నర్సింగపురం గ్రామానికి రేషన్ షాపు కేటాయించాలి..

నర్సింగపురం గ్రామానికి రేషన్ షాపు కేటాయించాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సింగాపురం గ్రామానికి రేషన్ షాప్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ
నర్సంపేట మండలం ఇటకాలపల్లి గ్రామంలోని రేషన్ షాపు ముందు నిరసన వ్యక్తం చేశారు. రేషన్ సరుకుల కోసం రెండు కిలోమీటర్ల దూరంలో గల ఇటకాలపల్లి రేషన్ షాప్ లో బియ్యం తీసుకోవడం జరుగుతుందన్నారు.వృద్ధులు, ఒంటరి మహిళలు ఉండడంతో బియ్యం మోసుకొని రావడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మా గ్రామంలో 196 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా గ్రామస్తుల ఇబ్బందులకు గుర్తించి గుర్తించి రేషన్ షాప్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఇటుకాలపల్లి గ్రామపంచాయతీ 9,10వ వార్డు మెంబర్లు ఈర్ల అనిల్ కుమార్, లింగదారి శంకర్,మాజీ ఉపసర్పంచ్ మాలగాని రాజు గ్రామ పెద్దలు గొర్రె మొగిలి ,నూకల మరి సంపత్, మహేంద్ర చారి, భూసాని జితేందర్ ,బాలాజీ లావుడియా ,మొగిలి ,మహిళలు గొర్రె చంద్రకళ, మాలగాని ఉమా, గొర్రె మణెమ్మ ,భర్తీపాక రాజక్క ,అజ్మీర్ లలిత ,భూసాని విజయ ,గొర్రె రాణి, గొర్రె సుమలత ,భూసాని విజయ, వాంకుదత్ శ్యామల ,నూకల మరి అమరావతి, పి. సుగుణ గ్రామస్తులు ,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version