పాఠశాలల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి- పిడిఎస్యు

పాఠశాలల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి- పిడిఎస్యు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పెండింగ్ ఫీజులు బకాయిలను విడుదల చేయాలని మంచిర్యాల కలెక్టర్ కి పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి అరకొర నిధులు విడుదల చేయడంతో ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల నుండి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ పాఠశాలల నిర్వాహకులు కూడా బడ్జెట్ రాక విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసే పరిస్థితి నెలకొంటుంది.అంతేకాకుండా బడ్జెట్ రాక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీనిపై స్పందించి పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వంలో డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్,కే.కార్తీక్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version