స్కూల్ బస్సు క్రింద పడి పాప శ్రీ హర్షిని మృతి..

స్కూల్ బస్సు క్రింద పడి పాప శ్రీ హర్షిని మృతి

* అన్నను బస్సు ఎక్కించడానికి వచ్చి చెల్ల మృతి

మహాదేవపూర్ జులై 30 (నేటి ధాత్రి)

 


జయశంకర్ భూపాలపెల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు పాప శ్రీహర్షిని బస్ కింద పడి మృతి చెందిన ఘటన మంగళవారం రోజున చోటుచేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు ఎస్ ఎస్ వి స్కూలు బస్సు అంబటిపల్లి గ్రామానికి వచ్చి స్కూల్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా అంబటిపల్లి గ్రామానికి చెందిన సింగనేని మల్లేష్, భాగ్య దంపతుల మూడేళ్ల కూతురు శ్రీ హర్షిని(3) తన అన్నను స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కళ్ళముందే పాప మృతి చెందిందని బస్సు డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు కోరారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

తల్ల……. రాక్షస?

తల్లీ? రాక్షసి? – 7 నెలల పాపను రూ.35 వేలకే అమ్మాలని ప్రయత్నం చేసిన మహిళ అరెస్టు!

అమెరికాలో ఒక తల్లి చేసిన పశువులాంటి చర్య ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. ఇండియానా రాష్ట్రానికి చెందిన మహిళ తన 7 నెలల పసిపాపను లైంగిక దాడికి విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటన తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.

32 ఏళ్ల మోర్గన్ స్టాప్ అనే మహిళ… ఒక గుర్తు తెలియని వ్యక్తికి తన పాపను లైంగికదాడికి అనుమతిస్తూ రూ.35,000 (అమెరికాలో కరెన్సీలో సుమారు 400 డాలర్లు)కి Snapchat ద్వారా ఒప్పందం చేయాలని ప్రయత్నించింది.
ఆమె మేసేజ్‌లో: “ఇప్పుడే అరటి పోతు చెల్లించండి, మిగతా మొత్తం తర్వాత ఇవ్వండి” అనే డీల్ పెట్టినట్లు తెలిసింది.

Snapchat ద్వారా కుట్ర బహిర్గతం
ఈ డీల్‌ను Snapchat‌లోని యాంటీ అబ్యూస్ సిస్టమ్ గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న FBI అధికారులు 10 రోజుల్లోనే ఆమె ఇంటిపై దాడి చేసి విచారణ చేపట్టారు.

తప్పించుకునే ప్రయత్నం విఫలం
మోర్గన్ స్టాప్ విచారణ సమయంలో తనకు Snapchat ఖాతా లేదని బుకాయించినప్పటికీ, సాంకేతిక ఆధారాలు స్పష్టంగా చూపించడంతో ఆమెపై Attempted Child Sex Trafficking అనే Level 2 Felony కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఆమె జైలులో కదలలేని పరిస్థితిలో ఉంది. కేసు విచారణ కొనసాగుతోంది.

సమాజంలో అలజడి
ఒక తల్లి తన సొంత బిడ్డను ఇలాంటి ఘాతుకానికి అమ్మేంత నిష్ఠురంగా మారడం పై మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ముగింపు:
ఇలాంటి దారుణాలకు సమాజంలో స్థానం ఉండకూడదు. చట్టం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్‌లో తెలియజేయండి.
ఇంకా ఇలాంటి నిజ జీవిత వార్తల కోసం మా చానెల్‌ను ఫాలో అవ్వండి.

శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలి.

శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలి.

చిట్యాల నేటి ధాత్రి :

 

 

 

చిట్యాల మండలం లోని చల్లగిరిగే నాలుగు 5వ కేంద్రం తనిఖీ చేసి ఏడవ నెల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఇవ్వవలసిన అదనపు ఆహారము వ్యాధినిరోధక టీకాలు వ్యక్తిగత శుభ్రత పిల్లలకి ఇవ్వాల్సిన మంచినీరు బయట తినుబండారాలు తినిపించరాదని తల్లులకు వారి అత్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి బరువులు తీసి వయసులవారిగా ఉండాల్సిన బరువు ఎత్తు గురించి వివరించి రెండు నెలల బాలింత ఇంటికి గృహ సందర్శన చేసి బాలింతకు ఇవ్వాల్సిన ఆహారము శుభ్రత పాపకు కేవలం తల్లి పాలు తాగించాలని ఇతర పానీయాలు తాగించవద్దని కాటన్ బట్టలు ధరించాలని బాలింత మొబైల్ వాడకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా సమతల హారము భుజిస్తూ ఆరు నెలల వరకు తల్లి పాలే తాగించాలని కుటుంబ సభ్యులందరికీ అవగాహన కల్పించనైనది అంగన్వాడీ టీచర్సు కరుణ కవిత ఆయా హాజరైనారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version