సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో.!

సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ పాల్గొని మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాలకు దెబ్బతిన్న ఉల్లేపల్లి గ్రామపంచాయతీలోని చెక్ డాం మర్మంతులకు,పురుషోత్తమాయ గూడెం చెక్ డాం మరమ్మతుకు, అబ్బాయి పాలెం రోడ్డుకు సెంటర్ లైటింగ్ మరమ్మకు, మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులకు మొత్తం సుమారు 3 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, పేద ప్రజలకు విద్య వైద్యం అందాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమన్నారు, అభివృద్ధిలో డోర్నకల్ నియోజకవర్గం ముందంజలో ఉంచామని పేద ప్రజల చిరకాల వాంఛ ఐనా ఇందిరమ్మ ఇండ్లు,నూతన రేషన్ కార్డులు వంటి కార్యక్రమాల్ని చేయడం జరుగుతుంది అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, పురుషోత్తమాయగూడెం తాజా మాజీ సర్పంచ్ నూకల అభినవరెడ్డి,శ్రీపాల్ రెడ్డి,నల్లు శ్రీకాంత్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, అంబరీష్య రామ్లాల్,మెంచు అశోక్ కుమార్, అబ్జల్,టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్,మాజీ సర్పంచులు,మాజీ కౌన్సిలర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు,ప్రజా ప్రతినిధులు,స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

గురిజాల హైలెవల్ బ్రిడ్జి వంతెనకు శంకుస్థాపన చేసిన.

గురిజాల హైలెవల్ బ్రిడ్జి వంతెనకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి

హర్షం ప్రకటించిన గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో పెద్దం చెరువు వద్ద శిథిలావస్థలోనున్న గురిజాల నుండి నర్సంపేట పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో లోలెవల్ వంతెన స్థానంలో 3.20 కోట్ల రూపాయలతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.కాగా గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గొలనకొండ వేణు,ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
గత కొన్ని సంవత్సరాల నుండి పెద్దం చెరువు లోలెవల్ వంతెన ప్రమాదకర పరిస్థితులలో నీటి ఉధృతితో రాక పోకలు నిలిచిపోయి ఆరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు గుర్తుచేశారు. ఎమ్మెల్యే దొంతి శంకుస్థాపనతో ఆ కష్టాలు తీరానున్నాయని తెలిపారు. గురిజాల నుండి కోనాపురం వెళ్ళుటకు గ్రామ ప్రజలు, రైతులు రోడ్డు లేక అవస్థలు పడేవారని దీంతో మహేశ్వరం క్రాస్ నుండి గురిజాల, ఎంపీటీసీ రోడ్ మీదుగా కోనాపురం వెళ్ళుటకు 3.10 కోట్లతో బీటీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేయడం వారు సంతోషం వెలిబుచ్చారు. గురిజాల గ్రామంలో సీసీ రోడ్లు కాక మిగిలిపోయిన వీధులన్నీ వర్షా కాలంలో బురదమయం అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ అందుకు గాను సీసీ రోడ్లు వేయించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు వేణు,రాజేందర్ గౌడ్ పేర్కొన్నారు.

55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.

సంకేపల్లి గ్రామంలో 55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
*శంకర్ పల్లి, నేటి ధాత్రి :-

 

 

 

 

 

శంకర్ పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామంలో 55 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రామస్థులతో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమస్యలని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నిర్మాణ పనులలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పనులలో జాప్యం జరగకుండా పనులను త్వరితగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ లో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి సంజీవరెడ్డి, ఫిల్డ్ అసిస్టెంట్ ఉబాగుంట రాజు, మాజీ సర్పంచ్ భద్రయ్య, వార్డు మెంబర్లు, కావాలి గోపాల్, సురేష్, మౌనేష్ , తదితరులు పాల్గొన్నారు.

మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన..

మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ సుభాష్ కాలనీలో గల టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 400 లక్షల రూపాయలతో మినీ స్టేడియం నిర్మాణ పనులకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ ఈ స్టేడియంను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్టేడియం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి మరియు సంబంధిత అధికారులకు సూచించారు. రాబోవు రోజుల్లో ఈ స్టేడియంకు సావిత్రి బాయ్ పూలే పేరు పెడతామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఏఈ మానస పట్టణ అధ్యక్షుడు దేవన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీనివాస్ ముంజాల రవీందర్ కురుమిళ్ళ శ్రీనివాస్ రమణ చారి పార్టీ మండల నాయకులు అధికారులు పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన..

మల్లక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల శంకుస్థాపన

 

పరకాల నేటిధాత్రి
మండలంలోని మల్లక్కపేట గ్రామంలో శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలమేరకు ఎంజిఎన్ఆర్ ఇజిఎస్ లో సాంక్షనయినా సీసీ రోడ్డు నిర్మాణపనులను మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అల్లం రఘునరాయణ,గ్రామ అధ్యక్షులు మనూరి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్,అల్లం శ్రీరామ్,మాజీ ఎంపీటీసీ దుమల కిషోర్,తిక్క పౌల్,మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్,అంబీర్ మహేందర్,దొమ్మటి దాస్,దోమ్మటి చార్లెస్,మాజీ వార్డ్ సభ్యులు దోమ్మటి శ్రీనివాస్,మల్లయ్య,దోమ్మటి శంకరయ్య,ఇందిరమ్మ కమిటీ సభ్యులు గంగోజుల వెంకటేశ్వర్లు,పైడిపాల రామకృష్ణ,బాలకృష్ణ,చెన్న రాజేందర్,బొజ్జం రాజు,బండి రవీందర్,మధు,దోమ్మటి సుమన్,కొమ్ముల చిరంజీవి,దుమాల ఆనందం,బొల్లారం శంకరయ్య పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version