మావోయిస్టు పార్టీ భారత్ బంద్ పిలుపు
రాష్ట్ర సరిహద్దులో హై అలర్ట్ చేసిన పోలీసులు
జైపూర్,నేటి ధాత్రి:
మావోయిస్టు అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రామగుండం కమీషనరేట్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చెన్నూర్ రూరల్ పోలీస్ లు విస్తృత తనిఖీలు చేపట్టారు.సరిహద్దు వెంబడి ప్రాణహిత నది ఫెర్రీ పాయింట్స్ ను రహదారుల వెంబడి కల్వర్ట్స్ అదేవిధంగా వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టారు.ఈ తనిఖీలలో చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,కోటపల్లి ఎస్సై రాజేందేర్,కోటపల్లి,నీల్వాయి పోలీస్ లు మరియు స్పెషల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
