ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..

ఖర్గే, నడ్డా మధ్య వాగ్వాదం.. రాజ్యసభలో హోరాహోరీ..

 

 

ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానంపై రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాల్సిన ప్రసంగం ఆగిపోయిన సంగతి తెలిసిందే.

 

ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య పార్లమెంటరీ విధానంపై రాజ్యసభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేయాల్సిన ప్రసంగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. గురువారం రాజ్యసభలో కూడా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పార్లమెంటులో జాతీయ ప్రయోజన అంశాల గురించి మాట్లాడటంపై ఆంక్షలు విధిస్తున్నారని ఖర్గే ఆరోపించడంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు (Kharge Nadda argument).
‘పార్లమెంట్ అంటే లోక్ సభ, రాజ్యసభ రెండూ ఉంటాయి. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రయోజనాల గురించి మాట్లాడాలనుకున్నారు. కానీ అలా చేయడానికి ప్రభుత్వం అనుమతించలేదు. మీరు సభను ఇలా ఎలా నడపగలరు’ అని ఖర్గే ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జేపీ నడ్డా స్పందిస్తూ.. ‘లోక్‌సభ కార్యకలాపాలను రాజ్యసభలో చర్చించలేము. నా గౌరవనీయ సహోద్యోగి ఈ విషయాన్ని తెలుసుకోవాలి’ అని సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేనిపైనా చర్చ నిర్వహించడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నడ్డా అన్నారు (Rajya Sabha disruption).

‘లోక్‌సభలో ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి ప్రధాని మోదీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు (Parliament chaos India). కానీ ప్రతిపక్షం సభా కార్యకలాపాలను ముందుకు సాగనివ్వడం లేదు. ప్రతిపక్షాలు అడిగినట్లుగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై ఒక ప్రకటన చేశార’ని జేపీ నడ్డా గుర్తు చేశారు. తీవ్ర వాగ్వాదం తర్వాత, ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.a

3 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

3 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

అసోం రాజధాని గౌహతి పంజాబరిలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో బానిసలా మగ్గుతున్న 13 ఏళ్ల బాలికను జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు రక్షించారు. బాలికను అత్యంత అమానవీయంగా మంచం లోపల ఉన్న ర్యాక్‌లో దాచిపెట్టారు.

 

ఇంటర్నెట్ డెస్క్: అసోం రాష్ట్రం గౌహతీ పంజాబరిలో ఓ కుటుంబం చిన్నారిని చిత్రహింసలకు గురి చేసింది. పనిలో పెట్టుకుని ఏడేళ్లుగా నరకం చూపించింది. ఈ విషయం గురించి తెలుసుకున్న జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. అధికారులు ఇంటిని సోదా చేస్తున్న సమయంలో ఎక్కడా బాలిక కనిపించలేదు. అయితే, యజమానుల ప్రవర్తనపై అనుమానం వచ్చి బెడ్ కాట్(మంచం)ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంచం లోపల ఒక ఇరుకైన ర్యాక్‌లో బాలికను కుక్కి దాచినట్లు గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా..

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా

 

vదీంతో సభాకార్యక్రమాల ప్రకారం మోదీ చేయాల్సిన ప్రసంగం కూడా రేపటికి వాయిదా పడింది.

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్‌‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే మోదీ ప్రసంగానికి ముందే సభను స్వీకర్ గురువారానికి వాయిదా వేశారు.
మూడుసార్లు వాయిదా

బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో సభ బుధవారంనాడు మూడు సార్లు వాయిదా పడింది. తొలుత సభ ప్రారంభ కాగానే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యలు పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితుల మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకూ లోక్‌సభ వాయిదా పడింది. దీంతో విపక్ష సభ్యులు పార్లమెంటు మెట్ల వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే మళ్లీ గందరగోళం తలెత్తింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభలో సమాధానం ఇస్తానని కేంద్ర మంత్రి పీయూష్ గెయల్ చెప్పడంతో సభ రెండోసారి వాయిదా పడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభం కాగానే పీయూష్ గోయల్ మాట్లాడుతుండగా.. 8 మంది ఎంపీలను సమావేశాల నుంచి బహిష్కరించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు వ్యతిరేకంగా విపక్ష సభ్యలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సాయంత్రం 5 గంటలకు సభ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమై మోదీ ప్రసంగించాల్సి ఉండగా దీనికి ముందే స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version