అభివృద్ధి కి పట్టం కట్టండి : మాజీ మేయర్….

అభివృద్ధి కి పట్టం కట్టండి : మాజీ మేయర్, ఎంసీ పల్లి ఎన్నికల ఇంచార్జి తోటకూర అజయ్ యాదవ్

* అద్రాక్ పల్లి లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సంక్షేమ అభివృద్ధి పలాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మేయర్, ఎంసీ పల్లి ఎన్నికల ఇంచార్జి తోటకూర అజయ్ యాదవ్ కోరారు. మూడుచింతల పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అద్రాస్ పల్లి లోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పులి ప్రభాకర్, మేడమైన నాగరాజు ల తరపున గురువారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చూసి కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ నరసింహులు యాదవ్, జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కుతాడి సాయికుమార్, యాదగిరి, గడ్డమిడి విజయ్, మాజీ సర్పంచ్ పత్తి యాదగిరి, నాయకులు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా ముందుకు…

గెలుపే లక్ష్యంగా ముందుకు

7వ వార్డులో అభ్యర్థి సునిల్ ఎన్నికల ప్రచారం

పరకాల,నేటిధాత్రి

మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం వేయడమే లక్ష్యంగా తన గెలుపుకోసం 7వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పావుశెట్టి సునీల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి చేయి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని,వార్డును అభివృద్ధి బాటలో నడిపే లక్ష్యంతోనే మీ ముందుకు వచ్చానని తెలిపారు.మీరు సహకరించి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అద్రాస్ పల్లి లో ఎన్నికల ప్రచారం…

అద్రాస్ పల్లి లో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మూడు చింతలపల్లి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం వేస్తామని. మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు అభ్యర్థి నాగేష్, 23వ వార్డు ప్రభాకర్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్, సంజీవ, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, శ్రీపతి, నర్సింలు, భాస్కర్, సంజీవ, మాజీ కార్పొరేటర్ సాయికుమార్, విజయ్ వెంకటేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version