కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు
మందమర్రి నేటి ధాత్రి
ఈరోజు మందమర్రి ఏరియా హాస్పిటల్, సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల, కళ్యాణికని యందు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వారికి రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయి, శారీరక బలహీనత తదితర విషయాలపై పరీక్షలు చేపట్టారు. పరీక్షల అనంతరం, బ్లడ్ తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికీ అవసరమైన ఔషధాలు, విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా, ముందస్తు వైద్య జాగ్రత్తలతో కూడినదిగా ఏర్పాటుచేయబడింది. పిల్లల ఆరోగ్యం పట్ల సింగరేణి సంస్థ చూపుతున్న చొరవకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపక వర్గం, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.