మండలంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం పాటలు, ఆటలు, క్విజ్ లు నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలలో జెండా ఆవిష్కరించిన అనంతరం పలువురు అధికారులు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.