ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్

 మొగుళ్లపల్లి ,నేటిధాత్రి:

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తాము పాలకులం కాదని సేవకులం అన్న భావనతో ప్రజల ఆంక్షలు అవసరాలకే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా రాష్ట్రమంతా గ్రామ సభలు నిర్వహిస్తున్నాయి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల పైబడి పూర్తి అయిందని రాష్ట్రంలోని ఆర్థిక సవాళ్లు అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు ప్రజాపాలన ప్రణాళికసమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మొగుళ్లపల్లి తహసిల్దార్ పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూపాలపల్లినియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కృషి ఎంతగానో ఉందని ప్రజా . ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.
ఇందిరమ్మ పాలనలో ప్రజలకు పథకాలు అందుతున్నాయని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు వార్డ్ సభ్యులుఅధికారి, మహిళా సంఘాలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక…

ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక
శ్రీరాంపూర్: నేటిధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికకార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ సంగ మల్లయ్య పల్లెలోని హనుమాన్ దేవాలయం సమీపంలో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి సుధాకర్, వార్డు ఆఫీసర్ శివతో కలిసి ఆయన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

బీసీ కాలనీలో ప్రజా పాలన కార్యక్రమం…

బీసీ కాలనీలో ప్రజా పాలన కార్యక్రమం

నేటి ధాత్రి:

యాదగిరిగుట్ట బీసీ కాలనీ ఐదవ వార్డులో ప్రజా పాలన కార్యక్రమం లో యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీ గుండు నరసింహ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలను ఈరోజు వాడు ప్రజలకు వివరించడం జరిగింది అలాగే ఐదో వార్డులో ఇందిరమ్మ ఇండ్లు 16 ఇండ్లు రావడం జరిగింది 14 ఇండ్లు పూర్తి కావడం జరిగింది, సహకరించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ భిర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ వార్డులో పలు సమస్యలపై మాట్లాడడం జరిగింది సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి ఇంకా ఏ సమస్య ఉన్న పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలియజేయడం జరిగింది, కార్యక్రమం నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్ రవీందర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై అవగాహన సదస్సు

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – అవగాహన సదస్సు

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై సంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల అవగాహన సదస్సు లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య ,మంత్రి దామోదర్ రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా:సంజీవ రెడ్డి రాష్ట్ర చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు ఒక రోజు అవగాహన సదస్సు గురువారం జరిగింది. కంది మండల కేంద్రం లోని ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఈ అవగాహన సదస్సు కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ MLA సంజీవ రెడ్డి టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా 06.03.2026 నుండి 12.06.2026 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం మరియు ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలపై. ప్రజా ప్రతినిదులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, కాంగ్రెస్ ప్రజా పాలన గడప గడపకు చేరాల ని అందుకు ప్రజా ప్రతినిధులందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ప్రభుత్వ పథకం మహిళల పేరు మీదే మంజూరు అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత కు పెద్ద పీట వేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఝారసంగం మండల సర్పంచులు మరియు నాయకులు పాల్గొన్నారు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

నాగర్ కర్నూల్ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు పాల్గొని పరిశుభ్రత పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే గారు తానే స్వయంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ తో పాటు మున్సిపల్ స్టాప్ కలిసి చీపురు పట్టి శుభ్రత పనుల్లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కోసం ప్రత్యేక లోగోను రూపొందించారని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా చర్చలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ కౌన్సిలర్స్ వార్డ్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ ఏ ఈ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పల్లె ప్రకృతి వనంలో శుభ్రత పరిశుభ్రత….

పల్లె ప్రకృతి వనంలో శుభ్రత పరిశుభ్రత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన. ప్రణాళికలో భాగంగా మండే పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో. గ్రామపంచాయతీ మరియు ప్రభుత్వ అధికారుల తో ప్రజల అందరితో మమేకమై కలిసి ప్రకృతి వనంలో పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రజలు ఏమైనా అవసరాలు ఉన్నచో సమస్యలు వచ్చినచో ప్రజా పాలన. ప్రణాళికలో భాగంగా 99 రోజు ల. యాక్షన్ ప్లాన్ ఉంటుందని. ప్రజలు ఏమైనా అవసరాలు సమస్యలు ఉన్నచో తమ దృష్టికి గాని అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించ.వలసిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. తంగళ్ళపల్లి ఎంపీడీవో లక్ష్మీనారాయణ. కార్యదర్శి ముందoప్రశాంత్. ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య. గ్రామపంచాయతీ పాలకవర్గం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం…

ప్రజా పాలనలో భాగంగా స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం

చీకటాయపాలెం సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శుభ్రత చర్యలు
అంగన్వాడీ కేంద్రాల తనిఖీ..

పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా చీకటాయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి గ్రామంలోని పాఠశాల పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షిస్తూ శుభ్రపరిచే పనులను దగ్గరుండి చేయించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను కూడా ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న సేవలు, సదుపాయాలపై అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు అందించే ఆహారం, పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించాలని సూచించారు.
అలాగే పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సర్పంచ్ సూచించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.
గ్రామంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమని సర్పంచ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రగతి ప్రణాళిక అభివృద్ది కాదు దోచుకోవడం…

ప్రగతి ప్రణాళిక అభివృద్ది కాదు దోచుకోవడం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం

మీడియా సెల్ ఇంచార్జి అశోక్

వనపర్తి నేటిదాత్రి .

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
మహిళలకు 2500 ఫించన్ ,తులం,బంగారం ,4000ఆసరా పింఛన్లు పెంపు ఎక్కడ అని అధికారులను కాంగ్రెస్ పార్టీ ,నాయకులను నిలదీయాలని జిల్లా మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రజా పాలన.ప్రగతి ప్రణాళికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల ఆగ్రహం గురి కాక తప్పదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6నుండి జూన్ 12వరకు నిర్వహించ నున్న ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్ర జల ముందర పరువు పోవడం తప్పదని బి. ఆర్. ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్ అన్నారు
పరిపాలన చేతకాక,ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమై రేవంత్ రెడ్డి రోజుకో నాటకాని తెరపైకి తెస్తున్నారని నందిమల్ల.అశోక్ తీవ్రంగా మండిపడ్డారు 420హామీలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం ఆయ్యారని విమర్శించారు బీ ఆర్ ఎస్ మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు కె.సి.ఆర్ కిట్టు,కంటి వెలుగు ఉచిత కంటి అద్దాలు ,రైతు బంధు ఎకరాకు 6000 వేలు వేశారని ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు నాణ్యమైన మద్యహాన్న భోజనం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 5 రూపాయల భోజనం అమలు చేశారని అశోక్ ఆరోపించారు , రైతు బీమా,రైతు రుణ మాఫీ,24గంటల ఉచిత విద్యుత్,విద్యార్థులకు విద్యా బరోసా ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని విమర్శించారు
ప్రజా పాలన పేరిట గ్రామాలకు పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మా దగ్గరకు రావాలని నిలదీయాలని గ్రామల ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశములో యువత అధ్యక్షులు సూర్యవంశం.గిరి,మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్,సీనియర్ నాయకులు వెంకట్ సాగర్ సయ్యద్.జమీల్,మంద.రాము,విజయ్,సాయికుమార్ తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version