ఎస్‌ఐఆర్ పురోగతి ప్రక్రియ ను వేగవంతం చేయాలి.

ఎస్‌ఐఆర్ పురోగతి ప్రక్రియ ను వేగవంతం చేయాలి.

రియాజుద్దీన్.
గీసుకొండ మండల తహసిల్దార్.

గీసుగొండ నేటిధాత్రి.

వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తహసీల్దార్ రియాజుద్దీన్ సూచించారు.

గురువారం రోజున ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ పురోగతిని తహసిల్దార్ సమీక్షించారు.ఈ సందర్భంగా గీసుగొండ మండలంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రస్తుతం 74.15 శాతం మేర పూర్తయిందని అధికారులు తెలియజేశారు.
ఈ పురోగతిని మరింత పెంచి, నిర్ణీత గడువులో 90 శాతానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి బీఎల్ఓలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ అనుసంధానంలో భాగంగా ఓటర్లు 2002 ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని తమ పేరు, తల్లిదండ్రులు లేదా తాతల వివరాలను పరిశీలించి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని కోరారు. అలాగే తహసీల్దార్ మరియు ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను వినియోగించుకోవాలని సూచించారు.మండలంలోని గ్రామ పెద్దలు,రాజకీయ నాయకులు,సర్పంచ్‌లు ప్రజల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి,ప్రతి ఓటరు అనుసంధాన కార్యక్రమంలో పాల్గొనేలా సహకరించాలని తహసీల్దార్ కోరారు.గీసుగొండ మండల ప్రజలు ఎవరికైన సందేహాలు ఉంటే తమ సంబంధిత బీఎల్ఓ లను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.ప్రతి కాలనీ పెద్దలు,సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి,అనుసంధాన కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రియాజుద్దీన్,బీఎల్ఓ సూపర్వైజర్లు మరియు బీఎల్ఓలు పాల్గొన్నారు.

గీసుకొండ మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

గీసుకొండ మండలంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

నలుగురు అరెస్ట్ – ఇద్దరు పరారీ – నగదు, సెల్‌ఫోన్లు, బైకులు స్వాధీనం

వివరాలు వెల్లడించిన సీఐ విశ్వేశ్వర్

నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో పేకాట శిబిరంపై స్థానిక పోలీసులు,టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం గీసుకొండ పోలీసులు,వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 19 న కొమ్మాల గ్రామ శివారులో కడారి రాజు వ్యవసాయ భూమి వద్ద నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు.అరెస్టైన వారిలో అదే మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కడారి రాజు,బసికే ప్రభాకర్, విశ్వనాధపురానికి చెందిన దునికే కొమురయ్య,లకావత్ గణేష్ ఉన్నారు. కాగా విశ్వనాధపురానికి చెందిన వాంకుడోత్ రాజు,కొమ్మాల గ్రామానికి చెందిన పల్లె నరేష్ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు.పట్టుబడిన వారి వద్ద నుంచి రూ. 4,840 నగదు, 5 సెల్‌ఫోన్లు, 4 మోటార్ సైకిళ్లు మరియు పేకాట ముక్కలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు.

వరంగల్ జిల్లాలో 88.11శాతం ఓటింగ్ నమోదు..

వరంగల్ జిల్లాలో 88.11శాతం ఓటింగ్ నమోదు

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికలు దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం,గీసుకొండ మండలాల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.11శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
దుగ్గొండి మండలం 89.88 శాతం అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా గీసుకొండ మండలం 85.83 శాతం ఓట్లతో జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ అయ్యింది.సంగెం మండలంలో 89.44 శాతం ఓట్లు పోలింగ్ కాగా నల్లబెల్లి మండలంలో 86.36 శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా పరిధిలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జిల్లాలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దుగ్గొండి, నల్లబెల్లి,సంగెం,గీసుకొండ మండలాల పరిదిలో 66467 పురుషులు,69722 మహిళలు ఇతరులు ఇద్దరు కాగా మొత్తం 136191ఓటర్లు ఉండగా అందులో
58688 మంది పురుషులు 61311 మహిళలు ఇతరులు ఇద్దరు మొత్తం 120001మంది ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version