ఇందిరమ్మ రాజ్యంలో.. పసిపిల్లల ప్రాణాలు తీయడమేనా…

ఇందిరమ్మ రాజ్యంలో.. పసిపిల్లల ప్రాణాలు తీయడమేనా?

నిందితులను కఠినంగా శిక్షించాలి

బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్.

బాలానగర్ నేటి దాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో రెండు నెలల పసికందు మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అని బాలానగర్ మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ మంగళవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కులం పేరుతో దాడి చేసి, పసిపాప ప్రాణం పోవడానికి కారణమైన వారిని కాపాడటం సిగ్గుచేటు
ఢిల్లీలో రాహుల్ గాంధీ, సామాజిక న్యాయం’ అని క్లాసులు చెప్తారు. కానీ.. తెలంగాణలో ఆయన పార్టీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే వెనుకబడిన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. గుడికి వెళ్తే దాడులా? ఇదేనా మీ ప్రజా పాలన.. రేవంత్ రెడ్డి నిందితులను వదిలేస్తారు… ప్రశ్నించే నాయకులను అరెస్ట్ చేస్తారు! నాగర్ కర్నూల్ ఘటనపై గళం ఎత్తినందుకు నాయకులపై ఆంక్షలు విధించడం సబబు కాదన్నారు. పాప మృతికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

హైకోర్టు కు కృతజ్ఞతలు టీయూజేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు పెండ్యాల సుమన్…

హైకోర్టు కు కృతజ్ఞతలు టీయూజేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు పెండ్యాల సుమన్

పరకాల,నేటిధాత్రి

 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అర్హుడైన ప్రతి ఉద్యమ కారునికి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ప్రకటించిన ఇంటి స్థలాలను ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (టియూజేఏసీ) ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పెండ్యాల సుమన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులపై కేసులుఉండి జైలు పాలైన ఉద్యమకారులకి మొదటి ప్రాధాన్యత గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వారికి రెండవ ప్రాధాన్యత గా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సోమవారం ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు,పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా హామీల అమలుకు 8 వారాలు సమయమిచ్చిన హైకోర్టు అందుకు ఉద్యమకారులు హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు,పెన్షన్లు మంజూరు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఫ్రీడం ఫైటర్ శాఖ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఉద్యమ జేఏసీ నాయకులు దీనిపై విచారణ జరిపి అర్హులైన ఉద్యమకారులకు 8 వారాల్లోగా హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు
ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా టీయూజేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలలో అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని సుమన్ కోరారు.

కేబినెట్ హోదాలపై పిల్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు..

కేబినెట్ హోదాలపై పిల్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా (Cabinet Posts) కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది.

కాంగ్రెస్ నేతలు కేశవరావు , పోచారం శ్రీనివాసరెడ్డి , సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్, చిన్నారెడ్డిలతోపాటు మరో తొమ్మిది మందికి కేబినెట్ హోదా చట్ట విరుద్ధమని పిటిషన్‌లో ప్రస్తావించారు. రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మాత్రమే కేబినెట్ హోదా ఇవ్వాలని వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రమే కేబినెట్ హోదా ఉంటుందని వివరించారు ఏరోళ్ల శ్రీనివాస్.రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసి పుచ్చి ఓ నెంబర్ కేటాయించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2017లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వేసిన పిల్‌తో పాటు బీఆర్ఎస్ పిటిషన్లను కలిపి వచ్చే వారంలో విచారణకు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.

కోర్టు ఆదేశాలతో మళ్లీ చైర్మన్ గా మారం రాము

కోర్టు ఆదేశాలతో మళ్లీ చైర్మన్ గా మారం రాము

#నెక్కొండ, నేటి ధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల నిర్వహణలో జాప్యం వల్ల కాలపరిమితి పూర్తయిన సహకార సంఘం చైర్మన్ లకు మళ్లీ కొనసాగించాలని ఆదేశించింది. అయితే వరంగల్ జిల్లా లోని చెన్నారావుపేట, నల్లబెల్లి, నెక్కొండ ,నాచినపల్లి, దుగ్గొండి, సహకార సంఘాల చైర్మన్ లను కొనసాగించుటలో సందిగ్ధం ఏర్పడడంతో ఆయా చైర్మన్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం వీరిని చైర్మన్గా కొనసాగించాలని ఆదేశించడంతో నెక్కొండ సహకార సంఘ చైర్మన్ మారం రాము, గౌరవ సభ్యులతో మంగళవారం సాయంత్రం విధుల్లో చేరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version