ప్రభుత్వ స్కూళ్ల లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు
రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలో అమలు
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల గీతానగర్ బడిలో మొదలు
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 458 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జెడ్పి.హెచ్.ఎస్ లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. విద్యార్థులకు కట్టెల పొయ్యి పై ఆహార పదార్థాలు సిద్ధం చేయవద్దని సూచించారు. దీంతో వాతావరణ కాలుష్యం, ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. జిల్లాలోని 458 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం
గ్యాస్ స్టౌ పై సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధముగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌ లపై సిద్దం చేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా సిరిసిల్ల లోని గీతా నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రారంభించారు.