200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు హిందీ ఉపాధ్యాయ..

200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు హిందీ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి.

రాయికల్, జూలై 30, నేటి ధాత్రి:

సర్దుబాటు, డిఫ్యూటేషన్, నియామకాల్లో, సర్దుబాటు, డిప్యూటేషన్స్ లలో 200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు, హిందీ, అన్ని సబ్జెక్టులకు పోస్టులు మంజూరు చేయాలని భూపతిపూర్ ఉన్నత పాఠశాల లో జరిగిన రాయికల్, మేడిపల్లి, భీమారం మండలాల హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం విరామ సమయంలో హిందీ ఉపాధ్యాయులందరు మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులుకు ప్రాతినిధ్యం చేసారు. కాంప్లెక్స్ సమావేశం ను సందర్శించిన మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసి పలు సమస్యలు దృష్టికి తీసుకపోయారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీ నీ ప్రవేశపెట్టి తెలుగు హిందీ పండితులను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణీ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, వసంతరావు, సయీద్ పాషా, జోంగోని రాజేశం, శంకరయ్య, నీలిమ, జంగిలి రాజేశం, కూరగాయల సురేష్, సుజాత, ధనలక్ష్మి, నారాయణ, రమేష్, గంగాధర్, మారుతి, నరహరి కాంప్లెక్స్ హిందీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అడిషనల్ కలెక్టర్కు గ్రామస్తుల వినతి….

అడిషనల్ కలెక్టర్కు గ్రామస్తుల వినతి

నిజాంపేట: నేటి ధాత్రి

ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించవద్దని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్ పై వేరొక పాఠశాలకు పంపించవద్దని గ్రామస్తులు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు బుధవారం వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉండగా నలుగురు టీచర్లు బోధన నిర్వహిస్తున్నారని డిప్యూటేషన్ పై ఇద్దరు టీచర్లను పంపిస్తే తమ పిల్లల చదువులు అర్థవంతం అవుతాయని డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వడ్ల ప్రవీణ్, కోమ్మిడి జీవన్ రెడ్డి, రాజు రెడ్డి, సౌడ స్వామి లు ఉన్నారు.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…

చందుర్తి నేటిధాత్రి:

ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..

గ్యాస్ సిలిండర్ లపై అదనంగా డబ్బులు వసూలు.

గ్యాస్ సిలిండర్ లపై అదనంగా డబ్బులు వసూలు

గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలి

బీఎస్పీ పార్టీ నాయకుల డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ డెలివరీ సమయంలో ఆన్లైన్లో బుక్ చేసిన రవాణ చార్జీల పేరుతో వినియోగదారుల నుండి అదనంగా 100 రూ” వరకు వసూలు చేస్తున్నారని (రిసిప్ట్ బిల్లు) అడుగుతే ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని వినియోదారులకు అందుబాటులో ఉంచకుండా కమర్షియల్ సిలిండర్లకు బదులు ఇండ్లలో వాడే సిలిండర్లను హోటల్స్ బేకరీ షాపులలో నిల్వ ఉంచుతూ ప్రజలకు సకాలంలో అందించకుండా ఇబ్బందులు గురిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని దళారులను గుర్తించి వారి లైసెన్సులు రద్దు చేసి ప్రజలను వారి బారి నుండి కాపాడాలని వారితో కుమ్మక్కైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం తదితరులు పాల్గొన్నారు

ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి అదనపు ఎస్పీ.

ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలి: అదనపు ఎస్పీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

అంగన్వాడీ టీచర్లకు ఫోక్సో చట్టంపై అవగాహన ఉండాలని సంజీవరావు అన్నారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలకు బాలికలపై లైంగిక దాడులు జరిగితే ఫోక్సో కేసుగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, హనుమంతు, డిసిపివో రత్నం పాల్గొన్నారు

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన.!

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

చిట్యాల నేటి ధాత్రి :

 

 

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిన్పర్తి గ్రామాన్ని గురువారం రోజున ఏ సి ఎల్ బి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని బేస్మెట్ లెవెల్ పనులను లబ్ధిదారులతో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఏ ఎంపీడీవో జయశ్రీ, ఎంపీ ఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో రేషన్ షాప్ లో జిల్లా కలెక్టర్ భీమ్యనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని సరిగ్గా అమలు అవుతుందా లేదా అని రేషన్ షాప్ కి వెళ్లి దగ్గరుండి బియ్యం నాణ్యతను పరిశీలించారు గ్రామంలో ప్రజలందరికి సన్న బియ్యం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని ఆరా తీశారు అలాగే క్రితం రేషన్ షాప్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే ప్రజలు వాటిని తినకుండా అమ్ముకోవడం జరిగిందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉన్నవారు సన్న బియ్యం తింటున్న క్రమంలో పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు వహించాలని షాప్ కు సంబంధించిన బోర్డులు ఫ్లెక్సీలు ప్రజలకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకపై సన్న బియ్యం పై ఎటువంటి అవక తవకలు జరిగిన రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version