స్థానిక ప్రజలకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు..

స్థానిక ప్రజలకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు
– మార్కండేయ ఫార్మసీ ఆధ్వర్యంలో

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన సిరిసిల్ల డిఎస్పీ. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద మార్కండేయ ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని డిఎస్పీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఫార్మసీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సర్పంచ్

అభివృద్ధి దిశగా పంచాయతీలో పనులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా మోతే గ్రామంలోని ముత్యాలమ్మ గుడి ఆవరణలో భక్తుల సౌకర్యం మరియు ప్రజల మంచినీటి అవసరాల నిమిత్తం హ్యాండ్ బోర్ అవసరం ఉందని సర్పంచ్ దృష్టికి తీసుకొని రాగా స్పందించి పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు సంబంధించిన అధికారులు ఎంపీడీవో మరియు ఎంపీవోతో మాట్లాడి వారి సహకారంతో ఎంపీపీ నిధులలో మంజూరు చేయించి ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించి నూతన బోర్ పనులను ప్రారంభించిన సర్పంచ్ సుజాత పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముత్యాలమ్మ గుడి వద్దకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి సౌకర్యం కోసం అలాగే గ్రామ ప్రజలకు కూడా త్రాగునీటికి ఈ బోర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అక్కిరెడ్డి నిర్మల, సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు, ఎల్లి సోమిరెడ్డి, బుడగ వెంకన్న, అక్కిరెడ్డి మల్లారెడ్డి, రాజేందర్, మోతే గ్రామస్తులు పెద్దలు పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

“4వ వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం”

కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయండి కన్నం యుగదీశ్వర్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 4వార్డ్ బిజెపి పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కన్నం యుగదీశ్వర్ యుగేందర్ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగో వార్డ్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ పంపియండి కాలనీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను నాలుగో వార్డు పక్కకు వారం సంతను తీసుకువస్తాను ప్రతి వార్డుకు ఒక బోరు వేసి నీటి సౌకర్యం కల్పిస్తాను కాలనీ సమస్యలను అన్నిటిని పరిష్కరిస్తానని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

16వ వార్డులో నూతన బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ 16 వార్డులో నూతనంగా వేసిన బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రతి వార్డులో ప్రతిరోజు రెండు గంటలు పర్యటించి కాలనీ సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కమిషనర్ ఏ ఈ కాలనీ ప్రజలు పాల్గొన్నారు

మాజీ వైస్ చైర్మన్ అజ్మత్ పాషా ప్రజల నీటి సౌకర్యం గురించి బోర్‌వెల్ వెయ్యడం జరిగింది…

మాజీ వైస్ చైర్మన్ అజ్మత్ పాషా ప్రజల నీటి సౌకర్యం గురించి బోర్‌వెల్ వెయ్యడం జరిగింది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, హబీబ్ మిల్లత్ అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సభ్యుడు కార్వాన్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కోట్సర్ మొహియుద్దీన్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ అజ్మత్ పాషా సూచనల మేరకు జహీరాబాద్‌లోని శాంతి నగర్‌లో తన సొంత ఖర్చుతో బోర్‌వెల్ తవ్వించారు. వార్డు ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు మరియు ఈ బోర్‌వెల్ ప్రజలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. జహీరాబాద్ మజ్లిస్ అధ్యక్షుడు ముహమ్మద్ అథర్ అహ్మద్ బోర్‌వెల్‌ను ప్రారంభించారు అజ్మత్ పాషా ప్రజల నీటి సమస్యను పరిష్కరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు అజ్మత్ పాషా జహీరాబాద్ వార్డులో వేసిన మూడవ బోర్‌వెల్ అని ప్రజలు అన్నారు. గతంలో,అతను తన సొంత ఖర్చుతో రెండు బోర్‌వెల్‌లను కూడా వెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా, కో-చైర్మన్ బిన్ అమీర్ బిన్ అబ్దుల్లా, షేక్ ఇలియాస్ వార్డ్స్ అధ్యక్షుడు ముహమ్మద్ యూనస్, అయూబ్ పార్టీ సీనియర్ నాయకుడు ముహమ్మద్ షఫీ, అలాగే వార్డు ప్రజలు మరియు మజ్లిస్ కార్మికులు పాల్గొన్నారు.

రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి…

రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

సిపిఎం పార్టీకి కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో, రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని,నూతన అండర్ బ్రిడ్జి ప్రారంభించి పూర్తి చేయాలని, అంతవరకు ఉన్న పాత ఆర్ యు బి ని పునరుద్ధరించాలని,రెండవ ప్లాట్ ఫారం పై క్రికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, రైల్వే పరిసర ప్రాంతాల్లో కోతులు కుక్కలను నివారించాలని, మంచినీళ్లు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని రైల్వే స్టేషన్ మాస్టర్ రతన్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్షాల ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న, సీనియర్ నాయకులు చాగంటి కిషన్, మోడెం వెంకటేశ్వర్లు,నీరుటి జలంధర్, జల్లే జయరాజ్, అల్పుగొండ సావిత్ర, బండి దుర్గ ప్రసాద్, తులసిమొగ్గ వెంకన్న,చిక్కుడు కవిత,పొన్నాల ఉపేందర్, తదితరులు పాల్గొనడం జరిగింది.

సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్ల ఏర్పాటు..

సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్ల ఏర్పాటు

మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ,ఎస్టి కాలనీ, అంబేద్కర్ కాలనీలో బోర్వెల్ కు సంబంధించిన విద్యుత్ మోటర్లు చెడిపోయి నీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు స్థానిక కాంగ్రెస్ నాయకులకు తెలిపారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన,గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డి కాలనీవాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను11 బోర్లు బిగించి నీటి కొరతను తీర్చారు.ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి మంతెన లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న నేటి సమస్యలను తీర్చడంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముందుంటారని అన్నారు.ప్రభుత్వ నిధులతోనే కాకుండా తమ విశాఖ ట్రస్ట్ ద్వారా అనేక బోర్ బావులు వేపించి ప్రజల కష్టాలు తీర్చారని తెలిపారు.అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలందరికీ చేరువ చేస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు.అదేవిధంగా సొంత ఖర్చులతో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసిన మాజీ ఉపసర్పంచ్ అంబల్ల సంపత్ రెడ్డికి కాలనీవాసులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబల్ల రవి,మాజీ వార్డు సభ్యులు అరిగేల శ్రీనివాస్,ఇరిగిరాల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version