుడిపై పగబట్టిందని ధ్వజమెత్తారు. అందరం ఏడు కొండలు అంటామని.. వైసీపీ వాళ్లు రెండు కొండలు అంటారని అన్నారు. వైసీపీ హయాంలో హిందూ మతంపై చాలా దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే.. ఇవి పోతే ఇంకొకటి కొందామన్నారని గుర్తుచేశారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివారు చేశారని చెప్పారన్నారు.

మతాల ప్రస్తావన లేదు..

నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘తప్పు చేసి క్షమాపణ అడగకుండా మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నారు. శ్రీవారి విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారు. సిట్‌ రిపోర్ట్‌ ఎక్కడా వైసీపీకి క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు. రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది. భగవంతుడితో పెట్టుకున్నవారు సర్వనాశనం అయిపోతారు తప్ప బతికున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలి. భగవంతుడికి మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టం. హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. కల్తీ లడ్డూ వ్యవహారం ముమ్మాటికీ తెలిసి చేసిన నేరం. 2022లోనే కల్తీ నిర్ధారణ అయిననూ.. అయోధ్యకు అవే కల్తీ లడ్డూలు పంపి మహాపాపానికి ఒడిగట్టారు’ అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.

పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు: టీటీడీ చైర్మన్…

పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు: టీటీడీ చైర్మన్

 

కల్తీ నెయ్యి వ్యవహారంలో గత ప్రభుత్వంపై టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..

తిరుపతి, జనవరి 30: కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు (TTD Chairman BR Naidu) స్పందించారు. కల్తీ నెయ్యి కేసులో సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. గత పాలకమండలిలో అనేక అవకతవకలు జరిగాయని, నిబంధనలు ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ఒకరిద్దరికి లాభం చేకూర్చడం కోసం నిబంధనలు మార్చారని తెలిపారు. సామర్థ్యం లేని డెయిరీకి 60 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్‌ ఇచ్చి.. రూ.250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.
అది మహాపాపం…

చుక్క పాలు లేకుండానే లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రశ్నించారు. ప్రాణాంతకమైన కెమికల్స్‌తో నెయ్యి తయారు చేశారని.. గత పాలకులు చేసింది మహా పాపమని అన్నారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారన్నారు. నెయ్యిలో యానిమల్‌ ఫ్యాట్‌ ఉందని ఎన్‌డీడీబీ (NDDB) నివేదిక ఇచ్చిందని.. సిట్‌ నివేదికలో కూడా ఇదే ఉందన్నారు. గత పాలకమండలి చేసిన ఒత్తిళ్లకు సంబంధించిన ఈ-మెయిళ్లు కూడా సిట్‌ నివేదికలో పెట్టారని తెలిపారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతా పథకం ప్రకారమే..

వైవీ సుబ్బారెడ్డి దంపతులు సీబీఐకి బ్యాంక్‌ ఖాతాలు ఇచ్చేందుకు నిరాకరించారని.. పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్ట దిగజార్చారని టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంటే ఒకరకంగా స్లో పాయిజన్ అని చెప్పారు. కాసుల కోసం కక్కుర్తి పడి భోలే బాబా డెయిరీని ఎంచుకున్నారన్నారు. తనిఖీల్లో భోలేబాబా డెయిరీకి ఒక్క ఆవు కూడా లేదని తేల్చారని తెలిపారు. చినప్పన్న ఎవరు?.. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదా? అని నిలదీశారు. అన్య మతస్తులు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూశారని.. వైసీపీ పెద్దల సహకారం లేకుండా ఇదంతా ఎలా చేస్తారని అడిగారు. హిందూ సమాజానికి జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version