పుస్తక ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలి
నర్సంపేట,నేటిధాత్రి:
సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత విప్లవోద్యమ నిర్మాత, ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ సందర్భంగా కామ్రేడ్ సిపి రెడ్డి రాసిన ఏరిన రచనలు అనే
పుస్తకావిష్కరణ సభను జయప్రదం చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ నందు పోస్టర్ ఆవిష్కరణ చేశారు.రాజేందర్ మాట్లాడుతూ
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవోద్యమంలో చేసిన కృషి గొప్పదని,దేశ చరిత్రలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయటంలో చెరగని ముద్రవేశారని అన్నారు.ఈకార్యక్రమంలో పిడిఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, ఐఎఫ్టియు నర్సంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్,గొర్రె ప్రదీప్, ఐఎఫ్టియు డివిజన్ నాయకులు అశోక్,పివైఎల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటస్వామి,ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భోగి సారంగపాణి, నాయకులు కొంపెల్లి సాంబన్న,భద్రాజి, తదితరులు పాల్గొన్నారు.
