వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ..

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-51.wav?_=1

మండలంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు, వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారి సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఎరుకుల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, మాజీ ఎంపిటిసి ఏడాకుల రవిందర్, మామిండ్లవీరయ్యపల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి అతిధులుగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని తమ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపించిన వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు కూనమల్ల రాజన్ బాబు ,విద్యార్థులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం..

ఉచిత వైద్య శిబిరం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉచిత వైద్య శిభిరం కార్యక్రమాన్నీ” ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్ మరియు ఝరాసంగం మండల పెద్దల చేతుల మీధుగా ప్రముఖ “హోలీస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఝరసంగం మండల కేంద్రంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థోమలాజీ, ఇంటర్నల్ మెడిసిన్ తో పాటు ఈసిజీ, ఆర్థో, కంటి, బిపి, డయాభైటిక్ షుగర్ తదితర పరీక్షలు అంధుబాటులో ఉన్నయి.

పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి.

పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద ప్రైవేటు పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు 25% ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్ 12 (1) సి విద్య హక్కు చట్టం ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని రాశారు కేంద్ర ప్రభుత్వం 2009 నుండి అమలులోకి తేవడం జరిగింది ఈ విద్య హక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేటు పాఠశాల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు కట్ల శంకరయ్య దూడపాక దుర్గయ్య అంబేద్కర్ వాదులు ఇమ్మడి వెంకటేశ్వర్లు దూడపాక శ్రీనివాస్ మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి సైదుల్ గడ్డం సదయ్య చిలువేరు దయాకర్ ఊరడి మురళి రత్నం రామకృష్ణ శనిగరపు ఆనందం ఎండి లాలు పాల్గొన్నారు

ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్‌ స్టిక్స్, వీల్‌ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జులై 5 వరకు దరఖాస్తు గడువు ను ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. అర్హులైనవారు టీజీఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.

ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.

మెట్ పల్లి జూన్ 20 నేటి ధాత్రి:

మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఘనంగా జరిగింది.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మెట్పల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం రేకుర్తి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చే కంటి పరీక్షలు చేశారని దాదాపు 300 మంది కంటి వైద్య శిబిరానికి హాజరైనారు .
ఇందులో 50. మందికి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి లయన్స్ క్లబ్ నుండి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి రేకుర్తి హాస్పిటల్కు పంపించడం జరిగిందని అక్కడ ఆపరేషన్ చేసి అనంతరం తిరిగి ఆత్మకూర్ గ్రామం కు ఉచితంగానే బస్సులో తీసుకు వస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకొని లబ్ధి పొందాలని అదేవిధంగా సంవత్సరం ఆరు సార్లు కంటి వైద్య శిబిరం రెండుసార్లు గుండె వైద్య శిబిరం చేస్తామని ఇటీవల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని పట్టణ గ్రామీణ ప్రజలు అత్యధిక మంది సద్వినియోగం చేసుకున్నారని ప్రభుత్వ పాఠశాలలో గాని హాస్టల్లో గాని ఇతర పేదవారికి ఫుట్పాత్ వ్యాపారులకు అంబ్రెల్లాల్సు లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా అందిస్తుందని పట్టణ గ్రామీణ ప్రజలు లయన్స్ క్లబ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్ క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, వెల్ముల శ్రీనివాసరావు, మర్రి భాస్కర్,ఆల్ రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య.

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య అందించాలి

బహుజన స్టూడెంట్స్ యూనియన్(బి ఎస్ యు)

ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

శాయంపేట నేటిధాత్రి:

shine junior college

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్రికా& ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్యఅందించాలి నేడు ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బి ఎస్ యు) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వా లు మారిన పత్రికా విలేకరు లకు ఇచ్చిన హామీలు ఏ ప్రభు త్వం నెరవేర్చ లేకపోతుంది సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికా విలేకరుల పిల్లల కు ఉచిత విద్య అందించలే కపోవడం చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్య ఆoదించాలి అని ప్రత్యేకమైన జీవో ఏర్పా టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేసిన ఎంపీడీఓ ఎమ్ ఈ ఓ.

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేసిన ఎంపీడీఓ ఎమ్ ఈ ఓ

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకములు మరియు యూనిఫామ్స్ ఎంపీడీఓ సురేష్ మండల విద్యాధికారి హరిప్రసాద్ లు విద్యార్థిని విద్యార్థులకు అందచేశారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాదేవి, డిపిఎం నాగేశ్వరరావు, ఏపిఎం పద్మ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

హఫీస్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మాయం.

హఫీస్ పేట్ డివిజన్ మొత్తం సమస్యల మాయం……..

బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్ మరియు వాహనాలు పోయే పరిస్థితి అక్కడే లేవు మరియు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యలమైయం అయ్యింది అన్ని అన్నారు.ఈ యొక్క సమస్యలను అధికారులుగాని,నాయకులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు.ఇకనైనా నాయకులు,అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచైయండి అన్ని అన్నారు.లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి.

“ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి”

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

 

బాలానగర్ మండలంలోని అమ్మపల్లి, అప్పాజీపల్లి, బోడగుట్ట తండా, గౌతాపూర్ గ్రామాలలో సోమవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని.. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను ప్రతి నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా ఈ వ్యాధులు తప్పవు.

7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా ఈ వ్యాధులు తప్పవు…

చాలా మంది 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతుంటారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

Sleeping Disorder: నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది శరీరం, మెదడు రెండింటికీ విశ్రాంతినిస్తుంది. కణాలను పునరుద్ధరిస్తుంది. వివిధ శారీరక, మానసిక విధులను మెరుగుపరుస్తుంది. తగినంత నిద్రపోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సాధారణంగా 7-8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే, కొంత మంది మాత్రం 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతారు. అయితే, ఇలాంటి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బుల ప్రమాదం:

నిద్ర లేమి వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. నిద్ర లేమి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది ధమనులలో వాపుకు కారణమవుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ ప్రమాదం

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. నిద్రలేమి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అంటే మీ కణాలు ఇన్సులిన్‌కు తక్కువ ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోండి.

నిద్ర లేమి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిరాకు, ఒత్తిడి పెరగడం, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి, ఎన్ని పనులున్నా 7-8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.

బలహీనమైన రోగనిరోధక శక్తి, ఊబకాయం

నిద్రలేమి కారణంగా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. ఇది ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, నిద్రలేమి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణమవుతుంది. కాబట్టి, రోజు 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.

సిరిసిల్లలోని పేర్టీ నైన్ ఉచిత క్యాంపు.

సిరిసిల్లలోని పేర్టీ నైన్ ఉచిత క్యాంపు

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తారకరామ హాస్పిటల్ లో పేర్టీ నైన్ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ఇతర గ్రామాల ప్రజలు అందుబాటులో ఉండే విధంగా సిరిసిల్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తారకరామ హాస్పిటల్ మేనేజ్మెంట్ దొంతుల రమేష్ తెలియజేశారు. అంతేకాకుండా పేర్టీ నైన్ హాస్పిటల్ సంస్థ హైదరాబాద్ వారు పాల్గొని ఉచిత క్యాంపును విజయవంతం చేయడం జరిగినది.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండలం పోతారం గ్రామం లో శ్రీ విరాజ్ హస్పిటల్ పేద్దపల్లి అద్వర్యం లో ఉచ్చిత వైద్య శిబిరం నిర్వయించారు
ఈ వైద్య శిబిరం లో డాక్టర్ రాజ్ కుమార్ దంత వైద్యులు ( మేనేజింగ్ డైరేక్టర్ ) డాక్టర్ చంద్రకుమార్ జనరల్ పిజిషన్
సదానందం మేనేజ్ మేంట్
రాజు మేనేజ్ మేంట్ మరియు మార్కేటింగ్ పాల్గోని గ్రామస్తులకు వైద్య పరిక్షలు నిర్వయించి ఉచితంగా మందులు పంపిణి చేసారు వైద్యులను మాజీ సర్పంచ్ నేత్తేట్ల మహేందర్ మరియు గ్రామస్తులు షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బందీ గ్రామస్తులు యూత్ సబ్యులు పాల్గోన్నారు

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన.!

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ కాలనీలోని శ్రీకృష్ణవేణి హైస్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు బత్తిని దేవన్న తెలిపారు.15 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహించబోతున్నమన్నారు.
ఈ సమ్మర్ క్యాంపులో కరాటే, యోగా,పబ్లిక్ స్పీకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్,క్లే పోటరీ వంటి పాఠ్యేతర కార్యకలాపాలు ప్రతిరోజూ ఉదయం 7:00నుండి 9:00 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ..ఈ రోజులలో విద్యార్థుల అభివృద్ధి పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా వారిలో స్వీయనమ్మకం,ఏకాగ్రత, ఆత్మనియంత్రణ,వ్యక్తిత్వ వికాసం వంటి లక్షణాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది.కరాటే మరియు యోగా శారీరక ధైర్యం,మానసిక ఓర్పు పెంచుతాయి.ఇవి విద్యార్థులకు బౌద్ధిక స్థితి సమతుల్యతను అందిస్తూ, వారి ఒత్తిడిని అధిగమించేలా చేయగలవు.

క్యాంపు సమన్వయకర్త, సబ్జెక్టు నిపుణులు బత్తిని రాకేష్

సమ్మర్ క్యాంప్ ఏర్పాటుచేసిన సందర్భంగా మాట్లాడుతూ..

Free Summer Camp

 

ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు తమ లోకజ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవచ్చు.అలాగే ఈ తరహా కార్యక్రమాలు వచ్చే విద్యాసంవత్సరంలోనూ శ్రీకృష్ణవేణి హై స్కూల్ తరఫున కొనసాగించబడతాయని వారు తెలిపారు.ఈ ఉచిత సమ్మర్ క్యాంపు కోసం నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని తమ పిల్లల భావి ప్రగతికి బలమైన పునాది వేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ కాలనీలోని శ్రీకృష్ణవేణి హైస్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు బత్తిని దేవన్న తెలిపారు.15 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహించబోతున్నమన్నారు.
ఈ సమ్మర్ క్యాంపులో కరాటే, యోగా,పబ్లిక్ స్పీకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్,క్లే పోటరీ వంటి పాఠ్యేతర కార్యకలాపాలు ప్రతిరోజూ ఉదయం 7:00నుండి 9:00 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ..ఈ రోజులలో విద్యార్థుల అభివృద్ధి పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా వారిలో స్వీయనమ్మకం,ఏకాగ్రత, ఆత్మనియంత్రణ,వ్యక్తిత్వ వికాసం వంటి లక్షణాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది.కరాటే మరియు యోగా శారీరక ధైర్యం,మానసిక ఓర్పు పెంచుతాయి.ఇవి విద్యార్థులకు బౌద్ధిక స్థితి సమతుల్యతను అందిస్తూ, వారి ఒత్తిడిని అధిగమించేలా చేయగలవు.

క్యాంపు సమన్వయకర్త, సబ్జెక్టు నిపుణులు బత్తిని రాకేష్

సమ్మర్ క్యాంప్ ఏర్పాటుచేసిన సందర్భంగా మాట్లాడుతూ..ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు తమ లోకజ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవచ్చు.అలాగే ఈ తరహా కార్యక్రమాలు వచ్చే విద్యాసంవత్సరంలోనూ శ్రీకృష్ణవేణి హై స్కూల్ తరఫున కొనసాగించబడతాయని వారు తెలిపారు.ఈ ఉచిత సమ్మర్ క్యాంపు కోసం నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని తమ పిల్లల భావి ప్రగతికి బలమైన పునాది వేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత శిక్షణ ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వేసవి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు ప్రధానోపాధ్యాయురాలు ఏ.భద్రమ్మ తెలిపారు.

 

Students

ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఈ నెల 19 వరకు నిర్వహించబడుతుందని చెప్పారు.ఈ శిక్షణ కార్యక్రమంలో డ్రాయింగ్, డాన్స్ క్రాఫ్ట్ కరాటే, గేమ్స్ మరియు స్పోర్ట్స్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పలు శిక్షణలు ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులుజ్ మాజీ సర్పంచ్, గ్రామ కార్యదర్శి దేవేందర్,ఉపాధ్యాయులు కృపాల్,దేవేందర్,తాజుద్దీన్,కిషన్, పద్మశ్రీ,వాలంటీర్స్ పాల్గొన్నారు.

ఉచితంగా వైద్య శిబిరం.

ఉచితంగా వైద్య శిబిరం

నిజాంపేట ,నేటి ధాత్రి

 

 

నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయాలని ఉద్దేశంతో జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ ఉమెన్స్ చైల్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిజాంపేట మండలం నస్కల్ లో ఏర్పాటు చేశారు. నిజాంపేట, రామాయంపేట ఉమ్మడి మండల కు సంబంధించి ఆర్ఎంపి పి.ఎం.పి యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు. బిపి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి అలాగే ఉచిత మందులను అందించి ఆర్.ఎం.పి డాక్టర్లకు సిపిఆర్ గురించి వివరించారు.

భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం.

భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం..

ధరణితో 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన భూ చట్టం.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

భూ భారతి చట్టంలో మొత్తం 23 సెక్షన్స్.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

1971-72 సంవత్సరంలో భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు పట్టాలు ఇచ్చినాం.2005 లో మరిన్ని భూ సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సాదాబైనామ ద్వారా భూ చట్టాల ప్రకారం రైతులకు పాస్ బుక్ లు ఇచ్చింది.గత ప్రభుత్వం కొత్త చట్టం చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు సరైన న్యాయం హక్కులు కలుగలేదు.ఈ నేపథ్యంలో గ్రామస్థాయి నుండి పూర్తి స్థాయిలో భూముల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంది నిపుణులతో అధ్యయనం చేసి నూతన భూ భారతి చట్టాన్ని రూపొందించిందని దీంతో భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దదానికి ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంతో అమల్లోకి తెచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా భూ భారతి చట్టం పట్ల నర్సంపేట మండలంలోని రైతులకు రెవెన్యూ శాఖ,వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు.ముందుగా వరంగల్ రోడ్డు కూడలి నుండి రైతు వేదిక వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన కొద్ది రోజులకే పూర్తిస్థాయిలో గ్రామస్థాయి నుండి అన్ని రకాల సమస్యలు పరిష్కారం కోసం 90 రోజుల సమగ్ర సర్వే జరిపామన్నారు.ధరణి ఫోర్టర్ లో రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయని సర్వేలో తేలిందని పేర్కొన్నారు.అందరికీ సరైన న్యాయం జరిగేందుకు గాను నిపుణులతో తయారుచేసి భూ భారతి చట్టం రూపాంతరం చెందిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ఫోర్టల్ తో భూ చట్టం 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని ఆరోపించారు.నర్సంపేట మండలంలో 17 వేల ఎకరాల భూమి ఉండగా ఇప్పటివరకు 14600 ఎకరాలకు భూమి పట్టాలు ఇచ్చామని, నేపపద్యంలో మరో మూడు వేల పట్టాలు ఇవ్వాల్సి ఉన్నదని కాగా ప్రస్తుతం 4 వేల దరఖాస్తులు వచ్చాయి.ఈ భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను అవలీలగా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భూముల పట్ల గ్రామాల సమస్యలను గ్రామాల్లోనే సదస్సులు నిర్వహించి పరిశీలన చేసి అక్కడే సమస్యలు పరిష్కారం చేస్తామని వివరించారు. 80 శాతం భూ సమస్యలు మండల స్థాయి ఎమ్మార్వో వద్ద పరిష్కారం అవుతాయని లేని యెడల ఆర్డీఓ,లేక కలెక్టర్ వద్ద తప్పనిసరిగా పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భూ భారతి చట్టం వలన భూముల సమస్యలు భూ తగాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు వివరించారు.

భూ భారతి చట్టంలో మొత్తం 23 సెక్షన్స్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంలో రైతుల సమస్యలు పరిష్కారం చేయడానికి మొత్తం 23 సెక్షన్స్ ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.మొత్తం 23 సెక్షన్ల భూ భారతి నూతన చట్టంపై
రైతులకు కలెక్టర్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఉన్న భూ చట్టం వలన రైతులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు జరుగకుండా ఉండేందుకు గాను భూ భారతి చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు.భూమి అనేది ప్రతీ ఒక్కరికీ ముఖ్యమైనది. దానికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఎలాంటి భూముల సమస్యలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటలిజెంట్ తో పెట్టిన చాట్ బాట్ ద్వారా సమస్య అవలీలగా పని పూర్తి అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి,ఆర్డీఓ ఉమారాణి,ఎమ్మార్వో రాజేష్,మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్,ఏఈఓలు అశోక్ కుమార్, శ్యాం కుమార్, టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణోతు లక్ష్మణ్ నాయక్,మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్,నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజేందర్,మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు.

బసవ దళ్ వారి ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు పట్టణం లోని బసవ మంటప్ లో జరిగిన ఉచిత హెల్త్ క్యాంపు ,రక్త దాన శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు, రక్త దానం చేయడం ఒక పుణ్య కార్యం అని ,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు,
అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ శేరి , సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ,తులసి దాస్ ,సందీప్ రాజ్ , నగేష్ ,రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్.!

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్

జైపూర్,నేటి ధాత్రి:

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫ్రీ క్యాన్సర్ టెస్ట్
తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడితే జిల్లాస్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం.!

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం- 7 వ రాష్ట్రీయ పోషణ పక్షం

 

నడికూడ,నేటిధాత్రి:

స్వాతి సిడిపిఓ అధ్యక్షతన పరకాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో జాతీయ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి హాజరై మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాలు మొదటిది ఆరోగ్య లక్ష్మి, రెండవది ప్రీస్కూల్,మూడోది లోపోషణతో బాధ పడే పిల్లల పోషణస్థితిని మెరుగుపరిచే విధంగా అంగన్వాడి టీచర్స్ పని చేయాలని సూచించారు. పోషణ పక్షంలో భాగంగా ఏప్రిల్ 8 నుండి 22 వరకు ప్రతి గ్రామంలో పోషణ కార్యక్రమాలు నిర్వహించి పోషణ లోపం లేని సమాజం నిర్మించేలా కృషి చేయాలన్నారు.గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే ఒక్కపూట భోజనం సద్వినియోగం చేసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకుంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారన్నారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు శ్రీమంతాలు,6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసనలు,అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న
చిన్నారులకు గ్రాడ్యుయేషన్
డే,చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ టి. విజయలక్ష్మి,నడికూడ తహసిల్దార్ నాగరాజు, నడి కూడ మండల వైద్యాధికారి కే దివ్య,ఎంపీడీవో నడికూడ విమల,సఖి అడ్మిన్ హైమావతి,పోషణ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ సుమల డిహెచ్ఈడబ్ల్యు కోఆర్డినేటర్ కళ్యాణి,ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, హేమలత,పుణ్యవతి,రోజా రాణి,మంజుల,సునీత,రాణి, నజీమ,పర్వీన్,ఉమాదేవి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ బిక్షపతి,జిల్లా బాలల పరిరక్షణ విభాగం విజయకుమార్,అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్,గర్భిణీ స్త్రీలు,పిల్లలు మొదలగు వారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version