ఆదరిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుట…

ఆదరిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుట

గూడెల్లి సదన్ కుమార్ 11వ వార్డు అభ్యర్థి

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపల్ ఎన్నికల సందడిలో భాగంగా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పరకాల మున్సిపాలిటీ 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గూడెల్లి సదన్ కుమార్ ఇంటింట ప్రచారం గురువారం రోజున నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆ దేవుడి దీవెనలు,తన వార్డులోని ప్రజల ఆశిస్సులు తనపై ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ తోనే పట్టణం వార్డు అభివృద్ధి చెందుతాయని తమ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై ఓటువేసి ఆదరించి గెలిపించాలని గెలిపిస్తే వార్డు సమస్యలు తీర్చే దిశలో ముందుంటానని మీ కష్ట సుఖాలలో తోడుంటానని హామీఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్న జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

◆:- తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా,హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి వారితో పాటు పుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహిం, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి,కూన.శ్రీశైలం గౌడ్,ఆవుల రాజిరెడ్డి మరియు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version