అభివృద్ధి కొరకు వ్యాపార మార్గాలను నైపుణ్య శిక్షణ
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రతి మహిళ అభివృద్ధి కొరకు వ్యాపార మార్గాలను నైపుణ్య శిక్షణల ద్వారా ఎంచుకోవాలని నర్సంపేట చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి కే. మధురిమ మరియు ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అన్నారు.ప్రతిభా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సహకారంతో మంగళవారం నర్సంపేటలో నిరుపేద మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం సంస్థ అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథి మధురిమ మాట్లాడుతూ సమాజంలో ప్రతి మహిళ కుటుంబ అభివృద్ధికి తన పాత్ర పోషిస్తుందని అంతేగాకుండా ఆర్థిక ప్రగతి సాధించడానికి ప్రతి మహిళ కూడా నైపుణ్య శిక్షణలు తీసుకోవాలన్నారు.అలాగే వ్యాపార మార్గాలు ఎంచుకొని ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలని తెలిపారు.శిక్షణను పొందిన ప్రతి మహిళలకు ప్రభుత్వ పరంగా కూడా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో హాజరైన సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ మాట్లాడుతూ నిరుపేద మహిళలకు ,ఆదరణ లేని మహిళలకు శిక్షణ అందించడం అనేది సంస్థ ప్రాథమిక ఉద్దేశం అని పేర్కొన్నారు.ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణా,ఎర్ర శ్రీకాంత్ శ్రీకాంత్,ఫైనాన్స్ మేనేజర్ అజయ్ కుమార్,ప్రతిభ స్వచ్ఛంద సంస్థ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, స్వయంకృషి ఎన్జీవో ప్రతినిధి బెజ్జంకి ప్రభాకర్ ట్రైనర్ శ్వేత అంగన్వాడి టీచర్ గొర్రె రాధ,మహిళలు పాల్గొన్నారు.
