బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి…

బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

* అద్రాస్ పల్లి లో గడపగడప ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

 

నీళ్లు రావాలన్న నిధులు కావాలన్నా కేవలం టిఆర్ఎస్ తోటే సాధ్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ని అద్రాస్ పల్లి లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అజయ్ కుమార్, నాగరాజు ల తరఫున గడప గడప ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలను కష్టాలపాలు చేస్తున్న కాంగ్రెస్ కు అవకాశం కల్పించొద్దన్నారు. ప్రజల కష్టాలు తెలిసి కన్నీళ్లు తీర్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని నేడు కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో 60 ఏండ్లు వెనకకు ప్పోయమన్నారు. మరిచిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటు వేయొద్దన్నారు. గడప గడప ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆది అజయ్, నాగరాజు లకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించలని కోరారు. ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, యువనాయకులు డాక్టర్ భద్ర రెడ్డి, నాయకులు ఆది రమేష్, నర్సింలు, వెంకటేష్, చిరంజీవి, మల్లేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజల కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ ..

ప్రజల కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

* అలియాబాద్ లో రోడ్ షో

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పేదల కష్టాలు తెలిసిన నేత కెసిఆర్, కష్టాలు తీర్చిన పార్టీ బిఆర్ఎస్ అని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ని అలియాబాద్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తంటం నర్సింహా, బండి లక్ష్మీ రాంరెడ్డి, తూమ్ యమున శ్యామ్, మధుసూదనరెడ్ది, సగ్గు శ్రీనివాస్ యాదవ్, గుర్క కుమార్ యాదవ్ లకు ఓటు వేసి గెలిపించలని కోరారు.

పని చేసే వారిని గెలిపించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి…

పని చేసే వారిని గెలిపించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

* అలియాబాద్ 7వ వార్డులో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

 

ప్రజల కోసం పనిచేసే పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని 7వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తంటం నర్సింహా తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎల్లుబాయి, మాజీ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు నర్సింగరావు, కుమార్, సంజీవరెడ్డి, వెంకటరెడ్డి బాబు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

మునిసిపల్ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లాలో బిఆర్ఎస్ జోరు

మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జోరు

* రోడ్డు షోల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి

* బిఆర్ఎస్ లో పలువురికి చేరిక

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు దూసుకు పోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండ మాదారం, శ్రీరంగవరం, నూతనకల్ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున భారీ ఎత్తున్న రోడ్ షో లు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని కోరారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం తో ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండాను ఎగరావేయాలన్నారు. ఈ కార్యక్రమలలో మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, అభ్యర్థులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల చేరికలు..

మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లం వెంకటేష్, ఎల్లం దేవి రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 30 మంది, కొల్తురు కు చెందిన మహేష్ లకు బిఆర్ఎస్ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆది అజయ్, నాగరాజు గార్లకు ఓటు వేసి గెలిపించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, బిఆర్ఎస్ పార్టీ యువనాయకులు డా భద్ర రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వెంకటేష్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రమేష్, చిరంజీవి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలియాబాద్ వార్డు నెంబర్–17కు చెందిన బీజేపీ నాయకుడు తాడేం కుమార్ బిఆర్ఎస్ లో చేరగా అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్‌గిరి శాసనసభ్యులు, అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముద్దం మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అనిత లాలయ్య, వంగ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

మేడ్చల్‌లో 20 కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్‌లో చేరిక

బిఆర్ఎస్లో 20 మంది కాంగ్రెస్ నేతల చేరిక

కండువా కప్పి ఆహ్వానించి ఎంఎల్ఏ మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మూడు మున్సిపాలిటీ లపై బిఆర్ఎస్జెండా ఎగరావేస్తామని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి లక్ష్మి, బండి రామ్ రెడ్డి, బండి శ్రీకర్ రెడ్డి లతో పాటు 20మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ లో చేరగా గులాబీ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం అలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
రోడ్ షో లో పాల్గోని బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని కోరారు.

యువత అన్ని రంగాల్లో రానించాలి : మాజీ మంత్రివర్యులు…

యువత అన్ని రంగాల్లో రానించాలి : మాజీ మంత్రివర్యులు
మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి
* మున్సిపాలిటీలో ముగిసిన సీఎంఆర్ క్రికెట్ ట్రోఫీ లు
* బహుమతుల ప్రధానోత్సవం

మేడ్చల్  ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువతను ప్రోత్సహించినప్పుడే అన్ని రంగాల్లో రాణించ గలుగుతారని మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ సిర్వి క్రికెట్ గ్రౌండ్ లో సంక్రాతి పండగా సందర్బంగా సీఎంఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అలియాబాద్, ముడుచింతలపల్లి మున్సిపాలిటీల క్రికెట్ పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే.

 

ఆదివారం ఫైనల్ మ్యాచ్ లను తిలకించి ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో విన్నర్ టీం లింగాపూర్ తండా క్రీడాకారులకు రూ.25వేలు, రన్నర్ టీం ఆనంతరంకు రూ.15వేలు నగదు బహుమతి ట్రోఫీలు, అలియాబాద్ మున్సిపాలిటీ విన్నర్ టీం లాల్ గడి మలక్పేట్ కు రూ. 25వేలు, రన్నర్ టీం అలియాబాద్ కు రూ.15వేలు నగదు బహుమతి ట్రోఫీ మాన్ ఆఫ్ సిరీస్, మాన్ అఫ్ మ్యాచ్ ట్రోపి లను అందజేయడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మహిళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు, సిఎంఆర్ క్రికెట్ పోటీలు అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ భద్రారెడ్డి, మున్సిపాలిటీల అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ వార్డు నెంబర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి…

ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి
* మునిసిపల్ బిఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

మునిసిపల్ ఎన్నికలో గెలుపే లక్ష్యం ఒక్కో వార్డు నా బాధ్యతని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మునిసిపల్ ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ మునిసిపల్ అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో సోమవారం అలియాబాద్, మూడుచింతలపల్లి మునిసిపల్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కాంగ్రెస్ రెండు ఏండ్లు పాలన గడిచిన అంతా ఆగమే ఉందన్నారు. ఆగమైన ఆరు గ్యారంటీకాని ప్రజల్లో ప్రశ్నించి చైతన్యపరచలన్నారు.

ఓటర్లను అక్కర్శించే పనులతో ప్రజల్లోకి వెళ్ళాలని, 13న ఊర్లలో ముగ్గుల పోటీలు, 16న క్రికెట్ మ్యాచ్ లు చేపట్టాలనసూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, ఏఎంసి వైస్ చైర్మన్ లు నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పల్లె సితారములు గౌడ్, ఎల్లుభాయి, మాజీ జడ్పీటీసీ అనిత, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కార్మికుల ప్రధాన సమస్యలపై గని మేనేజర్..

కార్మికుల ప్రధాన సమస్యలపై గని మేనేజర్ కి ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మెమోరాండం అందజేత

మంచిర్యాల,నేటి ధాత్రి:

సింగరేణిలో నెలకొన్న ప్రధాన సమస్యలైనా సొంతింటి కలను నెరవేర్చాలని,ఆదాయపు పన్నును మాఫీచేయాలని,మెడికల్ అటెండెన్స్ నియమాలను మార్చాలని కోరుతూ గురువారం ఐఎన్టియుసి నాయకులు గని మేనేజర్ కు మల్లారెడ్డి అధ్యక్షతన మెమోరాండం అందజేశారు. అనంతరం కేంద్ర కమిటీ నాయకులు గరిగే స్వామి మాట్లాడుతూ…నూతన బదిలీ విధానం,నూతన గనులు, తదితర కార్మికుల ప్రధాన సమస్యలను సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు.గని యాజమాన్యం అవసర నిమిత్తం తీసుకుని పనిచేస్తున్న జనరల్ అసిస్టెంట్ డ్రెస్ కోడ్ ధరించాలని,వారు అధికారులు లాగా కార్మికులతో వ్యవహరిస్తున్నారని,మాన్ వే వద్ద ఇన్,అవుట్ కు రావట్లేదని,ఫోన్ ద్వారానే వారికి ఇన్,అవుట్ వేయడం జరుగుతుందన్నారు.వీరికి యాజమాన్యాన్ని సర్కులర్ రిలీజ్ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే 5 ఫిట్ సెక్రటరీ నంబయ్య,అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు రవి,రాజేందర్, ఏరియా నాయకులు మహేందర్ రెడ్డి,పెద్ది రాజు,చందు,రామకృష్ణ,గని. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version