నల్లబెల్లి మండలంలో బిఆర్ఎస్ హవా…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-15T125709.956.wav?_=1

 

నల్లబెల్లి మండలంలో బిఆర్ఎస్ హవా.

#16 సీట్లతో బీఆర్ఎస్ అగ్రస్థానం.

#12 సీట్లతో సరిపెట్టుకున్న అధికార పార్టీ..

#మాజీ ఎమ్మెల్యే పెద్ది గ్రామంలో ఘనవిజయం సాధించిన నాగవెల్లి జ్యోతి ప్రకాష్.

#సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

#ఒక సర్పంచ్ తో బోణి కొట్టిన బిజెపి.

నల్లబెల్లి, నేటి ధాత్రి

 

వరంగల్ జిల్లా నల్లబెల్లి: మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి పార్టీ హవ చూపించుకున్నది .29 సర్పంచ్ స్థానాలకు గాను12 గ్రామపంచాయతీలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకున్నది. కాగా భాజపా ఒక సర్పంచ్ సీటుతో బోణి కొట్టగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 16 స్థానాలో గెలుపొంది అగ్రస్థానంలో చేరుకున్నది . ఈ నేపథ్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగవల్లి జ్యోతి ప్రకాష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.గ్రామాలలో సుపరి పరిపాలన అందించే సర్పంచులు వీరే.
1, నల్లబెల్లి, నాగవెల్లి జ్యోతి బీఆర్ ఎస్.
2, ఆసరవెల్లి, కెలోతు రాజ్ కుమార్. బీఆర్ఎస్.
3, మేడపల్లి. అర్రె0 సాంబయ్య. బీఆర్ఎస్.
4, గొల్లపల్లి. బాదావత్ మంజుల. బీఆర్ఎస్.
5, అరువయపల్లి. మాలోతు రామ్ లాల్. బీఆర్ఎస్.
6, రాంపూర్. పురం భాస్కర్. బీఆర్ఎస్.
7, దస్తగిరి పల్లె. పులి రమేష్ గౌడ్. బీఆర్ఎస్.
8, శనిగరం. ఊట్కూరి అశోక్ గౌడ్. బీఆర్ఎస్.
9, గోవిందపూర్. పాడియా రజిత. బీఆర్ఎస్.
10, మూడు చెక్కలపల్లి. సపా వట్ కవిత. బీఆర్ఎస్.
11, కన్నారావుపేట. పల్నాటి మూర్తి. బీఆర్ఎస్.
12 ముచ్చింపుల తండ. మచ్చిక రవీందర్ గౌడ్. బీఆర్ఎస్.
13, బజ్జు తండా. జాటోతు రవి చిన్న. బీఆర్ఎస్.
14, లెంకలపల్లి. కస్తూరి రవీందర్. బీఆర్ఎస్.
15, రుద్రగూడెం. మంద సుజాత. బీఆర్ఎస్.
16, నారక్క పేట. దండేమ్ సంపత్. బీఆర్ఎస్.
17, రంగాపురం. ఓరుగంటి మాధురి. బిజెపి.
18, కొండాపూర్. అబ్బర బోయిన లలిత. కాంగ్రెస్.
19, నాగరాజు పల్లి. ఎరుకల రజిత. కాంగ్రెస్.
20, నందిగామ. భూక్య భాస్కర్. కాంగ్రెస్.
21, కొండాయిల్ పల్లి. ఎరుకల స్వప్న. కాంగ్రెస్.
22, రామతీర్థం. పొదిల వసంత. కాంగ్రెస్.
23, ధర్మరావుపల్లి. ముస్కే పోషాలు. కాంగ్రెస్.
24, గుండ్ల పహాడ్. కర్దూరి అనిత. కాంగ్రెస్.
25, మామిండ్ల వీరయ్య పల్లి. ఏడాకుల సరోజన. కాంగ్రెస్.
26, రేలకుంట. వాంకుడోత్ హేమలత. కాంగ్రెస్.
27, ముచ్చింపుల. ఇస్తారి శేఖర్ గౌడ్. కాంగ్రెస్.
28, అర్షణ పల్లి. సిద్ధ సంతోష్. కాంగ్రెస్.
29, బుచ్చిరెడ్డి పల్లె. భూక్య భద్రమ్మ. కాంగ్రెస్.
సర్పంచులుగా విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత మండలంలో బిఆర్ఎస్ అత్యధిక సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యులను గెలుచుకొని గులాబీ జెండా ఎగరవేశారు.

వరంగల్ జిల్లాలో 88.11శాతం ఓటింగ్ నమోదు..

వరంగల్ జిల్లాలో 88.11శాతం ఓటింగ్ నమోదు

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికలు దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం,గీసుకొండ మండలాల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.11శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
దుగ్గొండి మండలం 89.88 శాతం అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా గీసుకొండ మండలం 85.83 శాతం ఓట్లతో జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ అయ్యింది.సంగెం మండలంలో 89.44 శాతం ఓట్లు పోలింగ్ కాగా నల్లబెల్లి మండలంలో 86.36 శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

 

ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా పరిధిలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జిల్లాలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దుగ్గొండి, నల్లబెల్లి,సంగెం,గీసుకొండ మండలాల పరిదిలో 66467 పురుషులు,69722 మహిళలు ఇతరులు ఇద్దరు కాగా మొత్తం 136191ఓటర్లు ఉండగా అందులో
58688 మంది పురుషులు 61311 మహిళలు ఇతరులు ఇద్దరు మొత్తం 120001మంది ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

పోలింగ్ కేంద్రాల జనరల్ అబ్జార్వర్ పరిశీలన..

పోలింగ్ కేంద్రాల జనరల్ అబ్జార్వర్ పరిశీలన

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి:

 

రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల పరిశీలకులు బాల మాయాదేవి వరంగల్ జిల్లాలోని సంగెం,గీసుగొండ, దుగ్గొండి,నల్లబెల్లి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా గీసుగొండ, సంగెం, నందిగామ, దేశాయిపల్లె, నల్లబెల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు

చేశారు.నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు వారివెంట ఉన్నారు.

ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన..

ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి పోలింగ్ సరళి పరిశీలన

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నిర్వహణలో భాగంగా గురువారం సాధారణ ఎన్నికల అబ్సర్వర్ బాల మాయాదేవి వర్ధన్నపేట మండలంలోని కట్రియాల, ఉప్పరపల్లి, నల్లబెల్లి గ్రామాలు, పర్వతగిరి మండలంలోని వడ్లకొండ, పర్వతగిరి కళ్ళెడం, అన్నారం షరీఫ్ గ్రామాలు, రాయపర్తి మండలంలోని రామన్నగూడెం, మైలారం, కొండూర్, తిరుమలయపల్లి, రాయపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని పరిశీలించారు.ఆయా కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హరిత పోలింగ్ బూతులను సందర్శించి పర్యావరణాన్ని పరిరక్షించుటలో భాగంగా హరిత పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడంపట్ల అబ్సర్వర్ అభినందించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, పర్యావరణ హిత చర్యలు, ఓటర్లకు అందుబాటులో ఉంచిన సౌకర్యాలు వంటి అంశాలను సమీక్షించి, పోలింగ్ శాంతియుతంగా మరియు సజావుగా సాగేందుకు అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందజేశారు.
అబ్సర్వర్ వెంట జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.

ఐనవోలు ఎన్నికల్లో టికెట్ ఉద్రిక్తతలు

ఐనవోలు మండలంలో ఎన్నికల సందడి:
కేడర్ కష్టం వర్సెస్ నాయకుల ఆరాటం
“ఈసారి టికెట్లు కష్టపడ్డ కేడర్‌కా…?
లేక ఖద్దరు చొక్కాలిచ్చే నోట్ల కట్టలకా…?”
నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే
“ఆగమవుతున్నము పట్టించుకోండి” అసంతృప్తి లో కష్టపడ్డ క్యాడర్
మెజారిటీ సర్పంచ్ స్థానాలు జనరల్ కేటగిరివే!!
17 గ్రామాల రాజకీయ సమీకరణలపై విశ్లేషణ

నేటిధాత్రి ఐనవోలు :-

 

ఐనవోలు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పతాక వేళ మొదలైంది. హనుమకొండ రెవెన్యూ డివిజన్‌లో భాగంగా 2016లో ఐనవోలు మండలంగా ఏర్పడినప్పటి నుండి ,ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామ పంచాయతీలు ఉండటం ఈసారి ఎన్నికల రేసులో మెజారిటీ స్థానాలు జనరల్ కేటగిరీ కింద ఉండటంతో రాజకీయ నేతల దృష్టిలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. ప్రజలతో కంటే పైస్థాయి అనుచరులతోనే టికెట్ పంపకాలపై చర్చలు ఎక్కువగా సాగుతుండటం, జేబులు బరువైన వాళ్లే ముందంజలో కనిపించడం స్థానిక రాజకీయ విన్యాసాలపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

నాయకుల లక్ష్యం – ఆధిపత్యాన్ని నిలుపుకోవడమేనా??

ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే–ఎంపీ–జిల్లా నాయకుల దృష్టి మొత్తం పంచాయతీ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని స్థిరపరచడంపైనే నిలిచింది. అనుచరులకు అవకాశాలు ఇవ్వాలనే హామీలు వెలుపల వినిపిస్తున్నా, నిజమైన కష్టపడ్డ కేడర్‌కి మాత్రం పట్టింపులు తగ్గుతున్నాయన్న ఆవేదన పార్టీ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది.

గ్రామాల్లో పార్టీ జెండా మోసి తిరిగిన వాళ్ల కంటే, చివరి నిమిషంలో వచ్చిన “ప్రత్యేక అనుచరులు” లేదా వ్యాపార ప్రయోజనాల కోసం రాజకీయం వైపు చూడని వ్యక్తులకు ఇదివరకే అధికారం అనుభవించిన వారికీ టికెట్లు చుట్టబెడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

“ఆగమవుతున్నాం పట్టించుకోండి” పా(త)ర్టీల క్యాడర్లో అసంతృప్తి

గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికల దాకా పార్టీ కార్యకర్తలు భుజాన పడ్డ పని, తట్టుకున్న ఒత్తిడి, గ్రామాల్లో ఎదుర్కొన్న ప్రతికూలతలన్నింటినీ మరచినట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారని కేడర్ ఆరోపిస్తోంది.
“మా చెమట పిండుకొని వచ్చిన అధికార, మద్దతు మీ పాదాలకా? లేక నోట్ల కట్టలకా?” అనే ప్రశ్న గ్రామాల నుంచి నేరుగా నాయకుల కుర్చీల దాకా చేరుతోంది.

టికెట్లు చెమట చుక్కల కష్టానికా? ఖద్దరు చొక్కాలు ఇచ్చే నోట్ల కట్టలకా…?

టికెట్ పంపకాల్లో పారదర్శకత లేకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశం.సంస్థాగత కృషి, పునాది స్థాయి పని, గ్రామ అభివృద్ధి పట్ల నిజమైన కట్టుబాటు లేనట్టి కొత్త నాయకులు లేదా గతంలో అధికారాన్ని అనుభవించి సంపాదన కూడబెట్టుకున్న వాళ్ళకి కేవలం వారి అంగ ఆర్థిక బలాన్ని చూపి పార్టీలు టికెట్ ఇచ్చేలా నాయకులు ప్రజా ప్రతినిధులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నిజాయితీగా పార్టీ కోసం పనిచేయడం అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ సిద్ధాంతాలను జండాలను వదిలిపెట్టకుండా నిలకడగా నిలిచిన వారిని విస్మరించడం అంటే పార్టీలకే దీర్ఘకాలిక నష్టమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

సామాజిక సమీకరణలు – జనరల్ కేటగిరీ స్థానాల ప్రభావం

17 గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలైన ఐనవోలు నందనం కొండపర్తి ముల్కలా గూడెం నర్సింహుల గూడెం ఉడుత గూడెం రెడ్డిపాలెం పంతిని తదితర గ్రామాల్లో జనరల్, జనరల్ మహిళా స్థానాలు కావడం వలన కుల, వర్గ సమీకరణలు కాస్త విభిన్నంగా కదులుతున్నాయి.కొన్ని గ్రామాల్లో వ్యక్తిగత ప్రాభవం మరికొన్ని గ్రామాల్లో ఆర్థిక బలం,ఇంకొన్ని ప్రాంతాల్లో పెద్దలు– మధ్యవర్తుల ప్రభావంఅభ్యర్థుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి.

రాబోయే రోజులు కీలకం

అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే సరికి పెద్దఎత్తున అసంతృప్తి, తిరుగుబాట్లు, మౌన వ్యతిరేకత కనిపించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజులు ఐనవోలు రాజకీయ దిశను మార్చే అవకాశం ఉన్నందున అందరి చూపూ ఇప్పుడు నాయకుల నిర్ణయాలపైనే నిలిచింది.

ఉప్పరపెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T134033.941.wav?_=2

 

ఉప్పరపెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…,ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య&

▪️రైతును రాజుగా చూడడం-వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

▪️సీఎం రేవంత్ రెడ్డి రైతుబిడ్డగా రైతుల పక్షపాతి

▪️రైతులెవ్వరు అధైర్య పడవద్దు రైతు పండించిన ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది

▪️రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

రైతులెవ్వరు దళారుల చేతిలో మోసపోవద్దు- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

▪️రాష్ట్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరతో పాటు 500/- బోనస్ ఇస్తుంది.

వర్దన్నపేట (నేటిధాత్రి):

 

ఏఎంసీ చైర్మన్ నరుకుడు, వెంకటయ్య,కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్.ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన కాంటాలు అయ్యేలా చూస్తాం.వరంగల్ జిల్లా,వర్ధన్నపేట మండలం లో ను,ఉప్పరపెల్లి గ్రామంలో పి. ఎ. సి.ఎస్ వడ్లు కేంద్రం ను,ప్రారంభించిన వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ ,,ఈ కార్యక్రమములో డైరెక్టర్ మహేందర్ రావు, ఓ బి సి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దామెర ప్రశాంత్, పోతాం మధుకర్,రాచమల్ల రాంమూర్తి,సినపెల్లి ఎల్లయ్య,షాగంటి యాకయ్య, తదితరులు పాల్గొన్నారు…

పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి..

పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత విప్లవోద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ సందర్భంగా కామ్రేడ్ సిపి రెడ్డి రాసిన ఏరిన రచనలు అనే
పుస్తకావిష్కరణ సభను జయప్రదం చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ నందు పోస్టర్ ఆవిష్కరణ చేశారు.రాజేందర్ మాట్లాడుతూ
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవోద్యమంలో చేసిన కృషి గొప్పదని,దేశ చరిత్రలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయటంలో చెరగని ముద్రవేశారని అన్నారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఐఎఫ్టియు నర్సంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్,గొర్రె ప్రదీప్, ఐఎఫ్టియు డివిజన్ నాయకులు అశోక్,పివైఎల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి,ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భోగి సారంగపాణి, నాయకులు కొంపెల్లి సాంబన్న,భద్రాజి, తదితరులు పాల్గొన్నారు.

వయోవృద్ధులను గౌరవించే భాధ్యత అందరిది..

వయోవృద్ధులను గౌరవించే భాధ్యత అందరిది
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ తూర్పు,నేటిధాత్రి:

 

వయోవృద్ధులను గౌరవిద్దాం – వారి అనుభవాల్ని స్వీకరిద్దామని అది మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకతాన్ (ర్యాలీ) నిర్వహించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండాఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈనెల 12 నుండి 19వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రాచీన కాలం నుండి భారత దేశ సంస్కృతిలో వయోవృద్ధులను గౌరవించడం మన సంస్కృతి అని,వారిపట్ల ప్రతి ఒక్కరూ మర్యాదగా ఉండేవారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో కూడా అలాగే వయోవృద్ధులను గౌరవించి వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు.సమాజంలో వయోవృద్ధుల ప్రాముఖ్యత చాలా గొప్పదని, వారే దిశా నిర్దేశకులని చెప్పారు.అలాగే ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి మన కుటుంబంలో ఉన్న వయోవృద్ధులను అనగా గ్రాండ్ పేరెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారితో మర్యాదగా ఉండాలని, వారి అనుభవం పిల్లలకు చాలా స్ఫూర్తినిస్తుందని అన్నారు.ప్రస్తుతము వయోవృద్ధుల సమస్యలు మరియు పిల్లలు కొడుకులు కోడళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదని, వారిని ఇబ్బందులకు గురి చేస్తూ కొట్టడం తిట్టడం ఆస్తులు లాక్కోవడం ఇలాంటి సమస్యలు మా దృష్టికి చాలా వస్తున్నాయని,వారి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ చట్టం ప్రకారం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి.రాజమణి మాట్లాడుతూ, వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూన్నామని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొడుకులు కోడళ్ళు, కూతుళ్లకి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారి బాధ్యతల్ని గుర్తింప చేస్తున్నామని తెలిపారు. అలాగే జిల్లా మొత్తంగా వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టము మరియు టోల్ ఫ్రీ నెంబర్ 14567 గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి బి రాజమణి, డిఎంహెచ్ఓ సాంబశివరావు,డీఈవో రంగయ్య నాయుడు, సి డి పి ఓ లు విద్య మధురిమ,దెబోరా సూపర్వైజర్లు, డిసిపిఓ ఉమా ,సఖి అడ్మిన్ శ్రీలత,జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది,ఎఫ్ఆర్ఓ ,జిల్లా వయోవృద్ధుల కమిటీ మెంబర్స్ మల్లారెడ్డి,రాజేంద్రప్రసాద్,ప్రిన్సిపల్ వీర ఉపేందర్,టీచర్స్, సిబ్బంది 150 మంది విద్యార్థులు, జిల్లాలోని పలు ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు, వయోవృద్ధుల అసోసియేషన్ మెంబర్స్, వయోవృద్ధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం…

సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన మచ్చిక సునిల్ కుమార్ గౌడ్ గత నెల 26 న గుండెపోటుతో మరణించారు.తను పని చేసిన సిద్దార్థ డిగ్రీ కళాశాలకు చెందిన తోటి అధ్యాపకులు మేరుగు శ్రీధర్ గౌడ్,ఏ.ఓ పరమేష్ ఆధ్వర్యంలో ,10 వ తరగతి స్నేహితులు కలిసి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంగళవారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌడ జన పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మచ్చిక రాజు గౌడ్,గుంటి అశోక్,ప్రభాకర్ రెడ్డి, కోమాండ్ల రఘు, బండారి శ్రీనివాస్, సహాదేవ్, దండెం రవీందర్, రాజు కుమార్,వాళ్ళల రమేష్, అనిల్,మచ్చిక లక్ష్మణ్ గౌడ్, సమ్మయ్య గౌడ్, ఊడ్గుల సాంబయ్య గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్,గాదెగోని లింగయ్య గౌడ్, ఆనంద్ గౌడ్, గండు రమేష్ గౌడ్, సుదీర్ గౌడ్, రవితేజ గౌడ్,సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల వలయంలో నర్సంపేట పట్టణం

సమస్యల వలయంలో నర్సంపేట పట్టణం

పారిశుద్ధ్య పనులను తక్షణమే చేపట్టాలి

మున్సిపాలిటిలో ఎం సిపిఐ(యు) వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సమస్యల వలయంలో చిక్కుకున్నది.పట్టణ పరిష్కారం కోసం ఎం సిపిఐ(యు) ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు వంగల రాగ సుధా,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని,కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తీయకపోవడం మూలంగా వర్షపునీరు పొంగి ఇళ్లలోకి చేరుతుందని ఆరోపించారు.ప్రధానంగా కార్ల్ మార్క్స్ కాలనీ,జ్యోతిబసు నగర్ లలో డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షం పడిందంటే వరద నీరు ఇళ్లలోకిచేరి చెత్తాచెదారంతో దుర్వాసనతో అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు.మార్క్స్ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడంతో మరదమయంగా మారుతుందని తెలిపారు.పట్టణంలో కుక్కల కోతుల,బెడదల మూలంగా పట్టణవాసులు బయటికి రావాలంటేనే జంకుతున్నారని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ చెన్నారావుపేట మండల కన్వీనర్ జన్ను రమేష్ ,టౌన్ కమిటీ సభ్యులు కల్లెపెల్లి రాకేష్ ,విద్యార్థి నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

నవోదయ సీటు సాధించిన మోరే నవతేజ్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-04T123700.592.wav?_=3

నవోదయ సీటు సాధించిన మోరే నవతేజ్ రెడ్డి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

మొగులపల్లి మండలంలో పర్లపెల్లి ఎస్వి విద్యాలయం చదువుతున్న మోరే నవతేజ్ ఎనిమిదో తరగతిలో నవోదయ సీట్లు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ మోరే రవీందర్ రెడ్డి డైరెక్టర్ గుండారపు రాజు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ ఈ సంవత్సరం గురుకుల విద్యాలయాలలో 38 మంది విద్యార్థులకు గాను 38 మందికి అదేవిధంగా ఈ సంవత్సరం నవోదయలో వాడేజే మనస్విని ఏడవ తరగతిలో 8వ తరగతిలో గొర్రె నాగ తన్వితకు నవోదయ సీటు సాధించడం పాఠశాల2002 స్థాపించినప్పటి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే గురుకులాలో నవోదయలో అత్యధిక సీట్లు సాధించిన ఏకైక విద్యాసంస్థ అని పాఠశాలలో చదివినటువంటి అనేక మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించడం గర్వకారణం అని అన్నారు పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పోషక మహాశయులు శ్రేయోభిలాషులకు మిత్రులకు మరియు పాఠశాల ఉపాధ్యాయులు మాదరవేణి అశోక్ మామునూరు రమేష్ నాగలక్ష్మి శ్రీలత ప్రవళిక ప్రణీత సంధ్య అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

తుఫాన్ బీభత్సం…

తుఫాన్ బీభత్సం

నెక్కొండ మండలంలో భారీ నష్టం

#నెక్కొండ,నేటి ధాత్రి :

మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నెక్కొండ, నర్సంపేట, కేసముద్రం, చంద్రుగొండ పరిసర గ్రామాలు వాగులు, వరదలతో చుట్టుముట్టి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులు చెరువుల్లా మారిపోగా, పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పనికర రైతులు వట్టేవాగు వెంబడి సుమారు 500 ఎకరాల పైన పంట నీట మునిగింది .ఈ పంట మొత్తం పది రోజుల్లో చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తీవ్రమైన ఆవేదన అవుతున్నారు. పనికర గ్రామానికి చెందిన బుర్ర సమ్మిరెడ్డి సంజీవ గర్నెపల్లి రామిరెడ్డి ,సుదర్శన్ రెడ్డి, రాజనర్సింహారెడ్డి, రేగుల ప్రతాపరెడ్డి పైండ్ల రాములు, మధు ,లక్ష్మయ్య, కమలమ్మ,సింగం సమ్మయ్య ఒగ్గుల దేవేందర్ ,ప్రభాకర్, దూదిపాల బాబు, బిక్షపతి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గడ్డ బోయిన కుమారస్వామి, కాశబోయిన కుమార్, కొత్త మోహన్ రెడ్డి, రైతుల
పంటలు పూర్తిగా నీటమునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనికర గ్రామానికి చెందిన రైతు బుర్ర సమ్మిరెడ్డి, భార్య సరోజన ,దంపతులు వేదనతో చెబుతూ “నాలుగు రోజులైతే కోయాల్సిన పంట వట్టే వాగులో కొట్టుకుపోయింది. లక్షల్లో నష్టం జరిగింది. కొద్ది నెలల క్రితం చనిపోయిన మా చిన్నకొడుకు చేసిన అప్పులు తీర్చే అవకాశం ఈసారి వస్తుందని అనుకున్నాం, కానీ మళ్లీ దెబ్బతిన్నాం” అని కన్నీటి స్వరంతో తెలిపారు.
పంట నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైందని చెబుతున్నారు. అధికారులు గ్రామాల పర్యటన చేసి నష్టాన్ని అంచనా వేయాలని ప్రజలు కోరుతున్నారు.

మోంధా తుఫాన్ పట్ల..

*మోంధా తుఫాన్ పట్ల
అధికారులు అప్రమత్తంగా ఉండాలి*

ఆత్యవసమైతేనే బయటకు వెళ్ళాలి..ప్రజలు,రైతులకు విన్నపం

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటన

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 1800 425 3424, జిడబ్ల్యూ ఎంసీలో 1800 425 1980,9701999676 టోల్ ఫ్రీ నెంబర్ల ఏర్పాటు

టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

మోంధా తుఫాన్ ప్రభావం తీవ్రతరం దాల్చిన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్ నుండి కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదనవు కలెక్టర్, జిల్లా,మండల స్థాయి అధికారులు, తహసిల్దార్లతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పరిస్థితులను సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహణకు పలు సూచనలు చేశారు.
క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల… రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డిఆర్డీఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.వర్షాల కారణంగా అత్యవసర సహాయార్ధం ప్రజల కొరకు వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 1800 425 3424 టోల్ ఫ్రీ నెంబర్ కు 9154252936 మొబైల్ నంబర్ కు అదేవిధంగా వరంగల్ పట్టణానికి సంబంధించి జిడబ్ల్యూ ఎంసీ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ 1800 425 1980 టోల్ ఫ్రీ నెంబర్ కు 9701999676 నెంబర్లకు సంప్రదించాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తాసిల్దారులు,ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.తహసిల్దార్లు, ఎంపీడీవోలు తమ మండల పరిధిలోని లు గ్రామాలు జల మాయమయ్యే ప్రాంతాల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు.
వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంటుందని, కావున రోడ్డు రవాణా విద్యుత్ సరఫరా లో అంతారం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, విద్యుత్, రోడ్ల భవనాల శాఖ అధికారులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టాలని,
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయితీ శాఖల ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలన్నారు.నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు కార్యస్థానంలో ఉంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.పారిశుద్ధ్య ఆరోగ్య సమస్యల పరంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ముంపు సమస్యలపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.ఈటెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, పంచాయతీ , అగ్నిమాపక ,బల్దియా, కుడా, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు తహసిల్దారులు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

ఖిలావరంగల్‌లో తహసీల్దార్ ఇక్బాల్ పర్యటన – వర్షంలో ప్రజల బాగోగులపై ఆరా…

ఖిలావరంగల్‌లో తహసీల్దార్ ఇక్బాల్ పర్యటన – వర్షంలో ప్రజల బాగోగులపై ఆరా…

నేటిధాత్రి, వరంగల్‌.

 

ఖిలావరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ కుండపోత వర్షంలో బుధవారం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సమస్యలను స్వయంగా పరిశీలించి, ప్రజలతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు.

ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడే బయటకు రావాలని సూచించిన ఇక్బాల్, ప్రభుత్వం మరియు అధికారులు ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు. వాగులు, చెరువులు, లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ సిబ్బందికి తగిన సూచనలు అందించారు.

ఈ పర్యటనలో ఆర్‌ఐ కీర్తన్, జూనియర్‌ అసిస్టెంట్లు వంశీ, శివ, జిపిఓ సుభాష్ పాల్గొని ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T182020.003.wav?_=4

 

ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

*పిజిఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మకు
సీఎం ఘన నివాళులు*

పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బుధవారం పరామర్శించారు. దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పిజిఆర్ గార్డెన్ లో బుధవారం మాతృయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,

ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, ప్రజా ప్రతినిధులు ఇతర ప్రముఖులు హాజరు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తదితరులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు. దొంతి మాధవ రెడ్డి ని పరమార్శించేందుకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్.

నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి రోడ్డు మార్గం లో పీజీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి దొంతి కాంతమ్మ మాతృయజ్ఞం కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు దొంతి కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ట్స్ కళాశాల మైదానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు చేరుకున్నారు.

తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం

వరంగల్ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి బయలుదేరారు. హెలిపాడ్ వద్ద మంత్రులు అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్. నాగరాజు,యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, ఎన్పీడీసీఎల్ వరుణ్ రెడ్డి, తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు

 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మరణించిన నేపద్యంలో బుధవారం హన్మకొండ లోని పిజీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొననుటకు గాను హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.

ఉప్పరి సాయి కృష్ణను అభినందించిన మాజీ టీపీసీసీ అధ్యక్షులు దొమ్మటి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T132223.758.wav?_=5

 

ఉప్పరి సాయి కృష్ణను అభినందించిన మాజీ టీపీసీసీ అధ్యక్షులు దొమ్మటి

పరకాల నేటిధాత్రి

 

హనుమకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని మలకపేట గ్రామానికి చెందిన ఉప్పరి రవీందర్ మమత దంపతుల కుమారుడు ఉప్పరి సాయికృష్ణ ఎంబిబిఎస్ ప్రతిమ వైద్య కళాశాలలో సీటు వచ్చిన సందర్భంగా గురువారం రోజున ఉప్పరి సాయికృష్ణను మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా దొమ్మటి సాంబయ్య మాట్లాడుతూ ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నంత చదువు చదివి సీటు సంపాదించదం అభినందనియామని గ్రామ యవత చదువులో ముందుండి మిగతా గ్రామాల యువతకు ఆదర్శవంతంగా ఉండాలని తల్లిదండ్రుల పేరును మరియు గ్రామ పేరును నిలబెట్టే విధంగా యువత తయారు అవ్వాలని,ఎంబిబిఎస్ సీటు సాధించిన సాయి కృష్ణ మరింత మంది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట గ్రామస్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం

బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం
ఆశావహుల జాబితాను అధిష్టానానికి పంపిన నేతలు
కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల

నేటిధాత్రి ఐనవోలు :-

Vaibhavalaxmi Shopping Mall

అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు అయినవోలు మండల పార్టీ సూచన మేరకు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల సమావేశం బుధవారం గ్రామ పార్టీ అధ్యక్షులు మామిండ్ల సంపత్ అధ్యక్షతన గ్రామ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పార్టీ ఎన్నికల ఇన్చార్జి మున్సిపాలిటీ పరిధి నుండి మేకల రాణి డివిజన్ పార్టీ అధ్యక్షులు కాంటెస్ట్ కార్పోరేటర్& అయినవోలు మండలం నుండి గ్రామ పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ కట్కూరి రాజు హాజరై రాబోయే జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచి వార్డు సభ్యుల ఎన్నికల గెలుపు కొరకు పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసి కార్యకర్తలను ప్రోత్సహించినారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసినారు. మరియు ఎంపీటీసీ జనరల్ మహిళ ఆశావాహ పోటీ చేసే అభ్యర్థుల నుండి పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ సంపత్, మాజీ ఎంపీటీసీ కడూరి రాజు, నందనం సొసైటీ డైరెక్టర్ రాజారాపు కుమార్, సతీషు, రమేషు, భాస్కరు, ప్రతాపరెడ్డి, సమ్మయ్య, రాజు, రాజిరెడ్డి, రాజేషు, అశోకు, కుమారు, రాజు, రమేషు, రాజబాబు, కుమారు, ప్రతాపు, రాజశేఖర్, మరియు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.

సమాచారం అడిగితే నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ…

సమాచారం అడిగితే నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ

55రోజులు గడుస్తున్నా అందని సమాచారం

బిఎస్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్

పరకాల నేటిధాత్రి

 

 

సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రయివేట్ పాఠశాల సమాచారం కోరగా పరకాల ఎంఈఓ రమాదేవినీ కోరగా ఇప్పటివరకు దాదాపు 55 రోజులు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని బహుజన సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మోగ్గం సుమన్ అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఈఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు రెండు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉండటం లేదన్నారు.సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

కబడ్డీ, రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-80-1.wav?_=6

కబడ్డీ,రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు

నర్సంపేట,నేటిధాత్రి:

జాతీయ క్రీడా దినోత్సవం ఉత్సవాలలో భాగంగా కలెక్టర్,క్రీడాశాఖ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారిని టీవీఏల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియం లో సోమవారం కబడ్డీ రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్జిఎఫ్ఐ సెక్రెటరీ సోనబోయిన సారంగపాణి,రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, నర్సంపేట జోన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గండి నర్సయ్య గౌడ్,సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు నర్సంపేట మండల కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లూరి స్వామి గౌడ్,డాక్టర్ సాదిక్, కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version