ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు…

ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఆవు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఒకే కాన్పులో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన ఝరాసంగం మండల బోరేగావ్ గ్రామ పరిధిలోని బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చాకలి శంకర్ అనే పాడి రైతు ఆవు ఉదయం రెండు లేగ దూడలను జన్మనిచ్చింది. లేగ దూడలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఇలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకోవడం విశేషమని రైతు తెలిపారు. ఒకే కాన్పులో ఆవు రెండు లేగ దూడలను ప్రసవించిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు లేగ దూడలను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ విషయం బోరేగావ్ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ పై మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డిని సంప్రదించగా, ఒకే కాన్పులో జన్మించాయని, అవి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సిబ్బందిని పంపించి వైద్యం అందిస్తామన్నారు.

 రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..

 రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..?

 

తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

ఆదిలాబాద్: పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుఫాన్ వల్ల పంట దెబ్బ తిని నష్ట పోయారని చెప్పారు. అమ్మడానికి పోతే తేమ పేరుతో పత్తి రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) మీడియాతో మాట్లాడారు.. 20 శాతానికిపై తేమ ఉన్న పంటను కూడా పూర్తి మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో సీసీఐ వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? అని కవిత ప్రశ్నించారు. చనాక-కొరటా బ్యారేజీ ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు అంచనాలు పెంచారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక పనులను ఆపేశారని పేర్కొన్నారు. దీంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. సీసీఐ రోజుకో నిబంధన తీసుకురావడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల మోంథా తుపాన్‌ వరదలతో పత్తికి భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని 20 శాతం తేమ ఉన్నా సీసీఐ కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు నిలిపివేస్తామని తెలంగాణ జిన్నింగ్‌ మిల్లర్స్‌, ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

పీఏసీఎస్ ఝరాసంగం సొసైటీ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం…

పీఏసీఎస్ ఝరాసంగం సొసైటీ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సోయ కోనుగోలు కేంద్రం పీఏసీఎస్ ఝరాసంగం అధ్యక్షులు మొహమ్మద్ గౌసోద్దిన్ ప్రారంభించడం జరిగింది ఆయన మాట్లాడుతూ రైతులు తమ సోయాబిన్ ను శుభ్రపరుచుకోని, నాణ్యత ప్రమాణాలు పాటించి,కావలసిన ధృవపత్రాలు ఆధార్ కార్డ్, భూమి పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, జిరాక్స్ కాపీలు తీసుకోని స్వయంగా వచ్చి ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం అమ్మినట్టు అయితే రైతులు లాభాలు పొందే అవకాశం వుందని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర కింటలుకు రూ .5328/- రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పిఎసిఎస్ సెక్రటరీ షేక్ నిస్సార్ అహ్మద్, కేతకి అలయ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటేల్, ఏఎంసీ డైరెక్టర్ అంజత్,ల్యాఖత్ అలీ అమృత్ పాటేల్, మోహన్ రెడ్డి, బశిరెడ్డి, శంకర్ గౌడ్, అష్రఫ్ అలీ, అలయ ధర్మ కర్త, శ్రీనివాస్, రవిందర్ రెడ్డి రాజేందర్ సింగ్ రైతులు మహ్మద్ కిజర్ ఖాన్ తదితరులు పాల్గన్నారు. మరియు రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version