ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే రాగిజావ అమలు..

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే రాగిజావ అమలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-65-1.wav?_=1

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలల్లో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు అమలు చేస్తున్న రాగిజావ పంపిణీ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇప్పటివరకు అందలేదని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఏడాది వరకు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీ జరిగిందని పేర్కొన్నారు.ఈ ఏడాది ఆదేశాలు వస్తే విద్యార్థులకు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

భూభారతిని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి..

భూభారతిని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి

పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలి ..ఎం సి పి ఐ ( యు) డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎం సిపిఐ (యు ) నాయకులు నర్సంపేట ఆర్డీవో ద్వారా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూ భారతి అమలు చేయకపోవడం మూలంగా రైతుల భూముల సమస్యలు తీవ్రతరం అయ్యాయని అన్నారు.గత 15 ఏళ్లుగా నర్సంపేట పట్టణంలో 111 లో సర్వే నెంబర్ లో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాలనీ వాసుల కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అన్నారు.అంతర్గత రోడ్లు , డ్రైనేజీ,మంచినీటి సౌకర్యం వెంటనే కల్పించాలని కోరారు.సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో కాలనీలో హెల్త్ క్యాంపులను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న,మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగల రాగసుధ,రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగేల్లి కొమురయ్య , ఎంసీపీఐ (యు)డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ,ఏఐసిటియు జిల్లా అధ్యక్షులు ఎండి మా షూక్ పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు.!

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?

కార్మిక సంఘాల నాయకులను గనుల పైన నీలదీయండి

కార్మికులకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పిలుపు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలలు కాలం గడుస్తున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?అని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు నిలదీశారు. గురువారం నస్పూర్ కాలనీలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం బెల్లంపల్లి రీజినల్ సెక్రెటరీ సమ్ము రాజయ్య ఆధ్వర్యంలో టీఎస్ యుఎస్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ,సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలలో గుర్తింపు పొందిన ఏఐటీయూసీ,ప్రాతినిత్య ఐఎన్టియుసి కార్మిక సంఘాలు ఎన్నికలలో పెద్ద పెద్ద మేనిఫెస్టోలలో కార్మిక సమస్య చేర్చి మా సంఘానికి ఓట్లు వేసి గెలిపించండి మీకు ఇస్తున్న హామీలు తూచ తప్పకుండా కంపెనీతో కొట్లాడి పోరాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికుల ఓట్లు దండుకొని గెలుపొందిన ఏఐటీయూసీ,ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాల నాయకులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని, కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పరిష్కరింపబడలేదని గుర్తింపు ప్రాదీనీత్య సంఘాలు కార్మిక హక్కులు సాధించడంలో విఫలం చెందాయని,కేవలం ఈ రెండు సంఘాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల కోసం కాదని కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలకై కంపెనీతో గుర్తింపు ప్రాతీనిద్య సంఘాలు పోరాడాలని గత ఏడు సంవత్సరాల కాలం నుండి సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని,కార్మికులకు 300 గజాల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలలో కేటాయించాలని,శరీరక శ్రమ మీద ఆధార పడి పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని అన్నారు.బొగ్గు గనుల ప్రాంతంలో బొగ్గు ఆదరిత పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. డిపెండెంట్ ఉద్యోగాల ఇన్వల్యూషన్ విషయంలో కొనసాగుతున్న కుంభకోణంపై ధర్యాప్తి జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుల వారసునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.బొగ్గు తట్ట పనిని కూడా సింగరేణి సంస్థ నిర్వహించాలి.ఎట్టి పరిస్థితులలో ప్రవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించరాదని డిమాండ్ చేశారు.సింగరేణిలో అక్రమంగా తొలగించిన డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనులను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఆపాలి.సింగరేణి పబ్లిక్ రంగ సంస్థల కొనసాగించాలి. కేంద్రం బొగ్గు గనులను బహిరంగంగా వేలం వేసే పద్ధతిని ఆపి తెలంగాణకే సింగరేణి సంస్థలను అప్పజెప్పాలి. 2024-2025 కంపెనీకి వచ్చిన లాభాల నుండి 40 శాతం లాభాలను కార్మికులకు పంచాలి.సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల కోసం ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరేటి రాజన్న,గోదావరిఖని రీజినల్ కార్యదర్శి ఎం ఎఫ్ బేగు, పి.చంద్రశేఖర్,గుంపుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు.!

ప్రైవేటు పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు చేయాలి.

◆: ఎంఐఎం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రవైట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ అన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం, 2009 ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రారంభ స్థాయిలో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లల కోసం ఉచితంగా కేటాయించాలని ఇది 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించా లని  అన్నారు.

విద్యా హక్కు చట్టం (RTE) 2009

 

 

, ప్రైవేట్ పాఠశాలలు

RTE చట్టం, 2009 ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రారంభ స్థాయి తరగతుల్లో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలని అన్నారు.ఈ సీట్లలో పిల్లలకు ఉచితంగా విద్యను అందించి, పాఠశాలలు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాంలను కూడా అందించాలని, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి ఎలాంటి ప్రవేశ రుసుములు లేదా వార్షిక రుసుములు వసూలు చేయకూడదని అన్నారు.

 

 

 

 

 

చట్టం పొరుగు పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తుంది. ప్రతి పిల్లవాడు తమ ఇంటికి దగ్గరగా ఉన్న పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశాల కోసం పిల్లలను స్క్రీనింగ్ చేయడం లేదా క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని  ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

 

 

 

 

 

 

 

ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలకు నిధులు సమకూర్చాలి, తద్వారా వారు ఉచిత విద్యను అందించగలరని,ప్రభుత్వాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కోరుతున్నాయి, తద్వారా వారు తమ పిల్లల విద్య కోసం ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చుని RTE చట్టం ప్రైవేట్ పాఠశాలలు పిల్లలను వివక్షత లేకుండా చేర్చుకోవడానికి, వారి విద్యకు హామీ ఇవ్వడానికి ఉద్దేశించబడిందని,ఈ చట్టం అమలులో ప్రభుత్వాలు,ప్రైవేట్ పాఠశాలలు రెండు బాధ్యత వహించాలని అన్నారు.ప్రభుత్వాలు నిధులు అందించడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు సహాయం చేయాలని, తద్వారా విద్యార్థుల హక్కులను కాపాడడానికి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవచ్చని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి

బారసా జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్

వనపర్తి నేటిదాత్రి :

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ పిలుపుమేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో వనపర్తి పట్టణ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అధ్యర్యములో వనపర్తి పట్టణం లో 6 వ వార్డు మెట్టుపల్లి లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వారు చేసిన అభివృద్ధి పై ప్రజలను అడిగి తెలుసుకున్నామను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తెలిపారు మెట్టుపల్లి ప్రజాలు ప్రజలు మాజీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకరముతో వనపర్తి అభివృద్ధి జెరిగిందని ప్రజలు తెలిపారని శ్రీధర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనె అమలు పరచాలని బీ ఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేశారు మెట్టుపల్లి 6 వార్డు పర్యటన లో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ప్రధాన కార్యదర్శి గందం పరంజ్యోతి మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ నాగన్న యాదవ్ ఉంగ్లం తిరుమల్ ప్రేమ్ నాథ్ రెడ్డి స్టార్ రహీం మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు భాగ్యరాజ్ కవిత సింగనమణి గోపాల్ సునీల్ వాల్మీకి డి దానేలు జహంగీర్ రామకృష్ణనాయుడు అలీమ్ ముని కుమార్ బొడ్డుపల్లి సతీష్ అనుపటి రాము వెంకట్ రఘు బంగాలే వజ్రాల సాయిబాబా గొర్ల బాలయ్య తోట శ్రీను జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

భూభారతి లోని లోపాలను వెంటనే సవరించాలి

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలం చెందిందని, తక్షణమే పూర్తిస్థాయిలో 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకోవాలని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( ఐక్య)- ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు అన్నారు.ఆ పార్టీ పిలుపులో భాగంగా దుగ్గొండి మండల తహసిల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పలు డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కుసుంబ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలోని లోపాలను తక్షణమే సవరించి పేద ప్రజలకు అండగా నిలవాలని, పెంచిన విద్యుత్ బస్ చార్జీలను తగ్గించాలని అంతేకాకుండా గ్రామాలలో కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.తద్వారా పేద బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా 6 గ్యారంటీలను అమలు సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని, లేనియెడల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాఉద్యమాలను నిర్మిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నాగేల్లి కొమురయ్య, పేరబోయిన చేరాలు,మేరుగు సుధాకర్, ఐలోని, సురేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి.

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి

◆ జట్గొండ మారుతి డిమాండ్ చేశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలలో
న్యాల్కల్ మండల మల్గి గ్రామానికి చెందిన మాజీ తాజా సర్పంచ్ తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని
స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి డిమాండ్ చేశారు.

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి.

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి

నర్సంపేట ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం

నర్సంపేట నేటిధాత్రి:

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలని ఏఐఎఫ్ డిఎస్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2009 విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అమలు చేయాలని అధికారులను కోరారు. జర్నలిస్టు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగానే ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని,బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని తక్షణమే ఉపసహరించుకోవాలి అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యజమాన్యాలపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలనిలేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కళ్ళేపెళ్లి రాకేష్, ఏఐఎఫ్డిడబ్ల్యు జిల్లా కమిటీ సభ్యులు మార్త సుధ తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన.

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికల నిర్వచించాలి
టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్
బీసీలను దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

shine junior college

 

 

 

దళితులనుమోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మొగుళ్లపల్లిమండల బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరి కుమార్ విమర్శించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

జిల్లాలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి.

జిల్లాలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వెంకటేష్,రమేష్

కరీంనగర్ నేటిధాత్రి:

 

shine junior college

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యాహక్కు చట్టం మరియు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలుకై చర్యలు చేపట్టాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్ మచ్చ రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పనకు కృషి చేయలేదు.మరోపక్క విద్యార్థులు లేరనే సాకుతో రెండువేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది. అలాగే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విచ్చలవిడిగా పాఠశాలలను నెలకొల్పుతూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు. ఏఒక్క పాఠశాలల్లో కూడా చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కొరకు ఈ ఏడాదే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించి మరోపక్క యాజమాన్యాలు ముందుస్తు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికిని ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది.కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేషబోయిన రాము, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

 

 

నస్కల్ గ్రామంలో
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలను అందజేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలని దళిత బహుజన ఫ్రంట్(డిబీఎఫ్)జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్ డిమాండ్ చేశారు.
శుక్రవారం నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో డిబీఎఫ్ ఆధ్వర్యంలో విద్యా హక్కుల పరిరక్షణకై ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించి,విద్య హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠ్యపుస్తకాలలో మహనీయుల జీవిత చరిత్రను పొందపరచాలని ప్రభుత్వ కళాశాలలో కూడా చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విద్యారంగ సమస్యల సాధన కోసం డిబిఎఫ్ ఆధ్వర్యంలో పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు సత్యం రెడ్డి తో పాటు ఉపాధ్యాయ బృందము పిల్లలు పాల్గొన్నారు తదితరులు పాల్గోన్నారు.

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి…

ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని నియంత్రించాలి…

పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

 

 

 

 

 

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉండి, బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా కొనసాగుతున్నదనీ తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి బోనగిరి మధు డిమాండ్ చేశారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ను కలిసి విద్యారంగ సమస్యలపై పి డి ఎస్ యు ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ,విద్యార్థులు లేరనే సాకుతో మూసివేతకు గురవుతున్న పాఠశాలలకు లోతైన పరిశీలన చేసి మూసివేతకు గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మరోపక్క ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలిశాయనీ తమ ఇష్టానుసారం ఫీజులు దండుకుంటూ హంగు ఆర్భాటాలు చూపించే విధంగా కరపత్రాలు పట్టుకొని గ్రామాలపై దండయాత్ర వలె అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారనీ తెలిపారు.ఉన్నత అధికారులు ఫీజుల దోపిడిని నియంత్రించి, కార్పొరేటు,ప్రైవేటు అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.వివిధ రకాలుగా టై, బెల్టు, పాఠ్యపుస్తకాల పేరుతో వసూలు చేస్తున్న జీరో దందాను నిలువరించాలని, పేద,మధ్యతరగతి కుటుంబాల పిల్లల తల్లిదండ్రులను ఆర్ధిక భారం నుండి బయటపడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయ్,పట్టణ నాయకులు శేఖర్, దీపక్, సుందర్,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి.

ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి

విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందించిన పిడి ఎస్ యు నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విద్యాహక్కు చట్టంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలుకై చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారికి పిడి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా పిడి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.ఇప్పటికీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించలేకపోయారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి కృషి కూడా చేయడం లేదు.విద్యార్థులు లేరనే సాకుతో రెండువేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం పూనుకుంటుంది.అలాగే కార్పొరేట్,ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విచ్చలవిడిగా పాఠశాలలను నెలకొల్పుతూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు.విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోవడం లేదు.ఏ ఒక్క పాఠశాలల్లో కూడా చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% ఉచిత అడ్మిషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు.కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కొరకు ఈ ఏడాదే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని ప్రకటించి మరోపక్క యాజమాన్యాలు ముందుస్తు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికిని ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి నెలకొంది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడి ఎస్ యు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్,కార్తీక్,పాల్గొన్నారు.

స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి.

స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి

అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

భారత వ్యవసాయ రంగలో ఎం.ఎస్. స్వామినాథన్ సూచించిన సిఫారసులను అమలు చేసి, రైతాంగ, మరియు వ్యవసాయ రంగ పురోభివృద్ధికి కృషి చేయటంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈ నేపథ్యంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఎఐయుకెఎస్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న డిమాండ్ చేశారు.

శనివారం నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నర్సంపేట డివిజన్ ప్రధమ మహాసభ కత్తుల కొమురయ్య అధ్యక్షతన జరిగింది.

మహాసభలను జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి ప్రారంభించగా,
టియుసిఐ జిల్లా కార్యదర్శి అడ్డూరి రాజు, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహ రావు,జిల్లా అధ్యక్షులు ఆలువాల నరేష్ లు మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని తెలిపారు.

వ్యవసాయ రంగాన్ని ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్, పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, దేశ వ్యవసాయంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.

దేశంలోని రైతులు 100 రకాల పంటలు పండిస్తుంటే కేంద్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి కేవలం 14 రకాల పంటలకే అరకొర

దేశంలో అత్యధిక మంది రైతులు పండించే వరి ధాన్యానికి గత రేటు కంటే కేవలం 69 రూపాయలే పెంచి మద్దతు ధరలు పెంచామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి, మొలకలొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి కటింగులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నకిలీ ఎరువులు, పురుగుమందులు తయారు చేస్తున్న కంపెనీలను , అవి అమ్ముతున్న షాపులను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత రబీ సీజన్ ప్రారంభంలో రైతాంగానికి ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని, సకాలంలో బ్యాంకులు రైతులకు వడ్డీ లేని రుణాలను అందించాలని కోరారు.

రైతు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని, భారత వ్యవసాయ రంగంలో ఎమ్.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహాసభ ప్రారంభానికి ముందు ఎ.ఐ.యు.కె.ఎస్. జెండాను చంద్రన్న ఆవిష్కరించారు.

డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నిక.

డివిజన్ స్థాయి నూతన కమిటీని ఎన్నుకోగా 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.డివిజన్
అధ్యక్షులుగా కత్తుల కొమురయ్య, ఉపాధ్యక్షులు ధార లింగన్న , ప్రధానకార్యదర్శిగా గట్టి కొప్పు రవి,
సహాయ కార్యదర్శిగా మల్లేష్,
కోశాధికారిగా బాబురావు, సభ్యులుగా చొప్పరి పైడి, గణపాక సుదాకర్, సింగన బోయిన కట్టయ్య, కోళ్ల రాజులు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో గోపాల్, ఆలోచన, సమ్మన్న,రాధ, కోమల, మంజుల, స్వప్న, రాధిక ,సంజీవ, తిరుపతి, నర్సయ్య, వెంకన్న, రాజు, మల్లయ్య, కొమురయ్య, ఓం ప్రకాష్, శివలింగం, జంపయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

పెషా, 1/70 చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి..

ఆపరేషన్ కగార్ నిలుపు దల చేయాలి.

ప్రభుత్వాలు పార్లమెంట్ చట్టాలను కాపాడాలి…

ఏజెన్సీ లో ఆదివాసీలను భయబ్రాతులకు గురించి చేయకండి.

ఆదివాసీ సంక్షేమ పరిషత్, ములుగు జిల్లా అధ్యక్షులు, తాటి నాగరాజు.

నూగూర్ వెంకటాపురం
నేటి ధాత్రి / మే 1 ములుగు జిల్లా

 

 

వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం నాడు వెంకటాపురం మండలం కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా కొమరం భీం విగ్రహం దగ్గర ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో బొగ్గుల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు తాటి నాగరాజు గారు పాల్గొని మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రదేశాల్లో ఆదివాసీలు ఇల్లు కట్టుకొని నివాసాలు ఏర్పాటు చేసుకుని సహజసిద్ధమైన అడివిలో దొరికే పండ్లు కాయలు మందులు లేని వ్యవసాయం చేసుకో నీ పండిన టువంటి పంటలు తిని జీవితాన్ని గడుపుతున్న ఆదివాసీలు ఇప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు లను ఏరివేత పేరుతో తెలంగాణ రాష్ట్ర భూభాగంలో కర్రి గుట్టల ప్రాంతంలో కేంద్ర బలగాల తో కగా ర్ ఆపరేషన్, హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపించడం వలన ఎప్పుడు ఏమి జరుగుతుందో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కర్రీ గుట్టలో చేపట్టిన కగార్ ఆపరేషన్ ను నిలుపుదల చేసి ప్రశాంతమైన వాతా వ ర ణ నీ నెలకొల్పాలని తాటి నాగరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూగు రు వెంకటాపురం,వాజేడు మండలాలు భూభాగం ఛ త్తీస్ ఘడ్ రాష్ట్రం ఆనుకొని దట్టమైన అడవి గుట్టలు కొండలు కలిగి వి స్తీ ర్ణ మైన భూభాగం కలిగిన కర్రి గుట్టలు లో ఖనిజ సంపద కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని కార్పొరేట్ల కంపెనీల బడా బాబు లు ఆ దాని అంబానీ లకు దోచి పెట్టడానికి ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టం అడవి హక్కుల చట్టాలు ఎల్ టి ఆర్ 1/70 చట్టాలు పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలను ఉల్లంఘించి ఈ ప్రాంత భూభాగాన్ని కొల్ల గొట్ట డానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుందని తాటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా గౌరవ అధ్యక్షులు పీర్ల మల్లి ఖా ర్జు న్ రావు గారు శ్యామల వెంకటేశ్వర్లు బొగ్గుల సమ్మయ్య ఉ యి క గోపి శ్యామల వంశి కణితి శేషు సోడి సారయ్య శ్యామల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

కనీస వేతన సలహా మండలి తీర్మానాలను.!

కనీస వేతన సలహా మండలి తీర్మానాలను వెంటనే గెజిట్ చేసి అమలుపరచాలి

కొత్తగూడెం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేసిన ఏఐటియుసి నాయకులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల ప్రతిపాదనలను తక్షణమే గెజిట్ చేసి అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ముగ్దూమ్ భవన్ లో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కనీస వేతనాల సలహా మండలి సభ్యులు ఎండి.యూసుఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండి.అక్బర్ ఆలీ లు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులకు కనీస వేతనాలు పెరగక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని, యాజమాన్యాలు అర కోర వేతనాలు చెల్లించి శ్రమ దోపిడికి పాల్పడ్డాయి అని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు పెంచడానికి కనీస వేతనాల సలహా మండలిని ఏర్పాటు చేసి అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించారని, సోమవారం రోజున జరిగిన కనీస వేతనాల సలహా మండలి లో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని,కార్మికుల పర్వదినమైన మే 1 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి పంపించిన ప్రతిపాదనలను అంగీకరించి అధికారికంగా ప్రకటించాలని,రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గెజిట్ చేసి అమలు పరుచుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలు జీవో ప్రకారం వేతనాలను కాంట్రాక్టు & ఔట్సోర్సింగ్ కార్మికులు పొందుతున్నారని,వారికి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను ఆమోదించిన వెంటనే సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు ఉద్యోగ భద్రత,ఈఎస్ఐ, చట్టబద్ధమైన లీవులు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు అఫ్రోజ్ ఖాన్,యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ క్రిస్టోఫర్,కార్యవర్గ సభ్యులు దొడ్డిపట్ల రవీందర్ తదితరులు  పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.

ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి

సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా

పాలకుర్తి నేటిధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని స్థానిక తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 16 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, కొత్త పెన్షన్లు, ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం వల్ల ఒకే కుటుంబంలో ముగ్గురు కాపురాలు చేసే పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక సమస్యలైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ, వేసవికాలంలో త్రాగునీటి ఇబ్బంది ఏర్పడిందని రైతుల వరి పొలాలు ఎండిపోయాయని ఎండిన పంట పొలాలకు ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలన్నారు. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీరు అందించాలని, లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మదార్, బెల్లి సంపత్, మూస్కు ఇంద్రారెడ్డి, నాయకులు నక్క రమేష్, వేల్పుల కొమురయ్య, సోమ నరసయ్య, ఒగ్గుల కొమురయ్య, ఎల్లయ్య, చెరి పెళ్లి కొమురయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలి.!

ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలి
రెండవ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పి రిలే నిరాహార దీక్షలు
వర్ధన్నపేట,నేటిధాత్రి:
వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర బుధవారం రోజున ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నిరాహార దీక్షలు ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షులు ఎర్ర సంతోష్‌ మాదిగ అధ్యక్షతన రెండో రోజు కొనసాగడం జరిగింది . ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ జిల్లా సీనియర్‌ నాయకులు గోలి సుధాకర్‌ మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ఎస్సీల వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాలు ఎస్సీల వర్గీకరణ అమలైన తర్వాతనే ఈ ఉద్యోగ ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా లేని పక్షంలో పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉప కులాలను అన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో ముత్యాల మల్లేష్‌ మాదిగ ఎంఎస్పి వర్ధన్నపేట మండల అధ్యక్షులు , సినపెల్లి రాజు మాదిగ ఎమ్మార్పీఎస్‌ వర్ధన్నపేట మండల అధికార ప్రతినిధి , ముత్యాల నులేందర్‌ మాదిగ , సిలువేరు రాజు మాదిగ కడారి గూడెం గ్రామ అధ్యక్షులు , కంచర్ల రంజిత్‌ కుమార్‌ మాదిగ ఎమ్మార్పీఎస్‌ నాయకులు , బీరెల్లి నాగార్జున మాదిగ ఎమ్మార్పీఎస్‌ నాయకులు , పసునూరు సాయిలు మాదిగ తదితరులు పాల్గొన్నారు

దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి.

దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి.

దళిత హక్కుల పోరాట సమితి(డిహెచ్పిఎస్)జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్

కరీంనగర :నేటిధాత్రి

కరీంనగర్ జిల్లా డిహెచ్పిఎస్ కౌన్సిల్ సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా ఉపాధ్యక్షులు కెలపాక వినోద్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ ఈనెల 10,11,12 తేదీలలో వేములవాడలో జరుగు రాష్ట్రస్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ సంక్షేమం పేరిట గడిచిన ఏడు దశాబ్దాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టి ఎంతో గొప్పగా అమలు చేస్తున్నట్టు చెప్పినప్పటికీ ఈవర్గాల్లో వెనుకబాడుతనం పేదరికం పోలేదని ఇప్పటికీ సమాజంలో అత్యంత పేదరికం అనుభవించే వారే దళితులు అని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి మాట్లాడుతూ ప్రత్యేక చట్టాలు సదుపాయాలు సబ్ ప్లాన్ తదితర సౌకర్యాలు కల్పించామని చెప్తున్నప్పటికీ దళితుల బతుకులు మౌలికమైన మార్పు రావటం లేదని ఈవిషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల విద్య సామాజిక వికాసంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని అన్నారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్న అన్నారు
ఈనెల 10వ తేదీ నుండి వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మేధావులైనటువంటి దళిత ప్రొఫెసర్స్ వచ్చి రాష్ట్ర శిక్షణ శిభిరాలలో దళితులపై జరుగుతున్న దాడులు సమస్యలపై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈసమావేశంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి ఉపాధ్యక్షులు గంగాధర రఘు, కార్యదర్శి ఖండే ఎల్లయ్య, నాయకులు కొంకటి మొగిలి, చంచల భీమయ్య, రమేష్, మొగిలి, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.

టిడిపి తీర్థం పుచ్చు కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

టిడిపి తీర్థం పుచ్చు కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి03:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మరియు అభివృద్ధికి అందులోని మంచిని గ్రహించి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న అభివృద్ధిని మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న రొంపిచర్ల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రొంపి చెర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఇబ్రహీం ఖాన్ మండల వైస్ ఎంపీపీ నూలు రెడ్డప్ప మాజీ జెడ్పిటిసి చంద్రమ్మ భాస్కర్ రెడ్డి
రొంపిచెర్ల ఎంపీటీసీ రహిమాబీ , బండ కింద పల్లె సర్పంచ్ అన్సర్ బాష, రొంపిచర్ల వైస్ సర్పంచ్ శ్రీపతి,
జాండ్లా వారిపల్లి వైస్ సర్పంచ్ బాలాజీ,రొంపిచర్ల వార్డ్ మెంబర్లు నాగరాజా లక్ష్మయ్య మొదలైన వారు అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధికి ఆకర్షితులై ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజలను మరింత అభివృద్ధి చెందే విధంగా తమ వంతు కృషి చేస్తూ చల్లా రామచంద్రారెడ్డి నాయకత్వంలో పని చేస్తామని తెలియజేశారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version