పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన..

పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

వనపర్తి నేటిదాత్రి

 

బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వనపర్తి, పెబ్బేరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గోదాములను తనిఖీ చేశారు. వనపర్తి మండలంలోని నాచహళ్లి ఐకేపీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించార అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడారు. వడ్లు తాలు, పొల్లు లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురావాలని రైతులకు సూచించారు.
పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామానికి వెళ్ళిన అదనపు కలెక్టర్, అక్కడ ఏఈఓ జారీ చేస్తున్న టోకెన్లను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సీరియల్ పద్ధతిలో వరుస క్రమంలో టోకెన్లు జారీ చేయాలని ఏఈఓను ఆదేశించారు. పెబ్బేరు మండలంలోని సూగురు గ్రామంలోని ఎస్.డబ్ల్యూ.సి గోదామును సందర్శించి,అక్కడ డెలివరీ అవుతున్న సీఎంఆర్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని బియ్యం వస్తే వెంటనే తిరస్కరించాలనివాటిని సంబంధిత మిల్లుకు వెనక్కి పంపాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చివరగా పెబ్బేరు మండలంలోని సత్యసాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.మిల్లు యజమానితో మాట్లాడి, యాసంగి 2024-25 సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను ఎటువంటి జాప్యం లేకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని మిల్లు యజమానిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జగన్ పెబ్బేరు తహసీల్దార్ మురళి అధికారులు ఉన్నారు

ఉపాధ్యాయుని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే…

ఉపాధ్యాయుని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలోని జంగిడిపురం లో ఉపాధ్యాయులు నిరంజన్ గౌడ్ నూతన గృహప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు
ఎమ్మెల్యే వెంట వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు జయసుధ మధుసూదన్ గౌడ్ బ్రహ్మాoచారి.తదితరులు ఉన్నారు

మెదక్ ఎంపీ సహకారం తో.. కొనుగోలు కేంద్రం ప్రారంభం…

మెదక్ ఎంపీ సహకారం తో.. కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట: నేటి ధాత్రి

 

ఎంపీ రఘునందన్ రావు సహకారంతో కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో ఇప్పటికే ఐకెపి కొనుగోలు కేంద్రం ఉండగా రైతులకు ఇబ్బందులు కలగకూడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సొసైటీ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్మనమైన శ్రీనివాస్, దుర్గ రెడ్డి, రాజు, అంజయ్య, తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version