శ్రీ చైతన్య స్కూల్‌లోగ్రాడ్యుయేషన్ డే వేడుకలు…

శ్రీ చైతన్య స్కూల్‌లోగ్రాడ్యుయేషన్ డే వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

5వ తరగతి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఎంతో ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రత్యేక గ్రాడ్యుయేషన్ గౌన్లు, క్యాప్స్ ధరించి ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, 5వ తరగతి పూర్తి చేసి ఉన్నత తరగతుల వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఇది ఒక మధురమైన మైలురాయి అని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత క్రమశిక్షణతో చదువులో రాణించి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు ప్రదర్శించి అందరినీ అలరించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో భాగంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు, జ్ఞాపికలు అందజేశారు. పిల్లల ఆనందం, తల్లిదండ్రుల గర్వభావం, ఉపాధ్యాయుల ఆశీర్వాదాలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు శంకర్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక..

రాష్ట్రస్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు శంకర్ పల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక

శంకర్ పల్లి, నేటిధాత్రి:

 

హైదరాబాద్‌లోని హయత్ నగర్ మండల పరిషత్ ఆవరణలో రంగారెడ్డి జిల్లా స్థాయి సోషల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో శంకర్ పల్లి మండల మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ చాటింది.
ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వి. నందిని తన అద్భుతమైన ప్రదర్శనతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు వరసింధూర పర్యవేక్షణలో నందిని ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది నందినిని అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు…

సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు

మంచిర్యాల మార్టిన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

యువ విజేతలకు సత్కారం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ హైదరాబాద్ లక్డీకాపూర్ లోని రవీంద్రభారతిలో మంగళవారం ఏర్పాటు చేశారు.సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డులు ఒలంపియాడ్ టాపర్ల విశేషమైన విజయాలను సాధించిన విద్యార్థులకు 20, గోల్డ్,40 స్టేట్,400 డిస్ట్రిక్ట్,20 గురుబ్రహ్మ&చిత్రాలయ యువ విజేతలకు సత్కారం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా గంట శ్రీనివాసరావు ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్,అధ్యక్షులు చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్,ప్రత్యేక అతిధి సినిమా భారతీయ నటుడు శ్రీకాంత్, భారతీయ నటుడు శివాజీ రాజా,లయన్ డాక్టర్ వై.కిరణ్, చైర్మన్-సూచిరిండియా గ్రూప్ కాన్సుల్ జనరల్ -బల్గేరియా రిపబ్లిక్ టి.జి & ఏ.పి , సైకాలజిస్ట్, పాల్గొన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల విద్యార్థులు 1లక్షకు పైగా విద్యార్థిని,విద్యార్థులకు ఏర్పాటు చేసిన టాలెంట్ టెస్టులలో మంచిర్యాల నస్పూర్ మండలంలోని మార్టిన్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు 8 మంది పోటీలో పాల్గొనగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బైరం కాంక్షిత మొదటి స్థానంలో గెలిచారని మిగతా విద్యార్థులు వివిధ స్థానంలో గెలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సబిహ సుల్తానా తెలిపారు.ఈ సందర్భంగా సర్ సి.వి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు సాధించిన విద్యార్థులను పాఠశాల యజమాన్యం అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.అలాగే అన్ని రంగాలలో విద్యార్థులు పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి విజేతలుగా గెలుపొంది తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు.

బిజెపి వార్డ్ మెంబర్ కు సన్మానం..

బిజెపి వార్డ్ మెంబర్ కు సన్మానం

కుక్కముడి రమేష్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బస్వారాజు పల్లి బిజెపి నుండి గెలుపొందిన సందర్భంగా యూత్ శాలువగప్పి శుభాకాంక్షలు తెలియజేశారు రమేష్ మాట్లాడుతూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ఆడపడుచులకు అన్నయ్యలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు నాతోటి మిత్రులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు

ఘనంగా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం…..

ఘనంగా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం (మాచునూర్)లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో సోమవారం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహిం చారు. ప్రధానోపాధ్యాయురాలు మహేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటున్న విద్యార్థుల ఉన్నత విద్య లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాటు ఉపా ధ్యాయులు హరిప్రకాష్ శుక్ల వసంత్, రిషబ్, చతుర్వేది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version