గ్రామాల అభివృద్ధి… కేంద్ర ప్రభుత్వం తోనే సాధ్యం.
#యువతకు అవకాశం ఇవ్వండి.
#బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఆసరవెల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన బిజెపి అభ్యర్థి బానోతు వీరన్న గెలుపు కోసం ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని బిజెపి బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని ఓటర్లకు ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడాలంటే చదువుకున్న యువతకు అవకాశం కల్పిస్తే అవగాహన ఉన్న యువత సమస్యలపై సందిద్ధంగా పోరాటం చేసి గ్రామ అభివృద్ధికి దోహదపడతారని అన్నారు. కావున గ్రామ ప్రజలు ఆలోచించి ఎవరి వల్ల గ్రామం అభివృద్ధి కోసం పాటుపడుతున్న బానోతు వీరన్న కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్, నాయకులు సింగిరెడ్డి యాదగిరి, బచ్చు వెంకటేశ్వరరావు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
