అధిక ధరలకు ఎరువులు అమ్మిన దుకాణం సీజ్ చేసిన..

అధిక ధరలకు ఎరువులు అమ్మిన దుకాణం సీజ్ చేసిన పి.కలెక్టర్ ప్రావిణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి కొహీర్ మండల పోతిరెడ్డిపల్లి గ్ గ్రామంలో డిసిఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేసారు.ఈపాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు.అనంతరం ఒక  రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఎరువులను అధిగ ధరకు ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఏఓ కు కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు.

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…

నేటి ధాత్రి -గార్ల :-

ఎరువులు అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకొంటామని ఎంతటి వారైనా ఉపేక్షించ బోమని మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ వ్యవసాయ అధికారి అజ్మీరా శ్రీనివాస్ రావు ఎరువుల డీలర్లను ను హెచ్చరించారు.శుక్రవారం గార్ల మండల పరిధిలోని పుల్లూరు మరియు గార్ల లో పలు ఎరువుల దుకాణం లను మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు తో కలిసి తనిఖీ చేపట్టారు.స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్,ఇన్వాయిస్ లు, ఈపాస్ మెషిన్స్ క్షుణ్ణంగా పరిశీలించినారు.రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎరువులను సాఫీగా పంపిణీ చేయాలని డీలర్స్ ను కోరారు.ఎరువులు జిల్లా లో సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మోతదు కు మించి రసాయన ఎరువులు వాడవద్దని రైతులకు సూచించారు.ఎరువులు అమ్మకం లో అక్రమాలకు పాల్పడితే సంబందించిన ఎరువుల లైసెన్స్ రద్దు చేస్తామని హేచ్చరించినారు.

ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…

ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…

పాకాల యేటి పై హైలెవల్ బ్రిడ్జినిర్మాణం ఇంకెప్పుడు..?

ప్రాణాలు పోతున్న పట్టించుకోరా..?

ఎన్నికల హామీగానే మిగిలిపోయిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం…

కట్టెబోయిన శ్రీనివాస్ సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-74.wav?_=1

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

మండల పరిధిలోని రాంపురం పరిసర ప్రాంతంలో గల పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పాలకులకు ఎన్నికల అప్పుడు హామీలకే పరిమితమైపోయిందని సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు కట్టే బోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం గార్ల మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాథుడే లేడా అని అన్నారు.ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ద, ప్రజా సమస్యల పై ప్రజా ప్రతినిధులకు సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటి నుండి నాలుగు నెలలపాటు ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న, ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడిన మండల కేంద్రానికి సకాలంలో వైద్యం కొరకు కానీ, విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.విద్యార్థులు తమ విద్యను అభ్యసించాలన్న, రైతాంగం తమ పంటలకు అవసరమయ్యే పరికరాలు మందులు తీసుకొని రావాలన్న చుట్టూ 30 నుండి 40 కిలోమీటర్లు తిరిగి మండల కేంద్రానికి రావలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దూరపు ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో పాకల యేటి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మండల కేంద్రంకు రావాలని అన్నారు.వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లాలన్న చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని,ఇంకా ఎన్నాల్లు ఈ ప్రాంత కష్టాలు? ప్రజల ఓట్లు దండుకోవడానికి వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం ప్రజా సమస్య అయినటువంటి పాకాల ఏటిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోతున్నారని అన్నారు.ఇప్పటికైనా ఈ ప్రాంతం నుండి గెలిచిన ఎమ్మెల్యే,ఎంపీలు ప్రత్యేక శ్రద్ధచూపి హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు.

వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విజ్డం హై స్కూల్ విద్యార్థులు

రాయికల్: జూలై 19: నేటి ధాత్రి:

పట్టణం లోని విజ్డం హై స్కూల్ విద్యార్థులు మూడవ శనివారం నో బ్యాగ్ డే స్పెషల్ ప్రోగ్రాం లో భాగంగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. రైతులతో కలిసి వరి నాటు వేసే విధానాన్ని అడిగి తెలుసుకొని, రైతులతో పాటు నాటు వేశారు, పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి పిల్లలతో పాటు పొలంలో దిగి నాటు వేసి, చిన్ననాటి జ్ఞాపకాలను, రైతుల యొక్క కష్టాన్ని, రైతు విలువను విద్యార్థులకు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే, మనకు అయిదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయని,వరి పంట చేతికి రావాలంటే 120 రోజుల శ్రమ, కష్టం ఉంటుందని, వాటిని గుర్తుంచుకుని ఆహారాన్ని వృధా చేయకుండా, తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోకుండా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు తద్వారా దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ నివేదిత రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు..

కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు

మందమర్రి నేటి ధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-27.wav?_=2

ఈరోజు మందమర్రి ఏరియా హాస్పిటల్, సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల, కళ్యాణికని యందు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Medical examinations

ఈ పరీక్షలలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వారికి రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయి, శారీరక బలహీనత తదితర విషయాలపై పరీక్షలు చేపట్టారు. పరీక్షల అనంతరం, బ్లడ్ తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికీ అవసరమైన ఔషధాలు, విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు.

Medical examinations

ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా, ముందస్తు వైద్య జాగ్రత్తలతో కూడినదిగా ఏర్పాటుచేయబడింది. పిల్లల ఆరోగ్యం పట్ల సింగరేణి సంస్థ చూపుతున్న చొరవకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపక వర్గం, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్

సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో 10వ తరగతి పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బి గీతే, ఎమ్మెల్సీ అంజి రెడ్డిలతో కలిసి సైకిళ్ళు పంపిణీ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ విద్యా, వైద్యం రూపంలో రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మోడీ గిఫ్ట్ పేరిట 10వ తరగతి చదివే బాల బాలికలకు ఉచితంగా సైకిల్ అందిస్తున్నామని అన్నారు.
విద్యార్థులకు మొదటి ఆస్తి సైకిల్ అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని సైకిల్స్ అందించామని అన్నారు.నాణ్యమైన సైకిల్ అందిస్తున్నామని, వీటిని వినియోగించి విద్యార్థులు సకాలంలో తరగతి గదులకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Bandi Sanjay

రాబోయే సంవత్సరాలలో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ కింద సైకిల్స్ అందిస్తామని అన్నారు. ఎల్.కే.జి నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు మోడి కిట్స్ పేరిట బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర సామాగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు వివిధ పనులపై వచ్చినప్పుడు వారితో చర్చించి సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
చిన్నతనంలో గంటకు 15 పైసలు, 40 పైసలు కిరాయి తెచ్చుకొని సైకిల్ నడిపేవారిమని కేంద్రమంత్రి గుర్తు చేసుకున్నారు. సైకిల్స్ వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు. చిన్నతనం నుంచి అనేక ఇబ్బందులు గురైనప్పటికీ బాబా సాహెబ్ అంబేద్కర్ బాగా చదువుకొని దేశానికి రాజ్యాంగం రచ్చించే స్థాయికి ఎదగారని అన్నారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ నిబద్ధతతో పని చేస్తున్నారని అన్నారు. యూ.పి. రాష్ట్రానికి చెందిన కలెక్టర్, మహా రాష్ట్ర కు చెందిన ఎస్పీ క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికతో కృషి చేయడం వల్ల గొప్ప స్థాయికి ఎదిగామని అన్నారు. విద్యార్థులు ఉదయం సమయంలో చదువుకోవాలని, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.

Bandi Sanjay

విద్యార్థులు పట్టదలతో పని చేస్తుందని, 2014 కంటే ముందు విద్య కోసం 68 వేలకోట్లు కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం ప్రస్తుతం 1,25,000 కోట్లు ఖర్చు చేస్తుందని, ఏకలవ్య పాఠశాలలు నవోదయ పాఠశాలలు సైనిక్ స్కూల్స్ క్రమశిక్షణకు మారుపేరుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. రోడ్డుపై సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని , ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, 20 రోజుల తర్వాత సర్వీసింగ్ చేసుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు సైకిల్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. చిన్నతనంలో సర్వ శిక్షా అభియాన్ లో చదువుకునే రోజుల్లో తాను పడిన ఇబ్బందులు విద్యార్దులకు ఉండవద్దని బహుమతిగా సైకిల్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థులు బాగా చదువుకోవాలని, మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్సీ తెలిపారు. మోడీ గిఫ్ట్ పేరిట అందిన సైకిల్స్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, రోడ్డు పై జాగ్రత్తగా నడపాలని అన్నారు. ఎస్.ఆర్. ట్రస్ట్ తరపున విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకునేందుకు వీలుగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు.

Bandi Sanjay

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సిరిసిల్ల జిల్లాలో 4 వేల సైకిళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. రక్త విద్యా సంవత్సరం సిరిసిల్ల జిల్లాలో 10 వేల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ తెలిపారు.
ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ,విద్యార్థులకు ఎంపీ మంచి సైకిల్స్ అందించారని, వర్షా కాలంలో రోడ్లు స్కిడ్ అధికంగా అవుతాయని, విద్యార్థులు జాగ్రత్తగా నడపాలని అన్నారు. అనంతరం కాలేజీ గ్రౌండ్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ ని జెండా ఊపి ప్రారంబించి కొంత దూరం సైకిల్ సవారీ చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఇన్చార్జి డిఈఓ వినోద్ కుమార్, స్థానిక నాయకులు, విద్యార్థులు, ప్రజలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..

అర్ధరాత్రి ఆర్డర్లూ అధికమే..

ఆన్‌లైన్‌(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్‌ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది.

– గతేడాదితో పోలిస్తే ఎక్కువే

హైదరాబాద్‌లో పాలకు డిమాండ్‌

 

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్‌ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది. సంస్థ అధ్యయనం ప్రకారం గడిచిన తొలి ఆరు నెలల్లో ఒక వ్యక్తి ఏకంగా 617కు పైగా ఆర్డర్లు చేశాడు. నగరంలో పాలకు అత్యధిక డిమాండ్‌ ఉంది. ఎలక్ట్రానిక్స్‌, బొమ్మలు, వ్యక్తిగత సంరక్షణ విభాగాలు 117 శాతం వృద్ధితో దూసుకుపోతున్నాయి.

ఇడ్లీ, దోశ పిండి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. బ్యూటీ విభాగంలో లిప్‌ లైనర్లు(Lip liners), మినీ లిప్‌స్టిక్‌లు, లిప్‌ బామ్‌లకు డిమాండ్‌ ఉంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వంటనూనె, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువులకు, స్నాక్స్‌ విభాగంలో ఇన్‌స్టంట్‌ న్యూడిల్స్‌(Instant noodles)కు డిమాండ్‌ పెరిగిందని సంస్థ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ హరి కుమార్‌జీ తెలిపారు. సగటు డెలివరీ సమయం 11 నిమిషాలుగా ఉందన్నారు.

గురిజాల హైలెవల్ బ్రిడ్జి వంతెనకు శంకుస్థాపన చేసిన.

గురిజాల హైలెవల్ బ్రిడ్జి వంతెనకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి

హర్షం ప్రకటించిన గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో పెద్దం చెరువు వద్ద శిథిలావస్థలోనున్న గురిజాల నుండి నర్సంపేట పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో లోలెవల్ వంతెన స్థానంలో 3.20 కోట్ల రూపాయలతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.కాగా గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గొలనకొండ వేణు,ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
గత కొన్ని సంవత్సరాల నుండి పెద్దం చెరువు లోలెవల్ వంతెన ప్రమాదకర పరిస్థితులలో నీటి ఉధృతితో రాక పోకలు నిలిచిపోయి ఆరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు గుర్తుచేశారు. ఎమ్మెల్యే దొంతి శంకుస్థాపనతో ఆ కష్టాలు తీరానున్నాయని తెలిపారు. గురిజాల నుండి కోనాపురం వెళ్ళుటకు గ్రామ ప్రజలు, రైతులు రోడ్డు లేక అవస్థలు పడేవారని దీంతో మహేశ్వరం క్రాస్ నుండి గురిజాల, ఎంపీటీసీ రోడ్ మీదుగా కోనాపురం వెళ్ళుటకు 3.10 కోట్లతో బీటీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేయడం వారు సంతోషం వెలిబుచ్చారు. గురిజాల గ్రామంలో సీసీ రోడ్లు కాక మిగిలిపోయిన వీధులన్నీ వర్షా కాలంలో బురదమయం అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ అందుకు గాను సీసీ రోడ్లు వేయించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు వేణు,రాజేందర్ గౌడ్ పేర్కొన్నారు.

వెదజల్లే పద్దతిలో తక్కువపెట్టుబడితో అధిక దిగుబడి.

వెదజల్లే పద్దతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

వెదజల్లే పద్దతిలో విత్తనాలు నేరుగా పొలంలో చల్లడం ద్వారా, నారు తీసి నాటడం అవసరం ఉండదని కూలీల ఖర్చు, విత్తనాల అవసరం తగ్గి తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చు అని గార్ల వ్యవసాయధికారి కావటి రామారావు అన్నారు.శుక్రవారం దుబ్బగూడెం గ్రామం లో రైతులకు నేరుగా విత్తనాలు వెధజల్లే పద్ధతి పై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,తక్కువ పెట్టుబడితో నాటు అవసరం లేకుండా నారు మడి ఖర్చు లేకుండా నేరుగా విత్తనాలు వేదజల్లుకోవాలని సూచించారు.ఈ విధానం లో కూలీల అవసరం ఉండదని ఎకరాకు 6 వేల నుండి 8 వేల వరకు పెట్టుబడి ఆదా అవుతుందని,రైతులకు ఎంతో శ్రేయస్కరం లాభదయాకమని అందరూ ఈ విధానాన్ని అవలంభించి లాభాలు గడించాలని సూచించారు.ఈ పద్దతిలో విత్తనాలు చల్లిన 2 రోజుల్లో ఒక ఎకరాకు పెండిమెతలిన్ ఒక లీటర్ పిచికారీ చేయాలనీ,విత్తనాలు చల్లిన 25 రోజుల తర్వాత నామినీ గోల్డ్ కానీ కౌన్సిల్ యాక్టీవ్ గాని వివాయ గాని పిచికారీ చేసి కలుపు నివారించుకోవాలని తెలిపారు.ఎరువులు ఆఖరి దుక్కిలో డిఏపి ని 20 రోజులు తర్వాత యూరియా తో పాటు పొటాస్ 20కేజీ లు వేసుకోవాలని అన్నారు.చిరుపొట్ట దశలో 30 కేజీ లు యూరియా తో పాటు 15 కేజీ ల పొటాష్ వాడాలని, అవసరం మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని సూచించారు.ఈ పద్ధతి లో నాటు పద్ధతి కంటే 10 రోజులు ముందుగా వరి కోతకు వస్తుందని అన్ని కంకులు ఒకే సారి ఈనిక దశకు వస్తాయని, చీడ పీడల నివారణ సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ మేఘన,రైతులు తదితరులు పాల్గొన్నారు.

టీబి ముక్త్ భారత్ అభియాన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి.

టీబి ముక్త్ భారత్ అభియాన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి

★డాక్టర్ రమ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్/ఝరాసంగగం: గురువారం రోజు టీబి ముక్త్ భారత్ అభియాన్‌ను వాస్తవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల వైద్యాధికారి రమ్య మాట్లాడుతూ, ‘టీబి-ముక్త్ భారత్ అభియాన్’ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మరియు ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం అన్ని పౌరుల విధి అని అన్నారు. ఎందుకంటే మన దేశంలోని అన్ని ఇతర అంటు వ్యాధుల కంటే టిబి అత్యధిక మరణాలకు కారణమవుతుంది. ప్రపంచ జనాభాలో భారతదేశంలో 20 శాతం కంటే కొంచెం తక్కువ మంది ఉన్నారని, కానీ ప్రపంచంలోని మొత్తం టిబి రోగులలో 25 శాతానికి పైగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. 

citizens

ఇది ఆందోళన కలిగించే విషయం. టిబి బారిన పడిన వారిలో ఎక్కువ మంది సమాజంలోని పేద వర్గాల నుండి వచ్చారని కూడా ఆమె గుర్తించారు..టిబి ముక్తి కార్యక్రమం కింద, జీర్లపల్లి, తుమ్మనపల్లి, కప్పాడ్ మరియు నర్సాపూర్ గ్రామాల నుండి అనుమానిత టీబి కేసులను 102 మరియు ఆర్ బి ఎస్ కే వాహనంలో ఛాతీ ఎక్స్ రే కోసం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అన్నారు.

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు.

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు.

సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు వస్తాయని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

మామునూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండలం అమీన్‌బాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ రైతులు ఒక నెల వరి పంటను ఆలస్యంగా వేస్తున్నారని ఇకనుండి ముందుగా వేయాలని సూచించారు.

ముఖ్యంగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వరిని తొందరగా విత్తడం వలన అధిక దిగుబడి సాధించవచ్చని, తెగుళ్లు మరియు చీడ పీడలప్రభావం తగ్గించవచ్చని అలాగే ముందుగా వరి కోయవచ్చని వివరించారు.

అలాగే, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు వాడాలని అలాగే రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలన్న సూచనలు చేశారు.

రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ,చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలను కూడా చేయాలని, సమగ్ర వ్యవసాయ విధానం ను అనుసరించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ వివరించారు.

 

 

Collector

 

రైతుల ఆదాయాన్ని పెంచడమే కాక, వ్యవసాయాన్ని స్థిరీకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో 1.8 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించబడినదని విషయాన్ని వారు మరోసారి గుర్తు చేశారు.

అదేవిధంగా, చిన్న తరహా వ్యవసాయ యంత్రాల వాడకం ద్వారా పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకోవచ్చని వివరించారు.

రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమం లో మరియు వికాసిత్ కృషి సంకల్ప అభియాన్ లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని రైతులకు సూచించారు.

వికాషిత్ కృషి సంకల్ప్ జిల్లా నోడల్ ఆఫీసర్ డా. రాజన్న ప్రోగ్రాం కోఆర్డినేటర్, కేవికే మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు, కార్యాచరణ అంశాలు గురించి రైతులకు వివరించారు.

కార్యక్రమం ద్వారా రైతులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించి, మెరుగైన వ్యవసాయ పద్ధతులు అమలు చేయడం లక్ష్యమని చెప్పారు.

అలాగే డా. తమ్మీ రాజు గారు పశు పోషణ, టీకాలు మరియు పరి శుభ్రమైన పాల ఉత్పత్తి గురించి వివరించారు.

జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ ఖరీఫ్ సీజన్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం నేలలో భూసారం పెరుగుతుందని మరియు అధిక దిగుబడి రకాల గురించి వివరించారు.

పశుసంవర్ధక శాఖజాయింట్ డైరెక్టర్, డా. బాలకృష్ణ మాట్లాడుతూ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ క్రింద ఎవరైనా లోన్ తీసుకొని పశువుల పెంపకం చేపట్టాలని తెలిపారు.

నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్తలు డా. రాజు మరియు శతీష్ చంద్ర , స్థానిక మండల రెవిన్యూ అధికారి ఫణికుమార్ , మండల వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి గార్లతో పాటు రైతులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

 

భూభారతి రెవెన్యూ సదస్సుల పరిశీలించిన కలెక్టర్

అనంతరం చెన్నారావుపేట మండలం అమినాబాద్ లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించి రైతులు అందించిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
రైతులకు సులభతరమైన విస్తృత సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ తెలిపారు.

స్వీకరించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్ధాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధి కారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ నెల 20 వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

ధరఖాస్తు కోసం వచ్చే వారికి కేంద్రంలో ఏర్పాట్లు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించాలని ఆన్నారు.

రెండు బృందాలుగా రెవెన్యూ సిబ్బందిని నియమించి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఫణి కుమార్, నాయబ్ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ కాలనీలోని శ్రీకృష్ణవేణి హైస్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు బత్తిని దేవన్న తెలిపారు.15 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహించబోతున్నమన్నారు.
ఈ సమ్మర్ క్యాంపులో కరాటే, యోగా,పబ్లిక్ స్పీకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్,క్లే పోటరీ వంటి పాఠ్యేతర కార్యకలాపాలు ప్రతిరోజూ ఉదయం 7:00నుండి 9:00 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ..ఈ రోజులలో విద్యార్థుల అభివృద్ధి పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా వారిలో స్వీయనమ్మకం,ఏకాగ్రత, ఆత్మనియంత్రణ,వ్యక్తిత్వ వికాసం వంటి లక్షణాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది.కరాటే మరియు యోగా శారీరక ధైర్యం,మానసిక ఓర్పు పెంచుతాయి.ఇవి విద్యార్థులకు బౌద్ధిక స్థితి సమతుల్యతను అందిస్తూ, వారి ఒత్తిడిని అధిగమించేలా చేయగలవు.

క్యాంపు సమన్వయకర్త, సబ్జెక్టు నిపుణులు బత్తిని రాకేష్

సమ్మర్ క్యాంప్ ఏర్పాటుచేసిన సందర్భంగా మాట్లాడుతూ..ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు తమ లోకజ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవచ్చు.అలాగే ఈ తరహా కార్యక్రమాలు వచ్చే విద్యాసంవత్సరంలోనూ శ్రీకృష్ణవేణి హై స్కూల్ తరఫున కొనసాగించబడతాయని వారు తెలిపారు.ఈ ఉచిత సమ్మర్ క్యాంపు కోసం నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని తమ పిల్లల భావి ప్రగతికి బలమైన పునాది వేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.

రిజల్ట్స్ లో ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ.

ఎస్ఎస్సి రిజల్ట్స్ లో ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రోబెల్ మోడల్ హైస్కూల్ వెల్లడించిన ఎస్ఎస్సి రిజల్ట్ లో విద్యార్థుల మార్కులు 561 బి సిరిచందన 550 డి దీపాన్విత 541 బి దీక్ష 532 కె నిహారిక 521 జి వైష్ణవి మార్కులు సాధించారు
500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు 10 మంది.
100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల
గత 20 సంవత్సరాల నుండి మండలంలో కార్పొరేట్ కు దీటుగా అగ్రగామిగా నిలుస్తున్న ఏకైక పాఠశాల ప్రొబెల్ మోడల్ హై స్కూల్ అధిక మార్కులు సాధించిన భాష బోయిన సిరి చందనను సన్మానించిన ప్రొఫైల్ మోడల్ యజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు

చెరుకు రసం ఎక్కువగా తాగొద్దు..!

చెరుకు రసం ఎక్కువగా తాగొద్దు.. అధిక చక్కెర స్థాయిలతో అనారోగ్య సమస్యలు: ఐసీఎంఆర్‌!

 వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్‌ డ్రింక్‌లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్‌లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది.

 ◆ పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్‌డ్రింకులు మానుకోండి

◆ నీరు, మజ్జిగ, పండ్లు వంటివి తీసుకోవాలి

◆ భారత వైద్య పరిశోధనా మండలి సూచనలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్‌ డ్రింక్‌లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్‌లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది. చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుందని, దాన్ని తాగడాన్ని తగ్గించుకోవాలని పేర్కొన్నది. నీరు లేదా తాజా పండ్లకు సాఫ్ట్‌ డ్రింక్‌లు ప్రత్యామ్నాయం కాదని, వాటిని తీసుకోవడం మానేయాలని పేర్కొన్నది. వాటికి బదులుగా మజ్జిగ, నిమ్మ రసం నీరు, కొబ్బరి నీళ్లు, చక్కెర లేకుండా పండ్ల జ్యూస్‌లు తాగాలని సూచించింది.

sugarcane juice.

 

డీహైడ్రేషన్‌, డయాబెటిస్‌ రిస్క్‌

అధికంగా చెరకు రసం తాగడం వల్ల పలు అనారోగ్య ముప్పులు ఉంటాయని డీహెచ్‌ఈఈ డైటీషియన్‌ డాక్టర్‌ శుభా రమేశ్‌ పేర్కొన్నారు. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌ సమస్య ఎదురవుతుందని, చెమట రూపంలో శరీరం నుంచి నీరు అధికంగా బయటకు వెళ్లే వేసవిలో ఇది ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయని, తద్వారా ఇన్సులిన్‌ నిరోధకత, టైప్‌-2 డయాబెటిస్‌ ముప్పు ఏర్పడుతుంది. అదేవిధంగా అధిక కెలోరీల వల్ల బరువు పెరిగే అవకాశం ఉన్నదని, ఇది డయాబెటిస్‌, హృదయ సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

‘100% ఫ్రూట్‌ జ్యూస్‌’ అని చెప్పుకోవద్దు

ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు, లేబుల్స్‌పై నుంచి ‘100 శాతం ఫ్రూట్‌ జ్యూస్‌’ అనే పదాలను తక్షణమే తొలగించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. నీరు కలిపిన పండ్ల రసాలను నూటికి నూరు శాతం పండ్ల రసాలుగా చెప్పుకుంటూ ప్రకటనలు జారీ చేస్తున్నట్లు, లేబుల్స్‌పై రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అమ్ముతున్న జ్యూస్‌లో అత్యధిక భాగం నీరైనపుడు, అది 100% ఫ్రూట్‌ జ్యూస్‌ అని చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని తెలిపింది.

పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం.

జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ప్రారంభోత్సవం:

 

నేటిధాత్రి

 

 

 

 

తేదీ: 21-04-2025 నాడు జిల్లా పరిషత్ కథలాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది ఆధునికరణ కొరకై పాఠశాల పూర్వ విద్యార్థి గుండేటి ప్రసాద్ మమత దంపతులు గారు విరాళాలు అందజేయడం జరిగినది. ఇట్టి కంప్యూటర్ గదిని వారి తల్లి గారైన గుండేటి గంగుబాయి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎం అర్జున్ గారు మాట్లాడుతూ నేటి యుగంలో పిల్లలకు తప్పనిసరిగా కంప్యూటర్ విద్యపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇట్టి కంప్యూటర్ గది ఆధుని కొరకు సహకరించిన గుండేటి రాజేంద్రప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. బోగోరి గంగాధర్ లక్ష్మీ నర్సు, ఉపాధ్యాయులు ఎస్ వెంకటేశం, పి దరందీప్, పి శశిధర్, డి ఏడుకొండలు, జి అశోక్ ,రాజ్యలక్ష్మి, లక్ష్మి, ఉమాదేవి, నీలిమ, షాహినా, రవీందర్, సుమన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి

పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి

జైపూర్,నేటి ధాత్రి:

పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి
తెలంగాణలోని వాహనదారులకు భారీ షాక్ తగలనుంది.2019కి ముందు కొన్న వెహికిల్స్ అయితే వాటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ ప్లేట్‌లను సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించింది.లేకుంటే ఆ వాహనాలను అమ్మడానికైనా, కొనడానికైనా వాహనంపై ఉన్న ఇన్సూరెన్స్,పొల్యూషన్ వర్తించవని వెల్లడించింది.ఒకవేళ అలాంటి వాహనాలు రోడ్డుపై తిరిగితే వాటిని పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.

బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం.

నేడు సిరిసిల్ల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలల పుస్తక దినోత్సవం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )

 

 

సిరిసిల్ల పట్టణంలోని గీతా నగర్ లోని బాలల పుస్తక దినోత్సవం (Children’s Book Day) ప్రతి ఏడాది ఏప్రిల్ 2న జరుపుకుంటారు.

ఈ రోజు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సిరిసిల్ల లో బాల చెలిమి గ్రంథాలయములో , చదవడం, గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది.

ఈ రోజు విద్యార్థులు చవిచూసి, కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి పెంచేందుకు ఉద్దేశ్యమైంది.

అలాగే పుస్తకాలు చదివిన తరువాత కథ పై సమీక్షా రాయలని చెప్పడం జరిగింది.

Children’s

 

ఇది హాన్‌సా క్రిస్టియన్ ఆండర్సన్ యొక్క జయంతి సందర్భంగా, అతను పిల్లల కథలను రచించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మంచి పుస్తకాలు అందించడం ద్వారా ప్రసిద్ధి చెందాడు.

ప్రధానోపాధ్యాయులు L. శారదా మాట్లాడుతూ ఈ రోజు పిల్లలు పుస్తకాల మధ్య ప్రయాణం చేస్తూ, కొత్త కథలు చదవడానికి, అక్షరాల మహిమను తెలుసుకునేందుకు ప్రేరణ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం లో బాల చెలిమి గ్రంధాలయం ఇంచార్జ్ ఎలగొండ రవి పాల్గొన్నారు.

మందమర్రి హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించ.!

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి కార్మల్ హైస్కూల్ లో పిల్లలు సైన్స్ కు సంబంధించి రంగులతో ముగ్గులు వేసి అలరించారు.

మందమర్రి నేటి ధాత్రి

Science

ఈ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తేదీ 4 -3 -2025 రోజున మన కార్మెల్ పాఠశాలలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ రంగోలి కార్యక్రమంలో భౌతిక రసాయన శాస్త్రాలు మరియు జీవ శాస్త్రాలు యొక్క పటాలను విద్యార్థులు చాలా చక్కగా డ్రా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి డాక్టర్ ఫాదర్ జె.వి.ఆర్ రెక్స్ జె, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎమ్ కుమారస్వామి, జీవశాస్త్ర ఉపాధ్యాయిని ఐ సునీత మేడం ఇతర సైన్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పిఈటి కృష్ణ గారు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని ఈ రంగోలి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.

నేటిధాత్రి కథనం,తో ఉద్యోగుల పై “ఆ అధికారి” ఆగ్రహం.!?

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!?

నేను మీ బాస్,మీకు ఉద్యమం నుండి తొలగిస్తా అంటూ సీరియస్.!?

అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!?

ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!?

ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!?

ఆ అధికారి బండారం బయటకు వచ్చిన ఉన్నత అధికారులు స్పందన కరువు ఎందుకు.!?

మహాదేవపూర్-నేటిధాత్రి:

నేటి రాత్రి దినపత్రిక ప్రచురించిన “అవినీతికి పాల్పడితేనే, సై లేదంటే విజిలెన్స్ దాడులు.” అనే శీర్షికపై మండలంలోని ఆ శాఖ అధికారి తన సిబ్బందిపై విరుచుక పడినట్లు సమాచారం. శాఖలోని విభాగాలకు సంబంధించిన బాధ్యతలను విధుల నుండి తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా శాఖలో జరిగే వ్యవహారం బయటకు ఎలా వెళ్లిందని సిబ్బందితోపాటు శాఖలోని విభాగాలకు సంబంధించిన పలువురిని ప్రత్యేకంగా మీరే చెప్పారంటూ వార్నింగ్లు ఇవ్వడం జరిగిందని, ఇదే క్రమంలో ఆ అధికారి ప్రత్యేకంగా కొందరు శాఖలోని ఉద్యోగులతో పాటు విభాగాలకు సంబంధించిన బాధ్యులపై మరింత ఒత్తిడి పెంచినట్లు విశ్వ నీ సమాచారం. ఆ శాఖ అధికారి వ్యవహారం తిర పైకి వచ్చినప్పటికీ కూడా ఉన్నత అధికారులు విచారణ జరిపించకపోవడం అధికారిపై చర్యలు తీసుకోకపోవడం శాఖలోని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!?

మండలంలోని ఆ శాఖ అధికారి వ్యవహారం సొంత శాఖలో విజిలెన్స్ దాడులు, అవినీతికి పాల్పడకుంటే సిబ్బందితోపాటు, విభాగాల బాధ్యులపై కక్ష సాధింపుతో విజిలెన్స్ దాడులు ఉద్యోగం నుండి వెళ్లిపోయేలా హింసించడం, ఆ అధికారికి గత కొన్ని నెలలుగా మహాదేవపూర్ మండల ఆ శాఖ సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు హింసను తట్టుకోలేకపోతున్న క్రమంలో విజిలెన్స్ దాడులు తెరపైకి రావడం ఆ శాఖ అధికారి వ్యవహారం అంతర్గతంగా మండలమంతా ఇతర శాఖల్లో కూడా చర్చనీయంగా మారడంతో, నేటి ధాత్రి ఆదివారం రోజు,” అవినీతికి పాల్పడితేనే సై లేదంటే విజిలెన్స్ దాడులు” అనే శీర్షికను ప్రచురించింది. ఆదివారం శీర్షిక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న క్రమంలో ఆ శాఖ అధికారి వ్యవహారమంతా ఆ శీర్షికలో ఉండడం తన శాఖ తన గురించి ఇలా బయటికి వచ్చిందని,ఆదివారం సెలవు రోజు తన మొబైల్ ఫోన్ ను పనిలో పెట్టడం చేశాడట అధికారి, కిందిస్థాయి ఉద్యోగులతో పాటు శాఖలోని ఇతర విభాగాల బాధ్యులకు ఫోన్ ద్వారా వార్నింగ్ లు ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం. తనకు ఏమనుకుంటున్నారు, మీ శాఖ అధికారిని అంతర్గత వ్యవహారం ఏలా బయటికి పొక్కింది, నేను ఏమైనా చేస్తా మీరు ఎలా సమాచారం బయటకి చెప్తారు, ఉద్యోగం పై ప్రేమ లేదా, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి మీ ఉద్యోగం పోయేలా చేస్తానని సిబ్బంది మరియు, ఆ శాఖలోని విభాగాల బాధ్యులకు వార్నింగ్ లు ఇవ్వడం తో ప్రస్తుతం శాఖలోని కిందిస్థాయి సిబ్బంది తమపై అన్యాయాలు చేసి అవినీతికి పాల్పడాలి అనే అధికారి తమకు ఉన్నత అధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకుంటున్నట్లు సమాచారం.

అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!?

ఆ శాఖ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కింది స్థాయి ఉద్యోగులకు శాఖలోని ఇతర విభాగాలకు సంబంధించిన బాధ్యులకు, కచ్చితంగా అవినీతి చేసి తమ వాటా ఇవ్వాలని ఒత్తిడి తట్టుకోలేక ఆ శాఖకు సంబంధించిన కొందరు బాధ్యులు కిందిస్థాయి ఉద్యోగులు బదిలీ చేసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అలాగే మరికొందరు ఉద్యోగులు సైతం తమ రిటైర్మెంట్ కాలం దగ్గర ఉందని అధికారి ఒత్తిడికి చెప్పుకోలేక విధులు నిర్వహిస్తున్నట్లు, మరికొందరు అధికారిని ప్రశ్నించే సత్తా ఉన్నప్పటికీ పై అధికారులు కూడా ఆ అధికారికి అంతర్గతంగా సహకారం ఉందని తెలుసుకున్న సిబ్బంది ఇతర శాఖల బాధ్యులు, చేసేదేమీ లేక వీరి ప్రాంతానికి బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం ఆ శాఖ పరిస్థితి ప్రతి ఒక్కరూ బదిలీపై వెళ్లే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో శాఖలోని విభాగాలు కిందిస్థాయి ఉద్యోగులు లేక శాఖ కార్యాలయం తో పాటు కార్యకలాపాలు త్వరలో ఆగిపోయే పరిస్థితి నెలకొల్పే విధంగా కనబడుతుంది.

ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!?

మండలంలోని ఆ శాఖ అధికారి ప్రస్తుతం మూడు ప్రధాన విభాగాలను టార్గెట్ చేసి ఎక్కువ మోతాదులో ఆదాయ వనరులు ఉండడంతో ఆ విభాగాలకు సంబంధించిన బాధ్యులను ప్రధానంగా టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో నెలసరి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ శాఖలోని మిగతా విభాగాలు తక్కువ మోతాదులో ఆదాయ వనరులు ఉండడంతో వారిని కూడా వారి స్తోమతకు మించి అవినీతికి పాల్పడాలని హింసిస్తూ తనకు నెలసరి వాటా కచ్చితంగా ఇవ్వాలని నికిత చిన్న తరహాలో నిర్వహించబడుతున్న విభాగాల బాధ్యులకు హుకుం జారీ చేసి వారి వద్ద నుండి నెలసరి జీతంల అక్రమ సొమ్మును పీడించి వసూలు చేయడం జరుగుతుందని లేదంటే విజిలెన్స్ దాడులకు సిద్ధంగా ఉండాలని అధికారి హుకుం జారీ చేయడం జరుగుతుందని సమాచారం. అధికారి ఒత్తిడికి తట్టుకోలేక సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు అవినీతికి పాడు పరిస్థితి లేకపోవడంతో తమ జీతాల నుండి అధికారికి రూపాయలు ఇచ్చి ఎలాగో అలా తమ ఉద్యోగాన్ని దక్కించుకొని విధులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నట్లు సమాచారం.

ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!?

జిల్లాలోని సొంత శాఖలో కిందిస్థాయి ఉద్యోగులు విభాగాల బాధ్యులకు అవినీతి కొరకు ప్రోత్సహించి నెలసరి జీతం లాగా అక్రమాలు చేసి సొమ్ము అందించాలని లేదంటే విజిలెన్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి ఉద్యోగం లేకుండా చేస్తానని సొంత శాఖ సిబ్బంది విభాగాల బాధ్యులకు పీడిస్తున్న ఆ అధికారి బండారం బయటపడినప్పటికీ, శాఖకు సంబంధించిన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరోవైపు ఆ శాఖలోని సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు పీడించే ఆ అధికారికి జిల్లాలోని కొందరు ఉన్నత అధికారులు అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నారని అందుకొరకు ఆ అధికారి తనకంటే పై అధికారులకు కూడా గౌరవం భయం లేనివిధంగా ప్రభాస్ తీస్తున్నాడని చెప్పుకుంటూ ఆశ్చర్యా పోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ అధికారి ఎక్కడ విధులు నిర్వహించిన, కింది స్థాయి ఉద్యోగులకు పీడించడమే లక్ష్యంగా అవినీతికి పాల్పడి తనకు సొమ్ము అందించడమే సిబ్బంది విభాగాల బాధ్యులు చేసే ప్రధాన పని అని పీడించడం ఆ అధికారికి కొత్తవి కాదని, కానీ జిల్లా మరియు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటివరకు ఆ అధికారిపై చర్యలు తీసుకోకపోవడం ప్రధాన కారణం ఏమిటో ఆ శాఖ పలు అధికారులకు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ఏది ఏమైనా సొంత శాఖలో ఇలా అవినీతి చేసి ప్రతినెలా మామూలు ఇవ్వాలని పీడిస్తున్న మండలంలోని ఓ శాఖ అధికారి ఇలాంటి అధికారి మరియు శాఖ రాష్ట్రంలోని ఎక్కడ ఉండదు, కానీ ఈ అధికారి మాత్రం నిర్భయంగా సొంత శాఖలో సిబ్బందికి విభాగాల బాధ్యులకు పీడించి అక్రమ సొమ్ము నెలసరి జీవితంలో దోచుకోవడం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆ శాఖలో ఈ అధికారిపై రోజుకు ఒక కొత్త రకమైన అవినీతి తెరపైకి రావడం అధికారులు ఇలాంటి చర్యలపై మొగ్గు చూపుతారు అన్నది వేచి చూడాల్సిందే.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

జెడ్పి హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవవేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ లో మంగళవారం రోజున విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ను జరుపుకున్నారు.
విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా మంచి వేషధారణతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులను మరిపించే విధంగా బోధన చేశారు వీరి తీరును చూసి ఎంఈఓ కోడపాక రఘుపతి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పుల్ల హర్షవర్ధన్ ఎంఈఓ గా వెళ్దండి సహస్ర, డిఈఓ గా మొగుళ్ళ సాయి చరణ్,లు వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి జడ్జిలుగా తుపాకుల వందన,గడ్డం శంకర్,కుచనపల్లి శ్రీనివాసులు వ్యవహరించారు.
అనంతరం వారి అనుభవాలను పంచుకున్నారు. పవిత్రమైన బోధనా వృత్తి తమకంతో ఆనందం కలిగించిందని, అందులోని కష్టసుఖాలను ఈ కార్యక్రమంలో ద్వారా తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోడపాక రఘుపతి ఎంఈఓ , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి గారు ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, సరళాదేవి,నీలిమారెడ్డి, విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, బుర్ర సదయ్య,సుజాత,బుజ్జమ్మ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version