గిరిజనులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
యువ న్యాయవాది పరిటాల సంతోష్ కుమార్
నేటిదాత్రి చర్ల
భద్రాచలం మండల లీగల్ సెల్ సర్వీస్ చైర్మన్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వి శివ నాయక్ ఆదేశాల ప్రకారం యువ న్యాయవాది పరిటాల సంతోష్ కుమార్ జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా చర్ల మండలంలోని పలు గిరిజన గ్రామాలలో న్యాయ అవగాహన సదస్సులను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 9 1995లో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం అమలులోనికి వచ్చిందని ఆయన అన్నారు ఈ చట్టం ద్వారా ఉచిత న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు అని గిరిజనులకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుల్ వజవర్తి అయ్యప్ప హెడ్ కానిస్టేబుల్ చట్టు రమేష్ గోగికార్ రామలక్ష్మణ్ మద్ధి లక్ష్మీనరసింహ రెడ్డి జర్నలిస్ట్ లక్ష్మణ్ కుమార్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
