నేషనల్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు…

నేషనల్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి ఏరియా నుండి ఐదుగురు క్రీడాకారులు ఉత్తర్ ప్రదేశ్ లక్నో లో నవంబర్ 23 నుండి 29 వరకు జరిగే 19 వావ నేషనల్ జంబోరీ కి పయోనీరింగ్, స్టేట్ గేట్, క్యాంపు క్రాఫ్ట్ తదితర ఈవెంట్లలో ఎంపికయ్యారు. తొట్ల స్వామి, స్కౌట్ మాస్టర్ జనరల్ అసిస్టెంట్, కేటికే 6 ఇంక్లైన్ వీ.శ్రీనివాసరావు, జనరల్ అసిస్టెంట్ రోవర్ స్కౌట్ లీడర్, కేటికే ఓసీ-2”, ఎస్.తిరుపతి, స్కౌట్ మాస్టర్ ట్రామర్, కేటికే 1 ఇంక్లైన్ శ్రీ సూర్య తేజ, కబ్ మాస్టర్ జనరల్ అసిస్టెంట్, కేటికే 5 ఇంక్లైన్ కే. రాజమొగిలి, సీనియర్ రోవర్ సపోర్టుమెన్, కేటికే 1 ఇంక్లైన్ .
అదే విధంగా మన సింగరేణి పాఠశాల నుండి ముగ్గురు గైడ్స్ అమ్మాయిలు బిట్స్ నుండి ఇద్దరు స్కౌట్స్ అబ్బాయిలు పాల్గొనుటకు అర్హత సాధించారు. భూపాలపల్లి టీమ్ కు స్కౌట్ మాస్టర్ తొట్ల స్వామి నాయకత్వం వహిస్తున్నారు.
జాతీయ స్థాయిలో జరిగే జంబోరీ లో పాల్గొంటారు ఈ సందర్భంగా సింగరేణి జనరల్ మేనేజర్, పర్సనల్ మేనేజర్ క్రీడాకారులను అభినందించారు

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు..

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు..

మందమర్రి నేటి ధాత్రి

 

స్వాతంత్ర సమరయోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి జయంతి వేడుకలను రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రస్తుత సింగరేణి ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ ఫీహ్వాల్ , రాణి ఫీహ్వాల్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో పాధ్యాయులు జె. పురుషోత్తం మాట్లాడుతూ. ఝాన్సీ లక్ష్మీబాయి 1828 వారణాసిలో మణికర్ణికా తంబేగా జన్మించారు.ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన నాయకురాలని,చిన్నతనం నుంచి గుర్రపు స్వారీ కత్తి యుద్ధం నేర్చుకుని 1857 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత తిరుగుబాటులో ఆమె కీలక పాత్ర పోషించి ఆమె ధైర్యానికి దేశభక్తికి ప్రతికగా నిలిచారు.ఝాన్సీ రాణి చిన్నతనం నుండి దేశ స్వాతంత్రం కోసం పోరాడి 1858 జూన్లో మరణించారు.భారత దేశ చరిత్రలో ఒక వీరవనితగా స్వాతంత్ర సమరయోధురాలిగా గౌరవించబడిందని ఆమె ధైర్యం దూడ సంకల్పం నేటికీ అనేక మందికి ప్రేరణ నిస్తాయని,విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించుకోవడంతో పాటు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. రాజేష్ రాజేష్ ఫీహ్వాల్ మాట్లాడుతూ..విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలో స్వతంత్ర సమరయోధులు, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం జీవన్,దేవమ్మ,అనుపమ, రూపాలత,ఆశాజ్యోతి, రవీందర్,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన జిఎం…

సింగరేణి పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన జిఎం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

శనివారం రోజున స్థానిక కృష్ణ కాలనీలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు నూతనంగా పాఠశాలకు నియమింపబడిన 2 బస్సులను ప్రారంభించారు. జిఎం మాట్లాడుతూ ఈ స్కూలు బస్సులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం, త్వరగా సేవలలోకి బస్సులలో తీసుకురావడం జరిగిందని, విద్యార్థులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉంటుందని వారి విలువైన సమయమును కోల్పోకుండా ఈ బస్సుల ద్వారా త్వరగా పాఠశాలకు చేరుకోవచ్చునని, అలాగే విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, సురక్షితంగా పాఠశాలకు ఈ బస్సుల ద్వారా చేరుకోవచ్చని విద్యార్థులకు తెలియజేశారు, అదేవిధంగా సింగరేణి పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో గత సంవత్సరం మంచి ర్యాంకులను కైవసం చేసుకున్నారని, నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు అయ్యారని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులను తీసుకువచ్చి పాఠశాలకు సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు, ఈ కార్యక్రమంలో, ఏరియా పర్సనల్ మేనేజర్, (పాఠశాల కరస్పాండెంట్) కావూరి మారుతి, పాఠశాల ప్రిన్సిపల్, ఝాన్సీ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు…

ఘనంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటో భవన్లో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా* *నిర్వహించారు*ముందుగా అధ్యక్షులు శ్రీ పసుల వెంకటస్వామి *

ఫోటోగ్రఫీ పితామహుడి*జండా ఎగురవేశారు అనంతరం సభ్యుల సమక్షంలో కేక్ కటింగ్ చేసరు తర్వాత సింగరేణి ఉన్నత పాఠశాల మనో వికాస పిల్లలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్స్. వైద్య రవి కి సోమ బాలాజీ కి. కల్లాటి *రాజు కి జయ శంకర్ కి

 

*శాలువాతో *ఘనంగా సన్మానించి ఆత్మీయ జ్ఞాపిక అందజేశారు
*కార్యక్రమంలో
రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్. కోశాధికారి బద్రి సతీష్ . గౌరవ సలహాదారులు * నక్క తిరుపతి*ఎం.వి సత్యనారాయణ జాడి ముకుoదo *వర్కింగ్* ప్రెసిడెంట్ వలస మణిరాజ్ ఉపాధ్యక్షులు * నక్క పవన్*లక్కిరెడ్డి అనిధర్ రెడ్డి ఆర్ సుజిత్*తాళ్లపల్లి రమేష్* కార్యదర్శులు పసుల రవి .

 

 

పగిడి రాజలింగు *ప్రచార కార్యదర్శులు.*కందుకూరి శ్రీకాంత్ బన్నీ శివ. కార్యనిర్వహ కార్యదర్శి జూపక సాది మాజీ ఉపాధ్యక్షులు కామెర గణేష్ విక్టరీ అశోక్.కామెర మహేందర్ సభ్యులు సిహెచ్ రవి మేడి అభిలాష్. ఐమాక్స్ *ప్రసాద్*బుజ్జి హరి భారత్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version