హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..
దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి.
దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన పాఠశాలలకు పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే, ఈ వారంలో రాజధానిలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి.