చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ..

చర్లపల్లి పాఠశాలలో కార్గిల్ దివాస్ రజితోత్సవ సభ

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కార్గిల్ దివాస్ విజయోత్సవ సభను ఘనంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కార్గిల్లో వీరమరణం పొందిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
భారత్ పాకిస్తాన్ మధ్య మే 1999 జూలైలో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగిందనీ ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు,కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం అని,యుద్ధ ప్రారంభదశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యిందనీ, నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుందనీ,అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగిందనీ,ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ అని, ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది అని అన్నారు.దివాస్ ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటారనీ, 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారనీ,ఈ సందర్భంగా,భారత సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను స్మరించుకుంటారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకవత్ దేవా,కంచ రాజు కుమార్ అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ నందిపాటి సంధ్య,నిడిగొండ అక్షయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version