పాఠశాల లో నవోదయ పుస్తకాల పంపిణీ.

పాఠశాల లో నవోదయ పుస్తకాల పంపిణీ.

మరిపెడ నేటిధాత్రి

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురం ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ , తను పనిచేసే పాఠశాల లో తన సొంత డబ్బులతో (సుమారు 2000 రూపాయలు విలువచేసే) నవోదయ మెటీరియల్ ను విద్యార్థుల కు అందజేశారు, ఈ పుస్తకాల ను చిల్లంచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంద జయ చేతుల మీద విద్యార్థులకు అందజేయడం జరిగింది .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా నవోదయ సీటు సాధించేలా కృషి చేయాలని సూచించడం జరిగింది. నవోదయ సీటు సాధించిన విద్యార్థులకు నవోదయలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు, విద్యార్థులు కష్టపడి నవోదయ సీటు సాధించి మీ తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం లక్ష్మయ్య ,రాజేశ్వరి గణేష్, క్రాంతి , తదితరులు పాల్గొన్నారు

జవహర్‌ నవోదయ విద్యాలయంలో.

జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ ప్రకటన విడుదల

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా మామూనూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు 13 డిసెంబర్‌ 2025 నాడు ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుందని ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదువుతూ 2014 మే 1, నుండి 2016 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్హులు ఎంపిక పరీక్షకు అర్హులు అని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3,4వ తరగతులు చదివి ఉండాలని పేర్కొన్నారు.ఆసక్తి కలిగిన విద్యార్థులు జూలై 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో www.navodaya.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మిగతా వివరాలకు 94910 34552 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ బి. పూర్ణిమ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version